తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ అమెరికాలోని డల్లాస్‌లో ప్రవాసాంధ్రులతో “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 6, 2025 (శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు గార్లాండ్‌లోని సుప్రసిద్ధ కర్టిస్ కల్వెల్ సెంటర్ (CURTIS CULWELL CENTER) వేదికగా ఈ భారీ సభ జరగనుంది.
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి హోదాలో ఉన్న లోకేష్, తెలుగు ప్రవాసులతో మమేకమై, రాష్ట్ర అభివృద్ధికి వారి సహకారం, పెట్టుబడుల ఆవశ్యకత గురించి చర్చించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, యువత కోసం చేపట్టిన విద్యా, ఉద్యోగ కార్యక్రమాలను ప్రవాసులకు వివరించి, రాష్ట్ర పురోగతిలో భాగస్వాములను చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరు ఉచితం కావడం, ఉచిత పార్కింగ్ సదుపాయం కల్పించడం ద్వారా ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులను ఆకట్టుకునేలా ఉచిత బీమా నమోదు లాంటి ప్రత్యేక సౌకర్యాన్ని కూడా ప్రకటించడం విశేషం. సమావేశానంతరం విందు కూడా ఏర్పాటు చేశారు. అయితే, సభా నిర్వహణ, భద్రతా కారణాల దృష్ట్యా ఈ సమావేశానికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని నిర్వాహక కమిటీ స్పష్టం చేసింది.
డల్లాస్ ప్రాంతంలోని ప్రవాసాంధ్రులు, ఎన్నారై టీడీపీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ ద్వారా యువనేత లోకేష్, ప్రవాసుల(NRI) మనసుల్లో ప్రభుత్వానికి మరింత బలాన్ని చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Registration (Not Mandatory): https://apnrts.ap.gov.in/dallas_meet
Open event with spot registration available; online registration is optional.
Event Highlights:
✅ Free Entry
✅ Free Parking
✅ Dinner Served
✅ Cultural Entertainment
📸 Every individual will have the opportunity to take a photograph with Nara Lokesh.
📍 Venue: Curtis Culwell Center, 4999 Naaman Forest Blvd, Garland, TX 75040
🕒 Date & Time: December 6th (Saturday), 2:00 PM to 7:00 PM










