నాగ సాధువుల గురించి మీరు వినే ఉంటారు.అయితే ఈ నాగ సాధువులు ఎవరికీ కనిపించరు,ఎవరూ చూడకుండా సుక్ష్మ శరీరంతో తిరుగుతూ మనమధ్యే ఉంటారని కొందరి అభిప్రాయం.
నేను చదివిన కొన్ని నవలల్లో కూడా ఈ నాగ సాధువుల గురించి విన్నాను.అలా చదువుతున్నప్పుడు నా ఒళ్ళు జలదరించింది అంటే నమ్మండి.కేవలం గాలి పీలుస్తూ అది కూడా ఎక్కడి నుండి వస్తుందో తెలియని ప్రదేశంలో ఒంటికాలితో జపం చేస్తూ,ప్రపంచాన్ని మనోనేత్రం ద్వారా చూస్తారని,ఆపద ఎదురైనప్పుడు,లేదా కొన్ని విపత్కర పరిస్థితుల్లో వచ్చి ఆపద నుండి కాపాడతారని చదివాను. కానీ ఎవరికీ అర్ధం కానీ గుహలలో,చీకట్లో ఉన్నప్పటికీ వారీ శరీరం కాంతిమయంగా ఉంటుంది అని ,అన్నపానియాలు లేకుండా వందల ఏళ్ళు బ్రతుకుతారని ఆ నవలలో చదివాను,అదంతా కాస్త ఉహయిన ఎంతోకొంత నిజం తెలుసుకోకుండా రాయరు.
కాబట్టి మనం నమ్మాల్సిందే,అప్పుడే నాకు అనిపించిది,ఈ నాగసాధువుల గురించి తెలుసుకోవాలి అని, కొన్నేళ్ళ నిరీక్షణ తర్వాత కొన్ని గ్రంధాలు చదవడం,వార్తల్లో నాగసాధువులు కనిపించారంటూ వచ్చిన వార్తల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోగలిగాను.
అవే ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను.మీరు తప్పక తెలుసుకోవాల్సిన విశేషాలు ఇవి. వారిని నమ్ముకుంటే ఎలాంటి ఆపదలు రావని కొందరి విశ్వాసం,శంకరుని ప్రతిక అని చెప్తారు.ఆ ఈశ్వరుడి అనుగ్రహం పొందిన నాగ సాధువుల గురించి రాయడం నా అదృష్టంగా భావిస్తూ.. ఇక వారి గురించి తెలుసుకుందాం..
ఎక్కడ ఉంటారు?
కుంభమేళా, అర్ధకుంభమేళాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే నాగ సాధవుల గురించి ఎన్నో చిక్కని ప్రశ్నలున్నాయి. అసలు నాగ సాధవులు ఎవరు? ఎక్కడ ఉంటారు? వారు ఎందుకు ఏర్పడ్డారు? అనే ఎన్నో ప్రశ్నలు సామాన్యులకు వస్తుంటాయి. చాలా మంది వీరిని అఘోరాలుగా భావిస్తారు కానీ అఘోరాలు వేరే, నాగ సాధవులు వేరే. నాగ సాధువుల గురించి ఎన్నో విషయాలు విన్పిస్తూ ఉంటాయి.
శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్యుల కాలంలో దేశంలో బౌద్ధం బాగా ప్రాచుర్యంలో ఉండగా.అరబ్ లు, పార్శీలు దేశంలోకి ప్రవేశించి హిందూ దేవాలయాలను,సాధువులను చంపుతుండేవారు.
వారిని కట్టడి చేయడానికి అప్పటి రాజులు ఎంత ప్రయత్నించినా అది కుదిరేది కాదు. దీంతో హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన అవసరముందని గుర్తించిన ఆదిశంకరాచార్యులు.ఓ వర్గాన్ని తయారు చేశారు.
ఆ వర్గమే నేటి నాగ సాధువులు. మంత్రాలకు చింతకాయలు రాలనట్లే.. శాపాలు, ఆర్థనాదాల వల్ల హిందూ ధర్మం నిలబడలేదని,దాన్ని నిలబెట్టాల్సిన ధర్మం నాగ సాధువులకు అప్పగించారు.
హిందూ ధర్మాన్ని రక్షించడం పరమావధిగా వీరు జీవిస్తుండగా.ఎప్పుడూ శివ నామస్మరణ చేస్తుంటారు. మంత్రాలతో పాటు అస్త్రశస్త్రాలను ఎలా ప్రయోగించాలో వీరి మరింత తర్ఫీదు తీసుకుని ఉంటారు. నాడు హిందూ దేవాలయ మీద జరిగే దాడిని వీరు క్రమక్రమంగా అడ్డుకుంటూ వచ్చారు.
ఒకానొక సమయంలో అరబ్బుల దాడుల నుండి తమను కాపాడమని నాటి రాజులు నాగ సాధువులను వేడుకునే వారు అంటే వీరి బలం ఏంటో అర్థమవుతుంది. కేవలం వందల సంఖ్యలో.. నాగ సాధువుల బృందం వేల సంఖ్యలోని బలశాల అరబ్బుల సైన్యాన్ని ఊతకోత కోయడం చూసి నాటి పండితులు ‘ఎంతో మంది రుద్రులు రక్తంతో విలయతాండవం ఆడినట్లు ఉంది’ అని అన్నారంటే వారి పరాక్రమాలు అర్థమవుతాయి.
నాగ సాధువులు హిమాలయాల్లో ఉంటూ నిత్యం ధ్యానంలో ఉంటారు. వీరు ఒంటి మీద నూలు పోగు లేకుండా విభూతి రాసుకుని జీవిస్తుంటారు. కాలం ఏదైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వీరు బట్టలు వేసుకోరు..సబ్బు వాడటం,నూనె వాడటం లాంటివి వీరి జాబితాలో ఉండవు. రోజులో ఒకసారి మాత్రమే తినే సాధువులు..రోజులో సాయంత్రం పూట కేవలం ఏడు ఇళ్లలో భిక్ష అడుగుతారు. ఏడు ఇళ్లలో ఏ కుటుంబం భిక్ష వేసినా స్వీకరిస్తారు. ఒకవేళ భిక్ష లభించకపోతే ఆ రోజు ఏమీ తీసుకోరు.
కుంభమేళాలోనే ఎలా కనిపిస్తారు?
నాగ సాధువులు కుంభమేళా జరిగే సమయంలో తప్ప ఎప్పుడూ కనిపించరు. సాధారణంగా హిమాలయాల్లో ఉండే నాగ సాధువులు కుంభమేళా సమయంలో మాత్రం అక్కడికి చేరుకుంటారు. అయితే హిమాలయాల నుండి ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నా మధ్యలో ఎక్కడా వీరు తారసపడరు. కుంభమేళా ప్రారంభంలో వీరు పవిత్ర స్నానాలు పుణ్య జలాలకు మరింత పుణ్యాన్ని ఆపాదిస్తాయని చాలా మంది నమ్మకం.
మహిళా నాగ సాధువులు
పురుషులలాగే స్త్రీలు కూడా నాగ సాధువులుగా మారుతారు. అందుకోసం వాళ్లు కొన్ని కఠినమైన పరీక్షలను ఎదుర్కొవల్సి ఉంటుంది. అయితే మహిళా సాధువులు కొన్ని విషయాలలో పురుష నాగ సాధువుల కంటే భిన్నంగా ఉంటారు.
పురుషుల మాదిరిగానే, మహిళా నాగ సాధువుల జీవితం పూర్తిగా దేవునికి అంకితం చేయబడింది. రోజూ పూజతో ప్రారంభమై పూజతోనే ముగుస్తుంది. ఒక స్త్రీ నాగ సాధువుగా మారినప్పుడు వారిని సాధువులు లేదా సాధ్వులు అంటారు. ఆమెను తల్లి అని పిలవడం ప్రారంభిస్తారు. మై బడా, మహిళా నాగ సన్యాసులు ఉండే అఖారా, ప్రయాగ్‌రాజ్‌లోని 2013లో కుంభ్‌లో,మై బడాకు దశానం సన్యాసిని అఖారా అని పేరు పెట్టారు.
నాగ అనేది టైటిల్. వైష్ణవులు, శైవులు మరియు ఆద్సనాలు మూడు వర్గాల సాధువుల రంగాన్ని ఏర్పరుస్తాయి. మగ సన్యాసులు బహిరంగంగా నగ్నంగా ఉండటానికి అనుమతించబడతారు. కానీ మహిళా సన్యాసులు అలా చేయలేరు. ఒక నాగసాధువుకి అనేక వస్త్రాలు అనేక దిగంబరులు (దుస్తులు లేకుండా) ఉంటారు.
అలాగే స్త్రీలు సన్యాస దీక్ష చేసినప్పుడు నాగులుగా చేస్తారు.కానీ వాళ్లంతా బట్టలు వేసుకుంటారు.
మహిళా నాగ సాధువులు తపో హిమాలయాలు
మహిళా నాగ సాధువులు చాలా అరుదుగా దర్శనమిస్తుంటారు. చాలా మందికి నాగ సాధువుల గురించైతే తెలుసు కానీ మహిళా నాగ సాధువులుంటారని మాత్రం తెలియదు.
నాగ సాధువులను అఘోరిలని కూడా అంటుంటారు. హిందూ ధర్మంలో నాగ సాధువుల వలెనే మహిళా నాగ సాధువులు కూడా ఉంటారు. అయితే మహిళా నాగ సాధువులు కావడానికి కఠోర తపస్సు చేయాల్సి ఉంటుంది. వారు అనేక కఠిన పరీక్షలు ఎదర్కోవలసి ఉంటుంది.
మహిళా నాగ సాధువుల పరీక్షలు అనేక ఏళ్లు సాగుతుంది. వారు కఠినమై బ్రహ్మచారిణి నియమాలు పాటిస్తారు.వారు బతికి ఉండగానే తమ పిండదానం చేసుకుంటారు. శిరో ముండనాన్ని కూడా చేయించుకుంటారు. అన్ని పరీక్షలు ముగిశాకే వారు మహిళా నాగ సాధువులవుతారు.
మహిళా నాగ సాధువులు చాలా అరుదైన సందర్భాలలోనే కనిపిస్తుంటారు. వారు సామాన్యులకు దూరంగా దట్టమైన అడవులలో, కొండలలో, గుహలలో ఉంటుంటారు. తమ సమయమంతా భగవంతుడి భక్తి మార్గంలో వెచ్చిస్తుంటారు. వారు అడవులు, కొండలు వదిలి అరుదైన సమయాల్లోనే జనంలోకి వస్తుంటారు. మహిళా నాగ సాధువులు చాలా వరకు కుంభమేళ,మహాకుంభమేళల్లోనే దర్శనమిస్తుంటారు. ఆ తర్వాత కనిపించకుండా పోతారు.
పురుష నాగ సాధువులు కూడా తక్కువగానే దర్శనమిస్తుంటారు. అయితే పురుష నాగ సాధువుల కంటే మహిళా నాగ సాధువులే ప్రపంచం ముందు అరుదుగా కనిపిస్తుంటారు.
పురుష నాగ సాధువులు సామాన్యంగా నగ్నంగానే కనిపిస్తుంటారు. అయితే మహిళా నాగ సాధువులు ప్రపంచానికి చాలా తక్కువగా కనిపిస్తుంటారు. కానీ వారు వస్త్రాలు ధరిస్తారు. అయితే అవి కుట్టని కాషాయ రంగులో ఉంటాయి. వాటిని వారు శరీరంలోని కొంత భాగానికి చుట్టుకుంటారంతే. అంతేకాదు వారు తమ నుదుటన తిలకాన్ని ధరిస్తారు.శరీర భాగాలకు భస్మం పూసుకుంటారు. హిందూ ధర్మంలో మహిళా నాగ సాధువులకు మంచి గౌరవం ఇస్తారు. వారిని ‘మాతా’ అని సంబోధిస్తారు.
నుదుటి పై తిలకం పెట్టుకోకుండా కేవలం కాషాయ రంగు కలిగిన ఓ వస్త్రాన్ని తలపై జుట్టుతో పాటు శరీరాన్ని కప్పి ఉంచేలా ధరిస్తారు. ఇదే మహిళా నాగసాధువుల ఆచారం.పురుషుల మాదిరిగానే, మహిళా నాగ సాధువుల జీవితం పూర్తిగా దేవునికి అంకితం చేయబడింది.
నాగసాధువులకు ఎవరి అపార్థాలతో వారికి పని లేదు
నాగా సాధువులు ఎవరి అపార్థాలతో వారికి పని లేదు.. అలంకారాలు అక్కర లేదు.. జుట్టు జడలు కట్టినా పట్టింపు లేదు. ఆహార్యం ప్రధానం కాదు.. నగ్నత్వమే వారి వేషం.. ఆహారం ముఖ్యం కాదు.. దొరికిందే తింటే చాలు.. రుచితో పనిలేదు.. శరీరంపై మోహం లేదు.. మృత్యువంటే భయం లేదు.
హిమాలయ సానువుల్లో నివాసం… పుష్కరం వస్తేనే జనంలోకి ప్రవాహం.. అడుక్కునే వాళ్లంటూ తిట్టేవాళ్లున్నారు.. అవధూతలని అర్చించేవారూ ఉన్నారు.. ఎవరితోనూ వారికి అవసరం లేదు.. వారు ఎవరికీ అర్థం కారు.. ఎవరి అపార్థాలతోనూ వారికి పని లేదు. ఏమైనా అనుకోండి.. పిచ్చివాళ్లని నిందించుకోండి… వెర్రిబాగుల వాళ్లని వెక్కిరించండి… వంటిమీద నూలుపోగైనా లేకుండా తిరుగుతున్నారని ఆక్షేపించండి.
శరీరం నిండా విభూతి రాసుకున్నారని నొసలు నొక్కుకొండి.. హుక్కా పీలుస్తున్నారంటూ ఆశ్చర్యపోండి… వారికి మీ ఊసులు అక్కర లేదు.. వారికి మీ అభిప్రాయాలతో పని లేదు.. వారికి లోకంతో పని లేదు. లోకం తమ గురించి ఎన్ని అనుకున్నా వారికి అవసరం లేదు.. ఎవరు వారు..? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తారు?
ఇంటి నుంచి బయటకు కాలు మోపితే, అంతా మనల్నే చూడాలని ఎంత తాపత్రయ పడతాం? ఆడామగా తేడా లేకుండా అద్దం ముందు నిలబడి గంటల తరబడి తయారవటం తెలిసిందే.ఒంటి అలంకారం కోసం వాడే కాస్మోటిక్స్ అన్నీ ఇన్నీ కావు.పర్‌ఫ్యూమ్స్ గురించయితే చెప్పనే అక్కర్లేదు.వంద గ్రాముల పర్‌ఫ్యూమ్‌ను వంద పదులైనా సరే కొనటానికి వెనుకాడం.కానీ,ఇవన్నీ అక్కరలేని జాతి ఒకటి ఉంది..
మన దేశంలోనే ఉంది..మన మధ్యలోనే ఉంది.. ఆ జాతికి వీటితో పనే లేదు.. ఎవరితోనూ ఆ జాతికి సంబంధమూ లేదు.ఎందుకిలా ఉంటారు?మామూలుగా ప్రపంచం అంతా తమను చూస్తున్నదన్న జిజ్ఞాస వీరికెందుకు ఉండదు? ఎందుకు పట్టదు..?
మనకు తెలిసిన సిగ్గు, అభిమానం, మానావమానాలు వీరికి ఉండవా? కనీసం కౌపీనం కూడా లేకుండా వీళ్లిలా ఉండటానికి కారణం ఏమిటి? సాధారణంగా మనం నిత్యం చూసే సాధు సంతులకు కాషాయం, కమండలం, దండం అస్తిత్వాలు.. మిగతా రెంటి మాటెలా ఉన్నా, కాషాయం సన్యాసానికి ఒక విధంగా యూనిఫామ్ లాంటిది.ఎందుకంటే కాషాయం త్యాగానికి చిహ్నం. సన్యాసులూ అన్నింటినీ త్యాగం చేసి వెళ్తారు.
కాబట్టి, సాధారణంగా వారు కాషాయాన్నే ధరిస్తారు.. ఇది కామన్ ఎలిమెంట్.. ఇందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు..కానీ ఎవరికీ అంతుపట్టని సాధువుల సమాజం ఒకటుంది.. అది అత్యంత రహస్య సమాజం.. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఎక్కడ ఉన్నాయో తెలియని అఖారాల్లో ఉండే సాధు జాతి.
దాని పేరు నాగా.. ఆ సన్యాసులే నాగా సాధువులు. మిగతా సొసైటీతో వీరికి ఎలాంటి సంబంధం లేదు.. తమ లోకంలోనే వారు జీవిస్తుంటారు.. అన్నింటినీ వదిలిపెట్టేసిన వారు.. చివరకు శరీరంపై బట్టల్నీ విడిచిపెట్టిన వాళ్లు.. నాగా సాధువులు వీరు జనావాసాల్లోకి పుష్కరాల సమయంలోనే వస్తారు.. ఒకే ఒక్క ఊరేగింపుగా వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి పుష్కరాలు పూర్తికాగానే తిరిగి వారి ఆవాసాలకు వెళ్లిపోతారు.
అంతే కాదు.. జనం మధ్యలోకి వచ్చినప్పుడు వీరి చేష్టలు విచిత్రంగా ఉంటాయి.. విడ్డూరంగా కనిపిస్తాయి. త్రిశూలాలు ధరిస్తారు.కత్తులు పట్టుకుంటారు.వాటితో వీరంగం వేస్తారు.వీరనాట్యాలు చేస్తారు.కర్రసాము చేస్తారు.హుక్కా, చిలుమ్ వంటి వాటి ద్వారా పొగాకు,నార్కొటిక్స్ వంటివి పీలుస్తారు.
ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని సాధువులని పిలవటం ఏమిటి? అదే మిస్టరీ… అతి కఠినమైన యోగ సాధనకు పరాకాష్ట.సభ్య సమాజానికి ఏవైతే నిషేధాలో.అవన్నీ వారు చేస్తారు.బట్టలు ధరించకపోవటమే ఒక సమస్య అనుకుంటే, హుక్కా, చిలుమ్ పీల్చటం, ఏది పడితే అది తినేయటం.ఒంటిని కనీసం శుభ్రంగా కూడా ఉంచుకోకపోవటం.ఇవన్నీ నిజంగా సాధు లక్షణాలేనా? అన్నీ నెగెటివ్ షేడ్సే.
ఏమిటీ రహస్యం? పవిత్ర గంగానదీ తీరంలో పుష్కరాలు వచ్చినప్పుడు, మహా కుంభమేళా జరుగుతుంది.. ఆ కుంభమేళా సమయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది నాగా సాధువులే. వేల సంఖ్యలో దిగంబర సాధువులు విభూతి అలంకారాలతో శివ పంచాక్షరి నినదిస్తూ రావడం ఒక అపురూప సన్నివేశం..
నాగ సాధువులు పుష్కరాల సమయంలోనే జనంలోకి వస్తారు. జనానికి కనిపిస్తారు.పుష్కరాలకు ముందు కానీ, తరువాత కానీ, వారు బయటి ప్రపంచానికి కనిపించరు.వారి చర్యలు విచిత్రం.వారి చేష్టలు విచిత్రం.
అందుకే వారిది అత్యంత అరుదైన సమాజం.హిమాలయాలు.దేవతల ఆవాసాలంటారు.నాగా సాధువులు ఉండేది కూడా ఈ హిమాలయాల పర్వత శ్రేణుల్లోనే.. కాకపోతే బయటి ప్రపంచానికి అందుబాటులో లేని మారుమూల పర్వత ప్రాంతాలను ఏరి కోరి ఎంచుకుని మరీ తమ మెడిటేషన్‌ను కొనసాగిస్తారు.
వారికి ఎండ లేదు.వాన లేదు. చలి లేదు.విభూతే వారి శరీరాన్ని అన్నింటి నుంచీ కాపాడుతుంది. చిలుమ్, హుక్కా వంటివి శరీరంలో వేడిని కలిగిస్తాయి.
ఎవరిని ఆరాధిస్తారు
వారు శివుడిని, అగ్నిని ఆరాధిస్తారు.మిగతా దేవుళ్లందరినీ పూజిస్తే వాళ్లు స్పందించే సరికి చాలా సమయం పడుతుందిట. అగ్నిని ఆరాధిస్తే.ఆయనకు ఆహుతులను అర్పిస్తే వెంటనే విభూతి రూపంలో ఫలితాన్ని అందిస్తాడట.ఆ విభూతే నాగా సాధువులకు సర్వస్వం అవుతోంది. విభూతి అంటే ఐశ్వర్యం.నాగా సాధువులకు ఈ విభూతే ఐశ్వర్యం.
సర్వ సంపదలూ ఈ విభూతే. పరమేశ్వరుడే స్వయంగా ధరించిన విభూతే వారికి సర్వాలంకారం. చూసే మనబోటి వాళ్లకు విచిత్రంగా అనిపించవచ్చు. కానీ, వారికి అది అవసరం లేదు.. అత్యంత కఠినమైన యోగసాధన చేసి అన్నింటికీ అతీతమైన దశకు చేరుకున్న శివసైనికులు వీరు.
ఉజ్జయిని.. మహా కాళేశ్వరుడిగా శివుడు పూజలందుకునే పవిత్ర పుణ్యక్షేత్రం. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఉజ్జయిని కూడ ఒకటి.దేశంలోని మిగతా శైవ క్షేత్రాల కంటే ఉజ్జయినిలో ఒక విశిష్టమైన ఆచారం ఉంది.ప్రతి రోజూ రాత్రి పూట ఉజ్జయిని స్మశాన వాటికలో అప్పటికప్పుడు తాజాగా మండిన చితిలో నుంచి భస్మరాశిని తీసుకువచ్చి మహాకాళేశ్వరుడికి అభిషేకం చేస్తారు. భస్మరాశి విభూతిగా మారిపోతుంది.మన శరీరమే విభూతి అని చెప్పటానికి ప్రతీక ఈ అభిషేకం.
నాగా సాధువులు తమ శరీరానికి రాసుకునే విభూతి కూడా ఇదే. శరీరం ఎప్పటికైనా భస్మరాశిగానే మారాల్సి ఉంటుందనటాన్ని ఎక్స్‌ప్రెస్ చేయటమే దీని ఉద్దేశం. సాధువుల్లో నాగాలను సృష్టించింది దత్తాత్రేయుడని చెప్తారు. ఎప్పుడు, ఎలా సృష్టించిందీ ఎవరికీ తెలియదు.
మనం ఉంటున్న ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్‌ను వీరు కేర్ చేయరు. ఆర్మీలో ఓ రెజిమెంట్‌లాగా నాగా సాధువులు ఉంటారు. వీళ్లు శివుడికి సైనికుల్లా వ్యవహరిస్తారు.ఎవరినీ దగ్గరకు రానివ్వరు.అఘోరాల్లా అతి తీవ్రంగా లేకపోయినా, వీరి దారి వేరు.చాలా ఆవేశపరులు.వారి ఆగ్రహం ప్రదర్శించటానికి బెస్ట్ ఆప్షన్‌గా పరిగెడ్తారు.
ఇంకొందరు హింసాత్మకంగా కూడా మారతారు.అఖారాలని పిలిచే వారి ఆశ్రమాల్లోకి కూడా ఎవరినీ రానివ్వరు.ఎవరైనా చొచ్చుకుని పోతే అక్కడ మరింత విచిత్రమైన చర్యలు కనిపిస్తాయి. సామాన్యులకు అసాధారాణమైన యోగాసనాల్లో నాగా సాధువులు కనిపిస్తారు.. ఆశ్రమంలోకి వచ్చిన వారిపై ముందు ఆగ్రహించినా తరువాత అనుగ్రహిస్తారు.
సామాన్యంగా కనిపించే సన్యాసులకు,వీరికి అదే తేడా. అందుకే వీరిని నాగాలన్నారు.సాధువులుగా మారటం తేలికే, సన్యాసం తీసుకోవటమే కష్టం. అన్ని సుఖాలను వదిలేసి ఆశ్రమ జీవితం గడపటం ఇంకా కష్టం. కానీ ఈ ఆశ్రమ జీవితాన్నీ వదిలేసి, శరీరాన్ని గాలికి వదిలేసి, నిద్ర, ఆహారాలను నిర్లక్ష్యానికి అప్పజెప్పేసి పూర్తిగా నాగాలుగా మారటం ఊహించినంత తేలిక కాదు..
ఇదెలా సాధ్యం?
చాలా, చాలా కష్టపడ్డ తరువాత కానీ, నాగాలుగా మారటం కుదరనే కుదరదు.నాగా సాధువులు అంటే ప్రధానంగా దిగంబరులు.ఇదెలా సాధ్యం? జీవితాంతం ఇలా ఉండటం ఎలా వీలవుతుంది? అదీ మంచు కొండల్లో.గడ్డకట్టే చలిలో నూలుపోగైనా లేని ఒంటిని కేవలం విభూతి ఎలా రక్షిస్తుంది.
కాస్త మోతాదులో తీసుకునే మత్తు పదార్థాలు ఏమూలకు పనికి వస్తాయి? మరి వీళ్లెలా ఉండగలుగుతున్నారు? నిజం.. ఇలా ఉండటం సామాన్యుడికైతే క్షణమైనా సాధ్యం కాదు.నాగాలుగా మారేందుకు ఈ సాధువులు చాలా నిష్ఠగా చేయాల్సి ఉంటుంది.
సర్వస్వం త్యాగం చేసి నాగాలుగా మారాలని అనుకున్న వారు ముందుగా ఇల్లూ వాకిలీ వదిలేసి సాధారణ సన్యాసం స్వీకరించాలి. ఆరు సంవత్సరాల పాటు కఠినమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి. అన్ని రుచులను వదిలేయాలి. అన్ని వాసనలకూ దూరంగా ఉండాలి. అన్ని సుఖాలను త్యాగం చేయాలి. అన్ని మోహాలను వదిలిపెట్టాలి. చివరకు వస్త్రాల్నీ వదిలేయాలి. ఇవన్నీ అనుకున్నంత ఈజీ ఏమీ కాదు.. ప్రతి విషయంపైనా ఏకాగ్రత సాధించటానికి చాలానే కష్టపడతారు.
ఆ తరువాత అయిదుగురు గురువుల దగ్గర తమను తాము అన్నింటికీ అతీతంగా ఉండగలుగుతున్నట్లు నిరూపించుకోవలసి ఉంటుంది. ఆరు సంవత్సరాల బ్రహ్మచర్యంలో సాధువులు కౌపీనం అంటే లంగోటీ ధరించి ఉంటారు.ఒక్కో దానిపై మోహం తీరిపోయాక చివరగా ఆ కౌపీనాన్ని సైతం విడిచిపెడతారు.
అంటే ఈ మెటీరియలిస్టిక్ ప్రపంచంలోని సంసారం నుంచి తనను తాను నాగా సాధువు వేరు చేసుకున్నట్లని అర్థం. నేను అనే ఈగోను విడిచేయడమే నాగా సాధువుల్లోని ప్రత్యేకత. బయటి శరీరం కంటే, లోపల ఆత్మ అన్నది ఒకటుందని వీరు గాఢంగా నమ్ముతారు.ఆ ఆత్మే ప్రధానంగా జీవిస్తారు.మిగతా శరీరంతో వారికి పని లేదు. కాబట్టి దాని గురించి పట్టించుకోరు.
మిగతా ప్రపంచం కంటే చాలా పరిశుభ్రమైన జీవనం తమదని నాగాలంటారు. నాగా సాధువులు ఎక్కువగా ప్రయాణాలు చేయరు.ఎక్కడికీ వెళ్లరు.కేవలం కుంభమేళాలు జరిగినప్పుడే ఆ నదీతీరానికి వాళ్లు వస్తారు.పవిత్ర స్నానాలు చేసి వెళ్లిపోతారు.ఈ లోకంలో ఈశ్వరుడికి అచ్చమైన ప్రతీకలు నాగాలు.
ఇంతటి మహిమాన్వితమైన నాగసాధువుల గురించి రాసే అదృష్టం నాకు కలిగినందుకు నేనెంతో ఆనందం పొంతుతున్నాను.ఓం నమశివాయ: