Telugu News

డిజిటల్ చెల్లింపుల విషయంలో ఇవి పాటించండి!

ఈరోజుల్లో ఎక్కడికెళ్లినా డిజిటల్ పేమెంట్స్ చేయడమనేది కామన్ అయిపోయింది. డైలీ రొటీన్ ట్రాన్సాక్షన్స్ ను మరింత స్పీడ్ అండ్ ఈజీ వేలో చేస్తూ.. మన టైం, పనిని సులువు చేస్తోంది.

కానీ అదే సమయంలో సైబర్ మోసాలూ అదే స్థాయిలో పెరిగాయి. దీంతో డిజిటల్ చెల్లింపుల సేఫ్టీ విషయంలో యూజర్స్ కు మరింత అవగాహన పెంచేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొన్ని సూచనలను చేసింది. అవి:

1.ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు స్క్రీన్ పైన కనిపించే అవతలి వారి పేరును, నంబర్ ను తప్పనిసరిగా వెరిఫై చేయాలి. మీరు ఎవరికి డబ్బు పంపిస్తున్నారో, ఆ పేరే స్క్రీన్ మీద ఉందో, లేదో అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు కన్ఫర్మ్ చేసుకోవడం అవసరం. తొందరపడి పొరపాటున తప్పు నంబర్ కి పేమెంట్ జరగకుండా ముందే జాగ్రత్త పడొచ్చు.

2.ఎప్పుడూ అఫిషియల్ లేదా యూసేజ్ లో ఉన్న  వెబ్సైట్ల ద్వారా మాత్రమే పేమెంట్స్ జరపాలి. మీకు తెలియనివారి నుంచి వచ్చిన లింక్స్, మెసేజ్ ల ద్వారా యాప్ లను అసలు డౌన్లోడ్ చేసుకోవడం గానీ లింకులపై క్లిక్ చేయడం గానీ చేయొద్దు.

3.మీ యూపీఐ పిన్, ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) లేదా బ్యాంక్ వివరాలు పూర్తిగా పర్సనల్ అండ్ సీక్రెట్ గా ఉంచుకోవాలి. వాటిని ఎవరికీ చెప్పకూడదు. బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని,  ప్రభుత్వ కార్యాలయానికి చెందినవారమని మీకు కాల్ చేసి చెప్పినా సరే, మీ పర్సనల్ వివరాలను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. 

4.మీ అకౌంట్ కి పొరపాటున అమౌంట్ అయ్యిందని అవి వెంటనే తిరిగి పే చేయాలని లేదా మీ వివరాలను అర్జంట్ గా చెప్పాలని ఎవరైనా మిమ్మల్ని తొందరపెడితే, అసలు టెన్షన్ అవ్వొద్దు. ఒకటికి రెండుసార్లు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోండి. అవసరమైతే వారికి తిరిగి కాల్ చేస్తానని చెప్పి, కాల్ అంతటితో కట్ చేయడం బెటర్. ఇందుకోసం విడిగా పేమెంట్ అలర్ట్లను ఆన్ చేసుకోవడం వల్ల మీరు చేసే పేమెంట్స్ రిలేటెడ్ ఎస్ఎంఎస్ లు, యాప్ నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు వస్తాయి. దీనివల్ల ప్రతి అలర్ట్ ను జాగ్రత్తగా చదివి, తేడాగా అనిపిస్తే వెంటనే మీ బ్యాంక్ లేదా పేమెంట్ యాప్ ను కాంటాక్ట్ అవ్వొచ్చు.

పైన తెలిపిన టిప్స్ ను పాటించడం వల్ల సైబర్ నేరాలను కొంత వరకైనా అరికట్టవచ్చు. . అవగాహన, బాధ్యతాయుతమైన వినియోగం పెరిగే కొద్దీ రోజువారీ డిజిటల్ చెల్లింపులు సేఫ్ అండ్ సేక్యూర్డ్ గా మారతాయి. అన్ నౌన్ నంబర్లు కనిపించినప్పుడు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కి డయల్ చేయండి. లేదా టెలిక మ్యూనికేషన్స్ విభాగానికి (https://sancharsathi. gov. in/sfc/) ఫిర్యాదు చేయొచ్చు. 

Show More
Back to top button