
ప్రెగ్నెన్సీ.. ప్రతి మహిళకు అందమైన, అద్భుతమైన అనుభవం. గర్భం దాల్చినప్పుడు చాలా శ్రద్ధ అవసరం. తల్లి ఆరోగ్యమే.. బిడ్డ ఆరోగ్యం కాబట్టి ఈ టైమ్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. బిడ్డ ఎదుగుదల కోసం తల్లి తీసుకునే ఆహారం, జీవనశైలి చాలా ముఖ్యం. నిపుణుల మాటల ప్రకారం… కొన్ని సాధారణమైన జాగ్రత్తలు పాటిస్తే.. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. బిడ్డకు కావాల్సిన పోషకాలు సరిగ్గా అందుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
* సమయానికి ఆహారం తినాలి, ఉపవాసాలు మానేయాలి
* నీటిని ఎక్కువగా తాగాలి
* విటమిన్లు, ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారం తీసుకోవాలి
* ఎక్కువ మసాలా, జంక్ ఫుడ్స్ మానేయాలి
* హాయిగా నిద్రపోవాలి, ఒత్తిడిని దూరం పెట్టాలి
* డాక్టర్ చెప్పిన మాత్రలు, సప్లిమెంట్స్ మిస్ కాకుండా తీసుకోవాలి
* నెలల ప్రకారం స్కానింగ్, బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి
* ప్రాసెస్ చేసిన మాంసాహారాలు, కూల్ డ్రింక్స్ అస్సలు తీసుకోవద్దు
* ఎక్కువ నడక మానేయాలి, మెట్లు ఎక్కడం తగ్గించాలి
* మితంగా వ్యాయామం చేయాలి. అదికూడా వైద్యల సలహాతో మాత్రమే చేయాలి










