TRAVEL

అయోధ్యకి ఎలా వెళ్లాలి..?

ఎంతో కాలం నుంచి ఎదురు చూసిన రామ మందిరం ప్రారంభోత్సవం అయింది. ఈ మందిరంలోని బాల రాముడిని చూడటానికి భక్తులు భారతదేశం నుంచే కాదు.. విదేశాల నుంచి కూడా వస్తున్నారు. ఇలా చాలా మందికి అయోధ్యకు వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య ఎలా వెళ్ళాలి అనే విషయం తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల నుంచి రైలు మార్గంలో వెళ్లాలంటే 15024 నంబర్ రైలులో వెళ్లవచ్చు. ఇది ప్రతీ గురువారం రాత్రి 11:00 నిమిషాలకు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరుతుంది. అక్కడి నుంచి ధర్మవరం, అనంతపూర్, కర్నూల్ సిటీ, మహబూబ్‌నగర్ స్టేషన్ల మీదుగా వెళ్లి మరుసటి రోజు అంటే శుక్రవారం ఉదయం 10:40 గంటలకు హైదరాబాద్, కాచిగూడకు చేరుకుంటుంది. కాచిగూడ నుంచి 10:50 గంటలకు బయలుదేరి అయోధ్య ధామ్‌ జంక్షన్‌కు చేరుకోవడానికి శనివారం సాయంత్రం 4:24 గంటలు అవుతుంది. కాబట్టి, ఛార్జీల విషయానికొస్తే, స్లీపర్‌కు రూ. 680, థర్డ్‌ ఏసీకి రూ. 1810, సెకండ్‌ ఏసీ రూ. 2,625, ఫస్ట్‌ ఏసీకి రూ.4,470గా ఉంది.

రోడ్డు మార్గంలో వెళ్లాలంటే.. తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య వెళ్లడానికి ఎన్నో ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. ఇందులో ఏసీ బస్సు ఉంది. నాన్ ఏసీ బస్సులు కూడా ఉన్నాయి. ఏసీ బస్సు టికెట్ ధర రూ.6,000 వరకు ఉంటుంది. నార్మల్ బస్సు అయితే రూ.4000 వరకు అవుతుంది.
విమాన మార్గంలో వెళ్లలంటే.. తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్లడానికి ముందుగా హైదరాబాద్‌లోని శంషాబాద్ చేరుకోవాలి. అక్కడి నుంచి ముంబైకి వెళ్లాలి. అక్కడి నుంచి అయోధ్య చేరుకోవచ్చు.
*ఈ విధంగా మీరు అయోధ్యకు చేరుకోవచ్చు. అక్కడ రూంకు దాదాపు రూ.1,200 నుంచి రూ.2,000 వరకు ఖర్చు అవుతుంది. అలాగే అక్కడ తిరగడానికి రోజుకు దాదాపు రూ.500 వరకు ఖర్చు అవుతుంది. దీంతో పాటు రోజుకు ఆహారానికి దాదాపు రూ.500 వరకు అవుతుంది.

Show More
Back to top button