TRAVEL ATTRACTIONS

జీరో వ్యాలీకి టూర్ ప్లాన్ చేసేయండి..!

చాలామంది వారి బిజీ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకుని ఏదైన టూర్‌కి వెళ్లాలని అనుకుంటారు. అలాంటి సమయాల్లో ప్రకృతికి దగ్గరగా ఉండే జీరో వ్యాలీకి టూర్ ప్లాన్ చేసేయండి. ఇక్కడ మీరు గడిపే ప్రతి క్షణం ఒక వరంలా అనిపిస్తుంది. అంత అందమైన స్థలం ఇది. భూలోక స్వర్గంగా పేరుగాంచిన ఈ వ్యాలీ అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి చేరుకోవడానికి విమాన మార్గం అయితే ముందుగా Dibrugarh Airportకి చేరుకుని అక్కడి నుంచి క్యాబ్‌లో 4 గంటలు ప్రయాణిస్తే జీరో వ్యాలీ చేరుకుంటారు. ఒకవేళ రైలు మార్గం ద్వారా ప్రయాణించాలనుకుంటే Rangiya jnకి చేరుకుని అక్కడి నుంచి Harmutiకి మళ్లీ రైలులో 5 గంటలు ప్రయాణించిన తర్వాత క్యాబులో 1.5 గంటలు ప్రయాణిస్తే జీరో వ్యాలీ చేరుకుంటారు. సొంత వాహనంలో చేరుకోవాలంటే.. దూరం ఇలా ఉంది.

హైదరాబాద్ నుంచి 2,674 కి.మీ దూరం ఉంటుంది.

విజయవాడ నుంచి 2,444 కి.మీ దూరం ఉంటుంది.

తిరుపతి నుంచి 3,256 కి.మీ దూరం ఉంటుంది.

 ఇక్కడ సెప్టెంబర్‌లో పండుగలు జరుగుతాయి. ఆ సమయంలో అయితే ఫెస్టివల్ వైబ్స్ బాగుంటాయి. ఇతర సమయాల్లో వెళ్తే అక్కడి అందాలను ప్రత్యేకంగా చూడవచ్చు. జీరో వ్యాలీలో చూడాల్సిన ప్రదేశాలు..

కిలో పాకో  

టిపి ఆర్చిడ్ రీసెర్చ్ సెంటర్

టరిన్ ఫిష్ ఫార్మ్

డోలో మండో

టాలీ వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ

మిడే

పైన్ గ్రూవ్

జీరో పుటో

టూర్ బడ్జెట్

మీరు ఎంచుకున్న రవాణా ప్రకారం ప్రయాణ ఖర్చు ఉంటుంది.

రోజుకు రూం రూ.1500 నుంచి రూ.2000 వరకు అవుతుంది.

ఆహారానికి రోజుకు ఒకరికి రూ.400 – రూ.600 వరకు అవుతుంది.

షాపింగ్‌కి, అనుకోని ఖర్చు వస్తే దానికి మరో రూ.1500 నుంచి రూ.2000 వరకు తీసుకెళ్లడం మర్చిపోవద్దు.

Show More
Back to top button