Telugu News

ఉద్యోగం పోయినా.. ఆర్థికంగా దృఢంగా ఉండండిలా..

గత కొన్ని రోజుల నుంచి దేశ ఆర్థిక పరిస్థితి అతలకుతలంగా ఉంది. చాలామంది ఆర్థిక నిపుణులు ద్రవ్యోల్బణం వస్తుందని చెబుతున్నారు. దీంతో పెద్దపెద్ద కంపెనీలు ఎక్కువ వారి ఉద్యోగులను తీసేస్తారని చాలామంది భయపడుతున్నారు. ఉద్యోగం తొలగిపోతే నెలవారి ఖర్చులకు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని మనస్తాపానికి గురి అవుతున్నారు.

ఈ పరిస్థితి రాకూడదు అంటే.. ముందు నుంచే ప్రణాళికలు వేసుకోవాలి. అందులో మొదటిది ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం. కనీసం మీ 6 నెలల నెలవారి ఖర్చులకు సరిపడ డబ్బును పక్కకు పెట్టుకోవాలి. ఇది పెట్టుబడి రూపంలో లేదా నగదు రూపంలో కూడా పెట్టుకోండి. దీనివల్ల మీకు ఆర్థిక రక్షణ ఉంటుంది.

PFని ఉపయోగించుకోవడం. ఉద్యోగం మానేసిన 2 నెలల తర్వాత PF ఖాతా నుంచి మొత్తం డబ్బులు తీసుకోవచ్చు. కానీ 5 సంవత్సరాల లోపు తీసుకుంటే పన్ను చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి మీ అత్యవసర సమయంలో తప్ప ఇతర ఏ కారణాల చేత మీ PF ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేయకండి. దీనితో పాటు అన్‌ఎంప్లాయిమెంట్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఉత్తమం.

ఎందుకంటే నిరుద్యోగ సమయాల్లో మీరు ఖచ్చిత ఆదాయాన్ని కంపెనీ అందిస్తుంది. ఒకవేళ మీకు లోన్‌లు ఉంటే వాటికి కూడా ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్. వీటితో పాటు అనవసర ఖర్చును చేయకండి. దీనివల్ల మీ ఆర్థిక స్వేచ్ఛ దెబ్బ తింటుంది. అలాగే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Show More
Back to top button