
మావన జీవితంలో పెళ్లి, పిల్లలు సర్వసాధారణం. కానీ ఈ రోజుల్లో యువత పెళ్లి, పిల్లలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని వివిధ సర్వేలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా జీవనశైలి, ఆహార అలవాట్లతో సంతానం కలగకపోవడం, ఆలస్యంగా గర్భం దాల్చడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. స్త్రీలలో సంతాన సమస్యలకు పలు కారణాలు ఉన్నా.. పురుషుల్లో మాత్రం ప్రధానంగా వీర్యంలో శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడమే అంటున్నారు వైద్యులు. ఈ ఇటీవలే వచ్చిన వివిధ సర్వేలు కూడా ఇదే విషయాన్ని హెచ్చరించాయి. సహజం గర్భధారణ కష్టమౌతుండటంతో చాలామంది IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) కేంద్రాలకు వెళ్తున్నారు.
స్పెర్మ్ కౌంట్ ఎంత ఉండాలి?
శృంగార సమయంలో పురుషుల నుంచి విడుదలయ్యే వీర్యంలో శుక్రకణాల సంఖ్ఖ్యనే స్పెర్మ్‌కౌంట్ అంటారు. దీన్ని మిలియన్లలో లెక్కిస్తారు. కానీ ప్రస్తుతం జీవన విధానంలో పురుషుల్లో ఈ సంఖ్య ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంటుందని వైదులు అంటున్నారు. మహిళల అండం పిండంగా మారాలంటే పురుషుడి నుంచి విడుదలయ్యే ఈ స్పెర్మ్‌కౌంట్ సుమారు 20-30 మిలియన్లు ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే లైంగికంగా కలిసినప్పుడు విడుదలైన అన్నీ శుక్రకణాలు అండంలోకి చేరలేవు. ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన మాంసం, పాల ఉత్పత్తులు తీసుకుంటే స్పెర్మ్‌కౌంట్ తగ్గుతుంది. అతిగా శుద్ది చేసిన మాంసం తిన్నా వీర్య కణాలు చురుగ్గా కదలేవని నిపుణులు అంటున్నారు. అలాగే పాల ఉత్పత్తి పెంచడానికి పశువులకు స్టెరాయిడ్లు ఇస్తుంటారు.ఆ పాలు తాగితే వీర్య కణాల నాణ్యత తగ్గిపోతుంది.
వీటితో స్పెర్మ్‌కౌంట్ పెంచుకోండి
వీర్యంలో శుక్రకణాల సంఖ్య పెంచుకోవాలంటే మీ రోజువారి ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి. అప్పుడు కృత్రిమ గర్భధారణ కోసం IVF సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని అంటున్నారు నిపుణులు.
గుడ్లు: వీటిలో ప్రోటీన్ ఎ్కక్కువగా ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ దాడి నుంచి వీర్యాన్ని కాపాడటానికి గుడ్లు సహాయపడతాయి. వీర్యకణాలు చురుకుగా కదలడానికి కూడా గుడ్డు ఉపయోగపడుతుంది.
పాలకూర: ఇందులో ఫోలిక్‌యాసిడ్ మెండుగా ఉంటాయి. ఇది వీర్య కణాలకైయ్యే డ్యామేజ్ రిపేర్ చేస్తుంది. కొత్త స్పెర్మ్ అభివృద్ది చేస్తుంది.
గుమ్మడి గింజలు: వీటిలో ఫైటోస్టెరాల్స్ ఉంటాయి. ఇవి టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి పెంచుతాయి. వీటిలోని ఒమేగా-3 ఆమ్లాలు రక్త ప్రసరణ మెరుగుపరచడంతో పాటు స్పెర్మ్ నాణ్యతని పెంచుతాయి.
జింక్ పదార్థాలు: బార్లీ, చిక్కుళ్లు, మాంసం వంటి జింక్ ఎక్కువ ఉండే పదార్థాలు వీర్య కాణాలు సంఖ్య వృద్ధి చెందడానికి దోహదపడతాయి. జింక్ లోపంతో వీర్యకణాలు కదలికలు తగ్గుతాయి.
దానిమ్మ: వీర్యకణాల సంఖ్య, వీర్య నాణ్యతను వృద్ధి చేస్తుంది. దానిమ్మగింజల్లోని యాంటీఆక్సిడెంట్స్ కణాలను పాడుచేసే ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకుంటాయి.
టమాటా: వీటిల్లో విటమిన్-Cతో పాటు లైకోపేన్ అనే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది పురుషుల్లో సంతాన సామర్థ్యం పెంచడానికి ఉపయోగపడుతుంది.
డార్క్ చాక్లెట్: L-ఆర్జినిన్ HCL అనే అమైనో ఆమ్లం డార్క్ చాక్లెట్‌లో ఉంటుంది. ఇది వీర్య మోతాదు, వీర్యకణాల సంఖ్యను వృద్ధి చేయడానికి సహకరిస్తుంది.
అరటిపండ్లు: ఆరోగ్యకరమైన వీర్యకణాలు ఉత్పత్తి కావడానికి తోడ్పడే విటమిన్-A, విటమిన్ B1, విటమిన్-C అరటిపండ్లలో ఉంటాయి. వీటిల్లో బ్రోమిలైన్ అనే అరుదైన ఎంజైమ్ ఉంటుంది. ఇది వాపును అడ్డుకోవడం, వీర్యనాణ్యతతో పాటు వాటి సంఖ్యను పెంచుతుంది.
వాల్‌నట్స్: వీర్యకణాల మీద ఉండే కణజాల పొర ఉత్పత్తికి మంచి కొవ్వు అవసరం. వాల్‌నట్స్‌లో ఉండే ఓమెగా-3 ఇందుకు సహకరిస్తుంది. ఇవి వృషణాలకు రక్తప్రసరణ పెంచుతాయి.










