
కూరగాయల విషయంలో కొందరు పచ్చివి తింటే మంచిదని.. కొందరు వండినవి తింటే మేలని అంటుంటారు. కానీ.. మీకు ఎలాంటి వాటిని పచ్చిగా తినాలి? ఏవి వండి తింటే మంచిదో తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకోండి.
బీట్‌రూట్:
బీట్‌రూట్‌లో మెదడుకు, గుండెకు అవసరమైన ఫోలేట్ ఉంటుంది. గర్భిణుల్లో పిండం ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఫోలేట్ ఎంతో ఉపయోగపడుతుంది. బీట్‌రూట్‌ను ఉడికిస్తే ఈ పోలేట్ నశిస్తుంది. కాబట్టి బీట్‌రూట్‌ను సాధ్యమైనంత ఎక్కువగా జ్యూస్ రూపంలో తీసుకోవడం మేలు.
ఉల్లిపాయలు:
ఉల్లిపాయలు పచ్చిగా ఉన్నప్పుడే వాటిలో ఎక్కువ శాతం అల్లిసిన్ అనే ఫైటో న్యూట్రియంట్ ఉంటుంది. ఇది ఆస్టియోఆర్థరైటిస్ రాకుండా అరికడుతుంది. కాబట్టి అప్పుడప్పుడూ పచ్చి ఉల్లిపాయలు తింటే మంచిది.
క్యాప్సికం:
దీనిలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఇది హృద్రోగాలు, కంటి జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. క్యాప్సికం పచ్చిగానే తినాలి లేదా కొద్ది సేపు మాత్రమే ఉడికించాలి. కానీ మెత్తగా ఉడికించ కూడదు.
* వీటిని వండాల్సిందే!
టమాటా:
వీటిలో యాంటీఆక్సిడెంట్, ఫైటోకెమికల్, లైకోపైన్ ఉంటాయి. క్యాన్సర్, గుండె జబ్బులు లాంటివి రాకుండా కాపాడే ఈ పోషక పదార్థాన్ని శరీరం చక్కగా శోషించుకోవాలంటే టమాటాను ఉడికించి తింటే మంచిది.
పుట్టగొడుగులు:
వీటిలో శక్తివంతమైన పాలీశాఖరైడ్స్ ఉంటాయి. వాటితో పాటు కొద్దిగా టాక్సిన్స్ కూడా ఉంటాయి. ఈ టాక్సిన్స్ పోయి పాలీశాఖరైడ్స్ శరీరానికి వంటబట్టాలంటే పుట్టగొడుగుల్ని ఉడికించి తినాలి.
ఆస్పరాగస్:
క్యాన్సర్‌తో పోరాడే ఫెర్యూలిక్ అనే యాంటీ ఆక్సిడెంట్ ప్రయోజనాన్ని పూర్తిగా పొందాలంటే ఆస్పరాగస్‌ను ఉడికించి తినాలి.










