TRAVEL

లోనావాలా సోయగాలు చూసొద్దామా..!

స్వర్గాన్ని భూమి మీద చూడాలనుకునే వారు లోనావాలా వెళ్లాల్సిందే. ఇక్కడి ప్రకృతి సోయగాలు అందరిని మైమరపిస్తాయి. ట్రెక్కింగ్, హైకింగ్, క్యాంపింగ్‌ చేయాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు. వీటితో పాటు చారిత్రక నేపథ్యం కలిగిన అద్భుతమైన కోటలను కూడా చూడవచ్చు. అక్కడి నుంచి కనిపించే పర్వతాలను చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ఇది మహారాష్ట్ర, పూణెకు 96 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచి చేరుకోవడానికి విమానంలో పూణెకి వెళ్లి అక్కడి నుంచి బస్సులో వెళ్లాల్సి ఉంటుంది. రైలు మార్గంలో వెళ్లాలనుకునేవారు ముంబాయికి వెళ్లి అక్కడి నుంచి బస్సులో వెళ్లవచ్చు. లేదా సొంత వాహనంలో కూడా వెళ్లవచ్చు.  

లోనావాలాలో చూడవలసిన ప్రదేశాలు.. 

ఇక్కడ చూడడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. కానీ, చాలామంది ఆసక్తిగా చూడాలనుకునే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..

* డ్యూక్స్ నోస్

* లయన్స్ పాయింట్

* భూషి డ్యామ్

* లోనావాలా సరస్సు

* డ్యూక్స్ నోస్ పై ట్రెక్కింగ్

* రాజ్ మచి కోట

* ఆంబీ వ్యాలీ

* వాక్స్ మ్యూజియం

* కార్లా కేవ్స్

* వాల్వన్ డ్యామ్

* భజే గుహలు

* లోహగడ్ కోట

* ఆందోలిలో క్యాంప్

Show More
Back to top button