
ఇతర దేశ స్టాక్ మార్కెట్‌పై పెట్టుబడులు పెట్టడం అనేది మన పోర్ట్‌ఫోలియోకి ఎంతగానే సహాయపడుతుంది. ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫికేషన్‌కి ఇది ఒక మంచి ఎంపిక. దీనివల్ల చాలామంది భారతీయులు US స్టాక్స్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఇలా కొన్న స్టాక్ అవసరానికి అమ్మితే.. వచ్చిన లాభం మీద పన్ను చెల్లించాలా..? అనే ప్రశ్న ఎదురవుతుంది. దీని గురించి స్పష్టంగా తెలియాలంటే.. స్టాక్స్ ద్వారా ఎన్ని రకాలుగా మనకు లాభం వస్తుందో తెలుసుకోవాలి. సాధారణంగా డివిడెండ్, క్యాపిటల్ గెయిన్ ఇలా మనకు రెండు రకాలుగా స్టాక్ మీద లాభం వస్తుంది. వీటి మీద మనం చెల్లించే పన్ను కూడా వేరుగా ఉంటుంది.
డివిడెండ్: మీరు పెట్టుబడి పెట్టిన కంపెనీలకు లాభం వస్తే.. దాన్ని ఇన్వెస్టర్లతో పంచుకోవడానికి చూస్తాయి. ఇలా లాభాన్ని డివిడెండ్ రూపంలో పెట్టుబడిదారులకు అందిస్తారు. ఇలా మీకు US షేర్ మార్కెట్ ద్వారా డివిడెండ్ వస్తే 25% వరకు US ప్రభుత్వానికి, 5% భారత్ ప్రభుత్వానికి పన్నును చెల్లించాల్సి వస్తుంది.
క్యాపిటల్ గెయిన్: మీరు పెట్టుబడి పెట్టిన షేర్స్ ధర పెరిగినప్పుడు వచ్చిన లాభాన్ని కాపిటల్ గెయిన్ అని అంటారు. ఇందులోనూ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి లాంగ్ టర్మ్ గెయిన్. మీరు పెట్టుబడి పెట్టిన 24 నెలల తర్వాత షేర్స్‌ని అమ్మితే దాన్ని లాంగ్ టర్మ్ గెయిన్ అని అంటారు. ఇందులో మీరు చెల్లించాల్సిన పన్ను 20% ఉంటుంది. అదే మీరు 24 నెలల లోపు అమ్మితే దాన్ని షార్ట్ టర్మ్ గెయిన్స్‌గా పరిగణిస్తారు. మీ టాక్స్ స్లాబ్ ఆధారంగా షార్ట్ టర్మ్ కాపిటల్ గెయిన్‌పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.






