FOOD

ఫుడ్ కలర్స్ మంచివేనా?

ప్రస్తుతం చాలామంది తినే ఆహారపదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. కానీ, కొంతమంది మాత్రం ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా.. టేస్ట్, లుక్‌కి ప్రియారిటీ ఇస్తున్నారు. నిజానికి చూడటానికి కలర్‌ఫుల్‌గా ఉండే పదార్థాల్లో కృత్రిమంగా తయారు చేసిన రసాయనాలు వాడుతుంటారు. మనం బేకరీలో చూసే కేక్‌లలో ఎక్కువశాతం ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ ఉపయోగించే తయారు చేస్తున్నారు. వీట్లో ఎక్కువగా రెడ్, బ్లూ, గ్రీన్, సిల్వర్, గోల్డ్ మొదలైన రంగులు గమనించే ఉంటారు. ఈ రంగులన్నీ కృత్రిమంగా తయారు చేసినవే. ఇవి ఈ మధ్య కొత్తగా వచ్చినవేమీ కావు.. 18వ శతాబ్దం నుంచే వాడుకలోకి ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్‌ని ముడి చమురు నుంచి పెట్రోల్ తీయగా మిగిలిన పదార్థాలతో తయారు చేస్తారు. ఈ ఫుడ్ కలర్స్‌ మొదట్లో దుస్తులకు రంగుల అద్దకానికి వాడేవారు. తర్వాత వీటికి మరిన్ని కెమికల్స్ కలిపి వాటిని ఫుడ్ కలర్స్‌గా వాడుతున్నారు. 

 కనిపించే రంగుల వెనుక కనిపించని ప్రమాదాలు 

ఫుడ్ కలర్స్ ప్రజల దృష్టిని, ముఖ్యంగా పిల్లలను ఆకర్షిస్తాయి. ఫుడ్ కలర్స్‌‌తో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల చాలామంది అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఫుడ్ కలర్స్ కిడ్నీలను దెబ్బ తీయడంతో పాటు, ఉదర సంబంధిత వ్యాధులకు కారణం అవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సింథటిక్ రంగులతో చేసిన క్యాండీలు, చాక్లెట్ల వంటి తినుబండారాలు పిల్లలకు నిద్రలేమి, చిరాకు, డిప్రెషన్, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలకు దారితీస్తాయని నిపుణులు అంటున్నారు.

ఫుడ్ కలర్స్ చిన్నారుల్లో హైపర్ యాక్టివిటీకి కారణమవుతాయట. ఈ ఫుడ్ కలర్స్‌లో క్యాన్సర్ కారకాలైన కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయట. అలాగే ఆస్తమా లక్షణాలకు కూడా దారితీస్తాయి. సరైన ఆధారాలు లేనప్పటికీ జరిపిన పరిశోధనల్లో ఫుడ్ కలర్స్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Show More
Back to top button