Telugu News

గూగుల్ ఏఐ ప్రో.. ఏడాదిపాటు ఫ్రీగా!

గూగుల్ సంస్థ ఇటీవల భారతీయ విద్యార్థుల కోసం ఒక మంచి న్యూస్ చెప్పింది. గూగుల్ అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ ను దాదాపు ఏడాదిపాటు ఫ్రీగా వినియోగించుకునే ఛాన్స్ కల్పిస్తోంది. విద్య, ఉద్యోగ రంగాల్లో ఏఐ దూసుకుపోతున్న నేపథ్యంలో.. టెక్ కంపెనీలు దీనిలో భాగమవ్వడానికి ప్రయత్నిస్తున్నాయనీ ఈ ప్లాన్ వల్ల తెలుస్తోంది.

ఈ క్రమంలో జెమినీ ఫర్ స్టూడెంట్స్ పేరుతో ఈ ఆఫర్ ను ఇప్పుడు తీసుకొచ్చింది. పైగా ఇంతమందికి మాత్రమే అంటూ లిమిట్ పెట్టలేదు. *ఇందుకోసం 18 ఏళ్లు, అంతకుమించి వయసున్న స్టూడెంట్స్ ఏడాది కాలంపాటు ఫ్రీ సబ్ స్క్రిప్షన్ తోపాటు 2 టీబీ క్లౌడ్ స్టోరేజీని పొందొచ్చు. 

*ఈ జెమినీ సర్వీసెస్ ను పొందేందుకు ముందుగా గూగుల్ ఆఫర్ పేజీ ద్వారా ఇండివిజువల్ గా రిజిస్టర్ చేసుకోవాలి. నమోదు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025.

*ఒకసారి రిజిస్టర్ చేసుకున్న తర్వాత గూగుల్ లో ఏఐ మోడల్ అయిన జెమినీ 2.5 ప్రోను ఉపయోగించుకోవచ్చు. 

*కాగా ఈ ప్లాన్ లో చదువుకునేందుకు, రైటింగ్, రీసెర్చ్, జాబ్ ఓరియెంటెడ్ టూల్స్ వంటివి ఎన్నో ఉన్నాయి. 

*ఎగ్జామ్స్, హోంవర్క్, ఎస్సే రైటింగ్,  కోడింగ్, ఇంటర్వ్యూస్ కి సంబంధించి అన్ లిమిటెడ్ అకడమిక్ సపోర్ట్ ను ఇది అందిస్తోంది.

*నోట్ బుక్ ఎల్ఎంతో ఎంచక్కా స్టడీ నోట్స్ ను తయారు చేసుకోవచ్చు. 

*జెమినీ లైవ్ టూల్ రియల్-టైమ్ ట్రాన్స్లేషన్ కోసం ఉపయోగపడుతుంది. 

*ప్రజెంటేషన్లు, ప్రాజెక్ట్ ల కోసం గూగుల్ ఏఐ ఆధారిత వీడియో క్రియేటర్ అనే స్పెషల్ టూల్ వియో3ని కూడా ఈ ప్లాన్ లో భాగంగా యూస్ చేసుకోవచ్చు. 

*డీప్ రీసెర్చ్ టూల్ తో మనకి కావాల్సిన సమాచారాన్ని లోతుగా అధ్యయనం చేయొచ్చు. 

*అసైన్మెంట్లు పూర్తి చేయడంలో, చక్కని రెజ్యూమె తయారు చేయడంలో విద్యార్థులకు గూగుల్ డిజిటల్ ఫ్రెండ్లీగా ఉండనుంది.

ఈ జెమినీ అడ్వాన్స్డ్ ప్లాన్ ను కొనుగోలు చేయాలంటే నిజానికి రూ.19,500 ఖర్చవుతుంది. కానీ చదువు, భవిష్యత్తు ఉద్యోగాల రీత్యా చాలామంది విద్యార్థులు ఏఐ టూల్స్ ను ఎక్కువగా వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ ఫ్రీ సబ్ స్కిప్షన్ ప్లాన్ ను ప్రవేశపెట్టినట్లు సంస్థ తెలిపింది.

ఇతర కథనాలు:

ప్రపంచాన్ని వణికిస్తున్న ‘క్లాడ్ మైథోస్’ ఏఐ..!

కియాను వరించిన ‘కార్ ఆఫ్ ది ఇయర్’..!

Show More
Back to top button