Telugu Opinion Specials

గాడితప్పుతున్న జనజీవనం.. యువత భవిష్యత్తు చిత్తు చిత్తు

భారత దేశం సమస్త జీవన విధానానికి, శాంతికి, స్వేచ్చకు ప్రతీక. ధర్మమే ప్రధానంగా ఆచరిస్తూ రాజ్యం ఏలిన రాజుల నుండి ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిభింబిస్తూ దేశాన్ని శాంతిగా కాపాడుతున్న ప్రధానుల వరకు అందరూ దేశాన్ని కాపాడిన వారే. ఇప్పటికి అదే ధోరణి నడుస్తోంది. అయితే ఒకప్పటి కాలంలో ఎంతో సంతోషంగా ఉమ్మడిగా, సమిష్టిగా కలిసి జీవించేవాళ్లు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. దేశం ఒక ప్రధాన వృక్షమైతే.. గ్రామాలు ఆ చెట్టు యొక్క ఆకులు. నేటి ప్రస్తుత కాలంలో వికృత చేష్టలు అనే వైరస్.. దేశాన్ని కుదుపేస్తుంది. ఒక్కొక్క ఆకును తినేస్తూ వృక్షాన్నే కబళించి వేస్తుంది. ఒక్కప్పటి జీవన విధానం నుంచి నేటి జీవన విధానంలో జరిగిన మార్పులు, నేటి తరం కోల్పోతున్న విలువలు, నేటి జెనెరేషన్ ను పట్టి పీడిస్తున్న అనేక అంశాలపై ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం. 

ఛిద్రమౌతున్న ఉమ్మడి కుటుంబాలు 

ఇవాళ్టి రోజున మనం ఏం కోల్పోతున్నాం అనే విషయాలు తెలుసుకునేముందు.. ఒకప్పటి జీవన విధానాన్ని పరిశీలిద్దాం. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన మన దేశంలో గ్రామాలు అద్భుతంగా విరాజిల్లేవి. ఎవరికి వారు తమ వృత్తులను చేసుకుంటూ జీవనం సాగించేవారు. వ్యవసాయం, కులవృత్తులు చేసుకుంటూ గ్రామమంతా ఒక్కటై రోజు నిత్య పండుగలా జీవించేవారు. మన హిందూ సంప్రదాయంలోని అనేక పండుగలు.. మన జీవన విధానాన్ని తెలియజేస్తాయి. కష్టసుఖాలను తెలియజేస్తాయి. అద్భుతమైన గురుకుల వ్యవస్థ ద్వారా విద్యాబ్యాసం చేసి ఉత్తమ జీవన విధానాన్ని ఆచరించేవారు. స్త్రీలు ఇంటిపట్టునే ఉండి.. కుటుంబ బాథ్యతలు చూసుకునే భర్తకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశనం చేస్తూ.. కుటుంబాన్ని పోషించుకునే వారు. చిన్న పిల్లలు 6 సంవత్సరాల వరకు తల్లి తండ్రుల చెంతనే ఉండి ప్రేమ ఆప్యాయతలు పొందేవారు. స్త్రీలు ఇంటిపనిని చక్కదిద్దుతూ సహాయం చేశేవారు. ఎక్కువ ధనం సంపాదించకపోయినా ఉన్నంతలో సంతోషంగా ఉండేవారు. ఉమ్మడి కుటుంబాలు ఒక్కొక్కరు 10 మందిని కన్నాకూడ ఎలాంటి బాధ లేకుండా హాయిగా పెళ్లి చేశేవారు.

మరి నేటి జీవితాన్ని చూసుకుంటే పూర్తిగా భిన్నం. మనకు ప్రతీది సమస్యే. ఉరుకుల పరుగుల ప్రపంచంతో పోటీ పడలేక.. పక్కవాడితో పోల్చుకుంటూ కేవలం డబ్బు సంపాదించడమే లక్ష్యంగా బ్రతుకుతున్నాం. గ్రామాలలో నివసించడం మానేశాం. కులవృత్తులు అడుగంటిపోయాయి. వ్యవసాయం చేసే విధానం మారిపోయింది. ఇవాళ ఆరోగ్యకరమైన పంటను పండించే రైతు రసాయనాలను పండించే పంటలను పండిస్తున్నారు. కేవలం డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఎంతకైనా దిగజారి పోతున్నాడు. అయితే వ్యక్తిగతంగా ఏదేమైనా కానీ, సామజిక పరంగా మనశ్శాంతి లేకపోవడం, నేరాలు పెరగటం చాలా ఎక్కువయ్యాయి. దీనికి గల కారణాలను ఇప్పడు చూద్దాం. 

ఒకప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నా.. అన్నీ వయసుకు తగ్గట్టుగా జరిగిపోయేవి. ఎలాంటి ఉద్యోగం లేకపోయినా పెళ్లిళ్లు జరిగేవి. కానీ ఇప్పుడు అలా కాదు.. కచ్చితంగా ఉద్యోగం ఉంటేనే పిల్లనిస్తాం అంటున్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేకపోవడంతో ఎంతోమంది యువత ఇవాళ అశాంతితో జీవిస్తున్నారు. అటు కోరికలు చంపుకోలేక.. పెళ్లికాక ముందే సహజీవనం చేస్తున్నారు. ఒకప్పుడు అబ్బాయికి అమ్మాయి స్పర్శ పెళ్లిలోనే జరిగేది. ఇప్పుడు అంతా అయిపోయాక పెళ్లిళ్లు జరుగుతున్నాయి. దీనివల్ల దాంపత్యం మీద ఆసక్తి లేకపోవడం, అలా అది గొడవలకు దారి తీయడం జరుగుతుంది. 

సంస్కారం లేని విద్య.. తల్లి స్పర్శ కోల్పోతున్న పిల్లలు 

నేటి కాలంలో కేవలం డబ్బు సంపాదించడమే లక్ష్యంగా విద్య కొనసాగటంలో అందరి పిల్లలకు అదే అలవాటు అవుతుంది. పుట్టీ ఒకసంవత్సరం అవగానే డే కేర్ సెంటర్ లలో వేస్తున్నారు. తల్లులు తమపనిలో తాము బిజీగా ఉంటున్నారు. దీంతో తల్లిదండ్రుల స్పర్శ కూడా పిల్లలకు అందట్లేదు. ఒక వైద్యనిపుణులు చేపట్టిన ప్రయోగంలో క్రిమినల్స్, నేరాలు ఘోరాలు చేయడానికి ఇలా తయారవడానికి పిల్లలకు తల్లి స్పర్శ లేకపోవడమే అని తేలింది. చిన్నారుల భవిష్యత్తును తీర్చి దిద్దాల్సిన తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వలన ఇలా తయారవుతున్నారు. పిల్లలు ఎడ్యుకేషన్ ను ప్రెజర్ గా భావిస్తూ ఛిద్రమౌతూన్నారు. పిల్లలకు చిన్నతనంలోనే ఫోన్ అలవాటు కావడంతో అనేక చెడు విషయాలకు అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ గేమ్స్, అస్లీల వీడియోలు చిన్నతనంలోనే చూసి.. చిన్నారి ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేస్తున్నారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వలన చిన్నారులు ఛిద్రమౌతున్నారు. 

అంగాంగాలు ప్రదర్శించేలా అమ్మాయిల డ్రెస్సుల వేషధారణ 

నేటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న మరో మహమ్మారి సంతానాలు కలగక పోవడం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అమ్మాయి, అబ్బాయి శారీరక వ్యస్థలో మార్పులు అయి ఉండవచ్చు. అనారోగ్యం చేసి ఉండవచ్చు. కానీ నేటి కాలంలో ఉత్తమ సంతానాన్ని కనే అదృష్టాన్ని చాలా మంది కోల్పోతున్నారు. ఫ్యాషన్ అనే ఒక ముసుగులో అమ్మాయిల వేషధారణ కూడా సంతానం కలుగక పోవడం కూడా ఒక కారణమే. భర్తకు చూపించాల్సిన అన్ని అవయవాలు రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు కూడా కనిపిస్తున్నాయి. పడకగదిలో చూపించాల్సినవి కూడా రోడ్డుపై చూస్తే ఇక పడకగది ఎందుకు? అలాంటి వేషధారణ ఉంటె.. మగాడికి పడక గదిలో లైంగిక చలనం ఎలా కలుగుతుంది. పెళ్లి తర్వాత సంసారం చేయాల్సిన సమయంలో స్త్రీ తో సంసారం చేసేటప్పుడు చూడాల్సినవి..

రోడ్డుపై అందాలను అరోబోస్తూ తిరుగుతున్నారు. రోజు అలా తొడభాగాలను, పిరుదులను, వక్షోజాలను చూస్తుండటంతో అది కూడా కామన్ అయిపోయింది. ఈ కారణం చేత మగాడిలో లైంగిక సామర్థ్యం తగ్గుతుంది. దీంతో సరైన సంతానం కలుగదు. నేటి జీవన విధానంలో సిటీలో గల్లీకి ఒకటి సంతాన సాఫల్యత కేంద్రం వెలుస్తోంది. ఎందుకు ఇలాంటి పరిస్థితిని తెచ్చుకున్నాం. అద్భుతమైన బిడ్డకు జన్మనిచ్చే స్త్రీ.. ఇలా అనారోగ్య కరమైన పిల్లలకు జన్మనిచ్చే సమాజాన్ని మనం ఎందుకు నిర్మించుకున్నాం. ఫ్యాషన్ అంటే.. దుస్తులు మాత్రమేకాదు.. నీ ఆలోచనలు, చేసేపని. అది సమాజ శ్రేయస్సులు ఉపయోగపడేలా ఉండాలి. రోడ్డుపైన అర్ధనగ్నంగా తిరగటం.. దేనికి సంకేతం. ఇది పరోక్షంగా మగవాడి లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే అవుతుంది. నేటి స్త్రీ మూర్తులు ఈ విషయాన్నీ తెలుసుకొని.. భారతీయ సంప్రదాయాన్ని అలవాటు చేసుకుంటే.. సమాజాన్ని కొంచెం బ్రస్తుత్వం నుంచి కాపాడిన వాళ్ళం అవుతాం. 

మృగాళ్ల మారుతున్న మగాళ్లు 

కొందరు కామంతో రెచ్చిపోతున్న మగాళ్లు.. ఇలాంటి వేషధారణలు చూసి కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మద్యం, మాంసానికి అలవాటు పడి మత్తులో ఏం చేస్తున్నామో కూడా తెలియక అమాయక ఆడపిల్లలపై అత్యాచారాలు చేస్తున్నారు. నేరస్తుడిగా, క్రిమినల్ గా మారటానికి చిన్నప్పటి నుంచి తల్లి స్పర్శ, ప్రేమ లేకపోవడం, అనాధగా ఉండటం, ఎడ్యుకేషన్ లేకపోవడం, మద్యం మత్తుకు బానిస అవడం, ఫోన్ లో అస్లీలాలు చూడటం, ఆన్ లైన్ గేమ్స్ కి అలవాటు కావడం.. ముఖ్యంగా డ్రగ్స్ తీసుకోవడం కారణాలు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో డ్రగ్స్ తో యువత, విద్యార్థులు చిత్తు చిత్తు అవుతున్నారు.

డ్రగ్స్ కోసం ఆడవారు తమ శరీరాన్ని కూడా ఇచ్చేస్తున్నారు. మద్యం మత్తులో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు దీనిపై అనేక చర్యలు తీసుకుంటున్నా.. కొంత మేర నివారిస్తున్నాయి. పూర్తి స్థాయి డ్రగ్స్ వాడకం తగ్గి.. యువతీయువకుల జీవన విధానాలు గాడిన పడాలని కోరుకుందాం. దేశంలో నేరాలు తగ్గి శాంతి వైపు నడవాలి. తెగులు పట్టిన గ్రామాలు అనే ఆకులు మళ్ళి కొత్త చిగురుతో ఆకుపచ్చదనం సంతరించుకోవాలి. భరత వృక్షం సంక్షేమగా ఉండాలి.

Show More
Back to top button