బయట ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి.. అడుగు బయటపెడితే అగ్నిగుండంలా అనిపిస్తోంది. ఈ ఉక్కపోతకి తోడు ఒళ్లంతా చెమటకాయలు వచ్చి మంట, దురదతో ప్రాణం తీస్తుంటాయి. అసలు ఈ చెమటకాయలు ఎందుకు వస్తాయంటే.. మన బాడీలో చెమట గ్రంధులు మూసుకుపోయినప్పుడు ఆ చెమట బయటికి రాలేక చర్మం కింద ఆగిపోయి అలా ఎర్రటి కురుపుల్లా తయారవుతుంది. దీనికి తోడు మనం వేసుకునే గాలి ఆడని నైలాన్ బట్టలు బయట ఉండే తేమ ఈ సమస్యను ఇంకా ఎక్కువ చేస్తాయి.
చెమటకాయలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఈ టైంలో వీలైనంత వరకు కేవలం కాటన్ బట్టలే వేసుకోండి.. అవి వదులుగా ఉంటే చర్మానికి గాలి బాగా అందుతుంది. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగుతూ బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. అలాగే చర్మం మీద ఆ మందపాటి క్రీములు, ఆయిల్స్ అస్సలు రాయకండి దానివల్ల చర్మ రంధ్రాలు ఇంకా మూసుకుపోతాయి.
దురద, మంట తగ్గాలంటే ఇవి ఫాలో అవ్వండి..
* చెమటకాయలు ఇబ్బంది పెడుతుంటే రోజుకు రెండు సార్లు చల్లటి నీటితో స్నానం చేయండి. సబ్బు వాడకం తగ్గించడం మంచిది.
*తాజా అలోవెరా జెల్ కానీ, గంధం కానీ ఆ చోట రాస్తే మంట తగ్గి చర్మం వెంటనే చల్లబడుతుంది.
*స్నానం చేసే నీళ్లలో వేప ఆకులు వేసుకుంటే బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది.










