HEALTH & LIFESTYLE

మధుమేహం కోరలు..!

మన శరీరంలో క్లోమ గ్రంధి విడుదల చేసే ఇన్సులిన్ కొరతతో మధుమేహం వస్తుంది. ఇన్సులిన్ రక్తంలోని గ్లూకోజ్ శరీర కణాల్లోకి ప్రవేశించేలా చేస్తుంది. ఇన్సులిన్ కొరతతో రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోతాయి. దీన్ని షుగర్ వ్యాధిగా పిలుస్తారు.  ప్రస్తుతం మనదేశంలో 77 మిలియన్ వ్యాధి గ్రస్తులు ఉన్నారట. 2045 నాటికి వారు 135 మిలియన్స్‌కు చేరతారని ఓ అంచనా. గోవా రాష్ట్రంలో అత్యధికంగా షుగర్ పేషంట్స్ ఉన్నారు. ఈ వ్యాధి పట్ల అవగాహన ఉన్న రాష్ట్రంగా కేరళ మొదటి స్థానంలో ఉంది. అత్యధిక షుగర్ పేషంట్స్ చైనా, తర్వాత ఇండియా ఉంది. 1922లో చార్లెస్ బెస్ట్‌తో కలిసి ఇన్సులిన్‌ను కనిపెట్టిన సర్ ఫ్రెడరిక్ బాంటింగ్ జన్మదిన సందర్భంగా ప్రతీ సంవత్సరం నవంబర్ 14న వరల్డ్ డయాబెటిస్ డేగా, ఈ రోజున డయాబెటిస్ పై అవగాహన కార్యక్రమాలు చేపడతారు.

*డయాబెటిస్ ఎన్ని రకాలు 

శరీర కణాలకు శక్తి అందించే ప్రక్రియలో ఇన్సులిన్ సమర్థంగా పనిచేయాలి. ఒక వేళ క్లోమ గ్రంధి ఇన్సులిన్‌ను సరిగా ఉత్పత్తి చేయకపోయినా లేదా ఇన్సులిన్ పనితీరులో లోపాలు ఉన్నా.. రక్తంలో గ్లూకోజ్ పేరుకుపోతుంది. గ్లూకోజ్‌ను శక్తిగా మార్చే ప్రక్రియకు ఆటంకం కలిగే ఈ స్థితినే డయాబెటిస్ లేదా మధుమేహం అంటారు. దీంట్లో వేర్వేరు రకాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ డయాబెటిస్‌ను మూడు రకాలుగా వర్గీకరించింది. అవే టైప్-1 డయాబెటిస్, టైప్-2 డయాబెటిస్, జెస్టేషనల్ డయాబెటిస్.

*టైప్-1 డయాబెటిస్ ఇన్సులిన్ తయారు చేసే కణాలను వారి రోగనిరోధక వ్యవస్థ నాశనం చేయడం వల్ల వస్తుంది.. దీన్నే ఆటో ఇమ్యూన్ రియాక్షన్ అంటారు. తగినంత ఇన్సులిన్ ఏర్పడకపోవడం వల్ల ఈ మధుమేహం వస్తుంది.

*టైప్-2 డయాబెటిస్ వంశపారపర్యంగా వస్తుంది. కుటుంబంలో ఇది వరకే ఈ వ్యాధి బారిన పడి ఉంటే, వాళ్ల వారసులకు వస్తుంది.

*జెస్టేషనల్ డయాబెటిస్ గర్భంతో ఉన్న మహిళలకు వస్తుంది.

Show More
Back to top button