HEALTH & LIFESTYLE

వానలో తడిస్తే ఫంగల్‌ వ్యాధులు వస్తాయి!!

ఈ వానాకాలంలో ఆడపాదడపా తడుస్తూనే ఉంటాం. ఇంట్లోకి తడి చేరడం.. అలా తడి మ్యాట్‌ మీద నిల్చునే వంట పనులు.. ఇతర పనులను చేసుకుంటూ ఉంటాం. అయితే ఇలా నీళ్లలో, తడి వాటర్ లో ఎక్కువగా తడవడం, నానుతూ ఉండటం వల్ల ఈ కాలంలో కొన్ని చర్మ సమస్యలు వచ్చే ప్రమాదముంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అవేమిటంటే:

వానలో తడవడాన్ని అందరం ఇష్టపడతాం. కానీ వాతావరణంలోని కాలుష్య కారకాలు, సూక్ష్మక్రిములు అవి వాన నీటిలో కలవడం వల్ల  తడిచిన తరువాత ఈ తడి తేమ శరీరంలోకి ఇంకి రకరకాల హెల్త్‌ సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి బయటి నుంచి వచ్చిన వెంటనే శుభ్రంగా స్నానం చేయడం మంచిది. అలాగే వానలో తడిచిన దుస్తుల్లో ఎక్కువసేపు ఉండిపోతుంటారు కొందరు. ఇలా ఉండటం వల్ల జ్వరం, చర్మం మీద దద్దుర్లు వచ్చే అవకాశముంది.

ఇలా శరీరం మీద తేమ నిల్వ ఉండిపోయి, ఫంగస్‌ పెరిగే అవకాశం కూడా ఎక్కువవుతుంది. అందువల్ల పొడిబట్టలు వేసుకోవడం, శరీరాన్ని పొడిగా ఉంచుకోవడం ముఖ్యం. వర్షంలో దుస్తులతో పాటు బూట్లు, సాక్సులు కూడా తడిచిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ వాటిని మార్చుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్నప్పటికీ చెప్పులు వేసుకుని నడవడం ఇంకా ఉత్తమం.

నీళ్లలో ఎక్కువగా నానినప్పుడు పాదాలు, వేళ్లు పాడవుతాయి. ఇలాంటి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లకు దూరంగా ఉండాలంటే తడిచిన పాదాలను వెంటనే పొడి క్లాత్‌తో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. రాత్రి పడుకోబోయే ముందు పాదాలకూ, వేళ్లకూ మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఒకవేళ పాదాలకు ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకితే యాంటీ ఫంగల్‌ క్రీమ్‌ను వాడాలి. ఈ జాగ్రత్తలతో కూడా ఇన్‌ఫెక్షన్‌ అదుపులోకి రాకపోతే స్కిన్‌ స్పెషలిస్ట్‌ను కలవాలి. ఈ కాలంలో రబ్బరు, ప్లాస్టిక్‌ చెప్పులను ఎక్కువగా వాడుతూ ఉంటాం.

కానీ వీటిలోకి చొరబడిన నీరు అక్కడే స్టోర్‌ అయి, ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతుంది. కాబట్టి గాలి ఫ్రీగా వెళ్లగలిగేలా చెప్పులు, బూట్లను ఉపయోగించాలి లేదంటే పూర్తిగా ఆరిన తర్వాతే వేసుకోవాలి. ఈ కాలంలో బట్టలు త్వరగా ఎండవు. అయినా గాలికి పూర్తిగా ఆరిన తరువాతనే వేసుకోవాలి. వేసవిలో వేసుకునేట్టుగానే లూజ్‌గా గాలి ఆడే వాటిని ప్రిఫర్‌ చేయాలి.  బిగుతుగా ఉండే జీన్స్‌ లాంటి వాటికి ఈ కాలంలో దూరంగా ఉండటమే మేలు. రెయిన్ కోట్, వెచ్చదనం పెంచే స్వెట్టర్ కోట్ ధరించడం మరవద్దు.

Show More
Back to top button