CINEMATelugu Cinema

71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా విడుదల

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2023ను ప్రకటించింది. ఈ ఏడాది ’12th ఫెయిల్‌’ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఈ జాబితాలో పలు ఆశ్చర్యకరమైన పేర్లు ఉన్నాయి.

ప్రధాన పురస్కారాలు
ఉత్తమ నటుడు: ఈసారి ఉత్తమ నటుడు అవార్డును ఇద్దరు మహానటులు పంచుకున్నారు. షారుఖ్‌ ఖాన్‌ (‘జవాన్‌’ చిత్రం) మరియు విక్రాంత్‌ మస్సే (’12th ఫెయిల్‌’ చిత్రం) ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఉత్తమ నటి: ‘మిస్సెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే’ (హిందీ) చిత్రంలో తన అద్భుతమైన నటనకు రాణీ ముఖర్జీ ఉత్తమ నటిగా అవార్డును కైవసం చేసుకుంది.

ఉత్తమ తెలుగు చిత్రం: నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్‌ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికై తెలుగు ప్రేక్షకులకు గర్వకారణంగా నిలిచింది.

ఉత్తమ తమిళ చిత్రం: ‘పార్కింగ్‌’ ఉత్తమ తమిళ చిత్రంగా అవార్డును గెలుచుకుంది.

బెస్ట్‌ ఫిల్మ్‌ క్రిటిక్‌: ఈ అవార్డు ఉత్పల్‌ దత్త (అస్సామీ) గారికి ప్రకటించారు.

ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో విజేతలు:
ఉత్తమ మ్యూజిక్‌ దర్శకత్వం: జీవీ ప్రకాశ్‌ కుమార్‌ (‘వాతి’ – తమిళం)

ఉత్తమ సంగీతం (నేపథ్యం): హర్షవర్థన్‌ రామేశ్వర్‌ (‘యానిమల్‌’)

బెస్ట్‌ మేకప్‌: శ్రీకాంత్‌ దేశాయ్‌ (‘సామ్‌ బహదూర్‌’ – హిందీ)

బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ‘సామ్‌ బహదూర్‌’ (హిందీ) చిత్రానికి

బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌: మోహన్‌దాస్‌ (‘2018 – ఎవ్రీ వన్‌ ఈజ్‌ ఏ హీరో’ – మలయాళం)

బెస్ట్‌ ఎడిటింగ్‌: మిధున్‌ మురళి (‘పూక్కాలమ్‌’ – మలయాళం)

బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: సచిన్‌ సుధాకరన్‌, హరి హరన్‌ మురళీ ధరన్‌ (‘యానిమల్‌’ – హిందీ)

బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌): సాయి రాజేశ్‌ నీలం (‘బేబీ’ – తెలుగు)

బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (అడాప్టెడ్‌): రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌ (‘పార్కింగ్‌’ – తమిళం)

ఉత్తమ సంభాషణలు: దీపక్‌ కింగ్రానీ (‘సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై’ – హిందీ)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: పసంతను మొహపాత్రో (‘ది కేరళ స్టోరీ’ – హిందీ)

ఉత్తమ నేపథ్య గాయని: శిల్పారావు (‘జవాన్‌’ – చెలియా పాట)

ఉత్తమ నేపథ్య గాయకుడు: పీవీన్‌ ఎస్‌ రోహిత్‌ (‘బేబీ’ చిత్రం)

బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: సుకృతివేణి (‘గాంధీతాత చెట్టు’), కబీర్‌ ఖండారీ (‘జిప్సీ’ – మరాఠీ), త్రిష థోసర్‌, శ్రీనివాస్‌ పోకలే, భార్గవ్‌ జగ్దీప్‌ (‘నాల్‌ 2’ – మరాఠీ)

ఉత్తమ సహాయ నటి: ఊర్వశి (‘ఉల్లుకు’ – మలయాళం), జానకీ బోడివాలా (‘వష్‌’ – గుజరాతీ)

ఉత్తమ సహాయ నటుడు: విజయ రాఘవన్‌ (‘పూక్కాలం’ – మలయాళం), ముత్తుపెట్టాయ్‌ సోము భాస్కర్‌ (‘పార్కింగ్‌’ – తమిళం)

ఉత్తమ దర్శకత్వం: సుదీప్తో సేన్‌ (‘ది కేరళ స్టోరీ’ – హిందీ)

ఉత్తమ యానిమేషన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ మూవీ: ‘హనుమాన్‌’ (తెలుగు)

ఉత్తమ బాలల చిత్రం: ‘నాల్‌’ (మరాఠీ)

ఉత్తమ జాతీయ సమగ్రత, సామాజిక విలువల చిత్రం: ‘సామ్‌ బహదూర్‌’ (హిందీ)

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: ‘రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ’ (హిందీ)

ఉత్తమ పరిచయ దర్శకుడు: ఆశిష్‌ బెండే (‘ఆత్మపాంప్లెట్‌’ – మరాఠీ)

ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌: ’12th ఫెయిల్‌’

నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌ కేటగిరీ విజేతలు:
స్పెషల్‌ మెన్షన్‌ చిత్రాలు: ‘నేకల్‌: క్రానికల్‌ ఆఫ్‌ ప్యాడీ మ్యాన్‌’ (మలయాళం), ‘ది సీ అండ్‌ సెవెన్‌ విలెజెస్‌’ (ఒడియా)

బెస్ట్‌ స్క్రిప్ట్‌: ‘సన్‌ ఫ్లవర్స్‌ వోర్‌ ది ఫస్ట్‌ వన్స్‌ టు నో’ (కన్నడ)

బెస్ట్‌ వాయిస్‌ ఓవర్‌: ‘ది సేక్రెడ్‌ జాక్‌ – ఎక్స్‌ప్లోరింగ్‌ ది ట్రీస్‌ ఆఫ్‌ విషెస్‌’ (ఇంగ్లీష్‌)

బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌: ‘ది ఫస్ట్‌ ఫిల్మ్‌’ (హిందీ)

బెస్ట్‌ ఎడిటింగ్‌: ‘మూవీంగ్‌ ఫోకస్‌’ (ఇంగ్లీష్‌)

బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: ‘దుందగిరి కే ఫూల్‌’ (హిందీ)

బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: ‘లిటిల్‌ వింగ్స్‌’ (తమిళ్‌)

బెస్ట్‌ డైరెక్షన్‌: ‘ది ఫస్ట్‌ ఫిల్మ్‌’ (హిందీ)

బెస్ట్‌ ఆర్ట్స్‌/కల్చర్‌ ఫిల్మ్‌: ‘టైమ్‌లెస్‌ తమిళనాడు’ (ఇంగ్లీష్‌)

బెస్ట్‌ బయోగ్రాఫికల్‌ ఫిల్మ్‌: ‘మా బావు, మా గావ్‌’ (ఒడిశా), ‘లెంటినో ఓవో ఏ లైట్‌ ఆన్‌ ది ఈస్ట్రన్‌ హారిజాన్‌’ (ఇంగ్లీష్‌)

ఉత్తమ పరిచయ దర్శకుడు: ‘మావ్‌: ది స్పిరిట్‌ డ్రీమ్స్‌ ఆఫ్‌ చెరా’ (మిజో)

బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: ‘ప్లవరింగ్‌ మ్యాన్‌’ (హిందీ)

Show More
Back to top button