HEALTH & LIFESTYLE

అర్ధరాత్రి హార్ట్ ఎటాక్‌లు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి?

ఒకప్పుడు ఉదయం టైంలో ఎక్కువగా గుండెపోటు వస్తుందనేది సాధారణ నమ్మకం. కానీ తాజాగా రిజిస్టర్ అవుతున్న కేసులు చూస్తే, అర్ధరాత్రి నుంచి తెల్లవారేంత వరకూ హార్ట్ ఎటాక్‌లు స్పైక్ అవుతున్నాయంటూ ఆసుపత్రుల రికార్డులు చెబుతున్నాయి. ముఖ్యంగా 3 AM నుంచి 6 AM మధ్యే ఎక్కువ కేసులు వస్తున్నాయట. దీనికి ముఖ్యమైన కారణం శరీరంలోని బాడీ క్లాక్ లేదా సర్కేడియన్ రిథమ్.

ఈ టైమింగ్‌లో హార్మోన్‌లు, రక్తపోటు, నాడీ వ్యవస్థ అన్నీ కలిసి బాడీలో రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కార్టిసాల్ అనే హార్మోన్ అర్ధరాత్రి నుంచి పెరగడం మొదలవుతుంది. ఇది రక్తంలో గడ్డకట్టే ధోరణిని పెంచుతుంది. ప్లేట్‌లెట్లు యాక్టివ్‌గా మారడం వల్ల చిన్నగా ఉన్న బ్లాకేజీలు ఒక్కసారిగా హార్ట్ ఎటాక్‌కి దారి తీస్తాయి.

రిస్క్‌లో ఎవరు ఉంటారు?

బీపీ, షుగర్, ఊబకాయం ఉన్నవారు ఈ టైమ్‌లో డేంజర్ జోన్‌లో ఉంటారు. నిద్రలో ఉండటం వల్ల ఛాతి నొప్పి గుర్తించకపోవచ్చు. అలాగే ఆక్సిజన్ డ్రాప్ కూడా జరగొచ్చు. ఎక్కువగా డయాబెటిస్ ఉన్నవారు ఛాతి నొప్పిని అసలే ఫీలవ్వరు. దీంతో హార్ట్ ఎటాక్ వచ్చిందన్న సిగ్నల్స్ మిస్సవుతాయి. కాబట్టి వీరు మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి.

Show More
Back to top button