
బ్లడ్ క్యాన్సర్ ప్రారంభ దశలో కనిపించే లక్షణాలు చాలా మందికి సాధారణ అనారోగ్యంలా అనిపించొచ్చు. కానీ శరీరం మనకు ముందే కొన్ని సంకేతాలు ఇస్తుంది. ఉదయం లేచి ఎంత విశ్రాంతి తీసుకున్నా అలసట చెరిగిపోకపోవడం, ఆకలి తక్కువవడం, తిన్నా బరువు తగ్గిపోవడం మొదట్లో చిన్న విషయాల్లా అనిపించొచ్చు. కానీ ఇవే లక్షణాలుగా మారే ప్రమాదం ఉంటుంది.
చిన్న గాయానికి ఎక్కువగా రక్తం కారటం, శరీరంపై నీలం, పచ్చటి మచ్చలు కనిపించటం ప్లేట్లెట్లు తక్కువగా ఉన్న సంకేతాలు. అలాగే తరచూ జ్వరం రావడం, రాత్రిపూట తీవ్రమైన చెమటలు రావడం, ఒంట్లో అసహజమైన వాపులు ఉండటం కూడా రక్త క్యాన్సర్‌తో సంబంధం ఉండొచ్చు.
కీళ్లలో నొప్పులు, ఎముకల్లో చిరాకు, మెడ, చేతుల కింద గడ్డలు (లింఫ్ నోడ్స్) వాపటం వంటి లక్షణాలు కనిపించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి శరీరంలో లోతుగా జరుగుతున్న మార్పుల సూచన అని భావించి.. వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది.
ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోవాలంటే.. శరీరం చెప్పే చిన్న చిన్న సంకేతాలను తక్కువ అంచనా వేయకుండా, ముందే పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స విజయవంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.






