HEALTH & LIFESTYLE

గ్యాస్ అవసరం లేకుండా ఈజీగా చేసుకునే 5 హెల్తీ ఫుడ్స్

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్ల కొరత సామాన్యుడిని ఆందోళనకు గురిచేస్తోంది. ఉన్న గ్యాస్‌ను పొదుపుగా వాడుకోవడం ఎంత అవసరమో, గ్యాస్ వాడకం లేకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని సిద్ధం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. వంట చేసే టెన్షన్ లేకుండా.. తక్కువ సమయంలోనే న్యూట్రిషియస్‌తోపాటు.. రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం చేసుకునే 5 అద్భుతమైన ఫుడ్స్ తెలుసుకుందాం.

1. పెరుగు పోహా (Curd Poha): పోహాను కేవలం వండి మాత్రమే కాదు, వండకుండా కూడా అద్భుతంగా తయారు చేయొచ్చు. పోహాను తేలికగా నీటితో కడిగి, పెరుగుతో కలపాలి. దీనికి కొత్తిమీర, ఉప్పు, నిమ్మరసం మరియు కొంచెం క్రంచీగా ఉండటానికి వేయించిన పల్లీలు కలిపితే కొన్ని నిమిషాల్లోనే తేలికగా జీర్ణమయ్యే బ్రేక్‌ఫాస్ట్ రెడీ.

2. స్ప్రౌట్స్ చాట్ (Sprouts Chat): మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. పెసలు లేదా ఇతర మొలకలను ఉల్లిపాయ, టమోటా, కీరాతో కలిపి, కొంచెం చాట్ మసాలా, ఉప్పు, నిమ్మరసం వేస్తే రిఫ్రెషింగ్ స్ప్రౌట్స్ చాట్ సిద్ధం. ఇది రోజంతా ఎనర్జీని ఇస్తుంది.

3. వెజిటబుల్ సాండ్‌విచ్: బ్రెడ్ స్లైసులపై బటర్ లేదా గ్రీన్ చట్నీ రాసి.. కీరా, టమోటా, ఉల్లిపాయ ముక్కలు పెట్టాలి. కొంచెం మిరియాల పొడి చల్లితే చాలు. గ్యాస్ వెలిగించే పనిలేకుండానే సంతృప్తికరమైన బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేయొచ్చు.

4. ఓవర్‌నైట్ ఓట్స్ (Overnight Oats): వండాల్సిన అవసరం లేని మరొక ఆప్షన్ ఇది. ఒక జార్‌లో ఓట్స్, పాలు కలిపి.. అందులో ఫ్రూట్స్, తేనె లేదా బెల్లం వేసి రాత్రంతా ఉంచాలి. ఉదయానికి ఓట్స్ మెత్తగా అయ్యి తినడానికి సిద్ధంగా ఉంటాయి. ఇవి ఫైబర్‌తో నిండి ఉంటాయి.

5. ఫ్రూట్ చాట్: ఆపిల్, బనానా, పపాయా వంటి తాజా పండ్లను కట్ చేసి, కొంచెం నిమ్మరసం, చాట్ మసాలా కలిపితే విటమిన్లతో కూడిన ఫ్రూట్ చాట్ సిద్ధం. వేసవి రోజుల్లో ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

Show More
Back to top button