
ఉద్యోగులకు PF అనేది ఒక గొప్ప ఆర్థిక భరోసా. ప్రతి నెలా మీ జీతం నుండి PF కట్ అవుతుందంటే, మీరు భవిష్యత్తు కోసం పొదుపు చేస్తున్నారని అర్థం. ఇప్పుడు EPFO తన సేవలను మరింత సులభతరం చేయడానికి EPFO 3.0ని తీసుకువచ్చింది. దీనివల్ల విత్డ్రావల్ నియమాల్లో కొన్ని కీలక మార్పులు వచ్చాయి:
తక్షణ ఉపసంహరణ: గతంలో ఒక నెల నిరుద్యోగిగా ఉంటే 75% బ్యాలెన్స్ విత్డ్రా చేసుకునే వీలుండేది. ఇప్పుడు ఉద్యోగం కోల్పోయిన వెంటనే 75% మొత్తాన్ని తీసుకోవచ్చు.
పూర్తి ఉపసంహరణ (100%): దీనికోసం కనీసం 12 నెలల పాటు నిరుద్యోగిగా ఉండాలి.
పెన్షన్ నిధులు: గతంలో పెన్షన్ డబ్బు విత్డ్రా చేయడానికి 2 నెలల నిరుద్యోగ గడువు ఉండేది, కానీ ఇప్పుడు దీర్ఘకాలిక భద్రత కోసం ఈ గడువును 36 నెలలకు పెంచారు.
ప్రకృతి వైపరీత్యాలు: గతంలో కేవలం ₹5,000 లేదా 50% వాటా మాత్రమే తీసుకునే వీలుండేది. ఇప్పుడు ఒక సంవత్సరం సర్వీస్ పూర్తయిన తర్వాత ఇలాంటి విత్డ్రాయల్స్ సులభతరం అయ్యాయి.
విద్య & వివాహం: చదువు కోసం గతంలో 3 సార్లు మాత్రమే అనుమతి ఉండగా, ఇప్పుడు గరిష్టంగా 10 సార్లు విత్డ్రా చేసుకోవచ్చు. వివాహ అవసరాల కోసం 2 సార్లు ఉన్న పరిమితిని 5 సార్లు పెంచారు.
గృహ అవసరాలు: ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు కోసం 90% వరకు విత్డ్రా చేసుకునే వెసులుబాటు యథాతథంగా కొనసాగుతుంది.
డిజిటల్ ప్రాసెసింగ్: ఇప్పుడు PF డబ్బును ఆన్లైన్ ద్వారా వేగంగా, సులభంగా విత్డ్రా చేయవచ్చు.










