HEALTH & LIFESTYLE

ఒత్తిడిని తగ్గించే ఆహారాలు

ఈ రోజుల్లో అన్ని అనారోగ్య సమస్యలకు ఒత్తిడి ఒక కారణంగా మారుతోంది. అడ్రినలిన్, కార్టిసాల్ వంటి హార్మోన్స్ శరీరంలో విడుదలవడం వల్ల ఒత్తిడి స్థాయి పెరుగుతుంది. దీనికి కారణాలుగా ఆందోళన కలిగించే ఆలోచనలు, దీర్ఘంగా ఒకే అంశంపై ఆలోచించడం వంటివి ఉన్నాయి. మనం తీసుకునే ప్రాసెస్ చేసిన మాంసం, అధిక చక్కెర స్థాయి ఉన్న పదార్థాలు, టీ, కాఫీ ఒత్తిడిని పెంచుతాయి. ఆందోళన స్థాయిలను తగ్గించడానికి కొన్ని రకాల ఆహారాలు తోడ్పడతాయి. ఇవి మానసిక ఉపశమనాన్ని ఇస్తాయి. ఒత్తిడిని నియంత్రించడానికి మంచి ఔషధాలుగా పనిచేస్తాయి. ఇందుకుగానూ నిపుణులు కింది ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

1. జీడిపప్పులో అధిక మెగ్నీషియం కంటెంట్ ఉన్న కారణంగా విశ్రాంతి, ప్రశాంతతను చేకూర్చటంలో సహాయపడుతుంది.

2. బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఆందోళనను మరింత తీవ్రతరం చేసే ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరం, మెదడును రక్షిస్తాయి.

3. బ్రస్సెల్స్ మొలకల్లో విటమిన్-C పుష్కలంగా ఉంటుంది. ఇది ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేసే హార్మోన్లు ఉత్పత్తి చేసే అడ్రినల్ గ్రంథులకు మద్దతు ఇస్తుంది.

4. సాల్మన్‌ చేపలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఆందోళన లక్షణాలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.

5. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. దీనికి ఒత్తిడిని తగ్గించే లక్షణాలు ఉంటాయి.

6. ఊరగాయలలోని ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యానికి, మెరుగైన మానసిక స్థితికి తోడ్పడుతాయి.

7. అవకాడొలో ఆరోగ్యకరమైన కొవ్వులు, B విటమిన్లు ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి.

8. డార్క్ చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్స్ మిమ్మల్ని ఉత్తేజపరుస్తాయి.

9. లిథినైన్ ఇది గ్రీన్ టీలో ఉండే ఒక అమైనో ఆమ్లం, విశ్రాంతిని, నిద్రను మెరుగుపరుస్తుంది.

Show More
Back to top button