
ఇంట్లో సంపాదించేవారికి ఏమైన జరిగితే కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనిని ఎదురించడానికి జీవిత బీమా తీసుకోవడం చాలా అవసరం. బీమా తీసుకునే ముందు అందులోని పదాలను తెలుసుకోవడం చాలా అవసరం. దీనివల్ల బీమా గురించి పూర్తి వివరాలు సులభంగా అర్థం అవుతుంది.
లైఫ్ అష్యూర్డ్: మీరు ఎవరి పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తే.. వారిని లైఫ్ అష్యూర్డ్ అని అంటారు. మీరు పాలసీహోల్డర్ అవుతారు. అలాగే మీ నామినీ లైఫ్ అష్యూర్డ్ అవుతారు.
రైడర్స్: ఆ పదం మనం చాలా సార్లు వినే ఉంటాం. మీరు బీమాలో ఏవైన రైడర్లు కావాలనుకుంటే.. మీ పాలసీలో యాడ్ చేసుకోవచ్చు. క్రిటికల్ ఇల్నెస్ రైడర్, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్, డిసెబిలిటీ రైడర్ లాంటి మరెన్నో రైడర్లు ఉంటాయి. వాటిలో మీకు కావాల్సిన వాటిని ఎంచుకోవచ్చు. వీటికి అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అధిక సురక్షితం కూడా ఉంటుంది.
ఫ్రీ లుక్ పీరియడ్: ఫ్రీ లుక్ పీరియడ్లో పాలసీదారుడు పాలసీ గురించి మరొకసారి ఆలోచించి తీసుకోవాలా/వద్దా అని నిర్ణయించుకోవచ్చు. అంటే, పాలసీ తీసుకున్న 15 నుంచి 30 రోజుల వ్యవధిలో పాలసీదారుడు బీమా పాలసీ నిబంధనలు, షరతులను మరొకసారి చెక్ చేసుకుని.. తీసుకోవాలా..? వద్దా..? అనే నిర్ణయం తీసుకోవచ్చు.
గ్రేస్ పీరియడ్: గ్రేస్ పీరియడ్ అంటే ప్రీమియం చెల్లింపు తేదీ ముగిసాక.. ప్రీమియం చెల్లించడానికి మరి కాస్త సమయాన్ని కంపెనీ వారు మనకు ఇస్తారు. దానినే గ్రేస్ పీరియడ్ అని అంటారు. ఇది సాధారణంగా 15 రోజుల నుంచి 30 రోజుల వరకు ఉంటుంది. గ్రేస్ పీరియడ్లోపు మీరు చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకపోతే, మీ ఇన్సూరెన్స్ పాలసీ ముగిసిపోతుంది. పాలసీలో ఉండే ప్రయోజనాలను మీరు కోల్పోతారు.










