
అది 2000, అందరి మనసులో ఆందోళన మొదలైంది. తమ దగ్గర ఉన్న షేర్లను అమ్మడం ప్రారంభించారు. ఇలా ఒకేసారి 2002 నాటికి అందరూ షేర్లను అమ్మడంతో స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. దీనినే డాట్ కాం బబుల్((dot com) అని పిలుస్తారు. 1998 సమయంలో వెబ్‌సైట్ ద్వారా వ్యాపారాలు చేయడం ఎక్కువ అయ్యాయి. ఉదాహరణకు amazon.com లాంటివి అప్పుడప్పుడే మార్కెట్‌లో విస్తరిస్తున్నాయి. ఇలా ఎన్నో కంపెనీలు వెబ్‌సైట్స్ ప్రారంభించి బిజినెస్ చేయడం మొదలు పెట్టాయి. స్టాక్ మార్కెట్‌లో కూడా ఎంట్రీ అయ్యాయి.
దీంతో ప్రజలు .com అని ఉన్న కంపెనీలు బాగా లాభాలు ఇస్తాయేమో అనే ఉద్దేశంతో అందులో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. ఇలా కేవలం 2 సంవత్సరాలు అంటే 2000 వరకే కంపెనీల వాల్యుయేషన్ 600%కి చేరుకున్నాయి. ఎన్నో కంపెనీలు ఇలా డాట్ కాంతో వచ్చాయి కానీ.. సరిగా పర్ఫార్మ్ చేయలేదు. దీంతో ప్రజలకు భయం వేసి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. ఇలా 2002 నాటికి కంపెనీల వాల్యుయేషన్ 7%కి పడిపోయింది. దీనివల్ల ఎన్నో కంపెనీలు దివాళా కూడా తీశాయి. అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అని ఆలోచిస్తున్నారా..? ప్రస్తుతం మరో టెక్నాలజీ కూడా ప్రజల్లో దూసుకుపోతుంది. అదే Ai(కృత్రిమ మేధస్సు).
ప్రస్తుతం Ai వాడకం ఎంతలా పెరుగుతుందంటే.. మనుషులు ఒక రోజులో చేసే పని ఇది గంటల్లోనే చేస్తుంది. దీనివల్ల చాలామంది దీనిని ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. ఎన్నో కంపెనీలు ఇప్పటికే కృత్రిమ మేధస్సు మీద ఆధారపడి వ్యాపారాలు చేస్తున్నాయి. రానున్న రోజుల్లో దీని వేగం మరికాస్త పెరగవచ్చని ప్రజలు అంచనా వేస్తున్నారు. దీంతో చాలామంది Aiకి సంబంధించిన స్టాక్స్ మీద పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. భవిష్యత్తులో ఇది కూడా డాట్ కాం బబుల్లా అవుతుందేమో అని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల స్టాక్ మార్కెట్‌లో మరో క్రాష్ రావచ్చు. కాబట్టి, ముందునుంచే జాగ్రత్తగా ఉండడం బెటర్. దీనికోసం ఏం చేయాలంటే..
తరచుగా మార్కెట్‌ని గమనిస్తూ ఉండాలి.
పెట్టుబడులను డైవర్సిఫైడ్ చేయాలి.
కంపెనీ గురించి పూర్తిగా తెలియకుండా పెట్టుబడులు అస్సలు పెట్టకండి.










