
ఇటీవల జిమ్ టైమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో జిమ్ చేయాలంటే భయపడుతున్నారు. అసలు.. వ్యాయామం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా హార్ట్ఎటాక్ ఎందుకు వస్తుంది? అనే విషయంపై నిపుణులు ఏం అంటున్నారంటే..
శారీరకంగా దృఢంగా ఉన్నవారిలో గుండె జబ్బుల లక్షణాలు త్వరగా కనిపించవు. అందువల్ల సడన్‌గా హార్ట్ఎటాక్ వస్తుందంటున్నారు. జిమ్ టైమ్‌లో వ్యాయామం చేసేటప్పుడు, శరీరంలో ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. అందుబాటులో ఉన్న రక్త సరఫరా సరిపోదు. కాబట్టి ఎక్స్సైజ్ చేసేటప్పుడు గుండెపోటు రావొచ్చని వైద్యులు అంటున్నారు.
జిమ్‌లో గుండెపోటుకు మరో కారణం అకస్మాత్తుగా రక్తనాళాల్లో రక్తం పెరగడం. ఎక్కువ వ్యాయామం చేయడం గుండెలో ఫ్లేక్ను డ్యామేజ్ చేస్తుంది. అలాగే హార్ట్‌లో ఎలక్ట్రిక్ షాక్ వేవ్స్ కలిగి కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తుంది. అధిక శారీరక శ్రమ చేస్తే ఆకస్మిక కార్డియాక్ మరణం చాలా సాధారణమని చెబుతున్నారు డాక్టర్లు.
వ్యాయామ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి
వ్యాయామం చేయడం మంచిదే. కానీ, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకోకుండా అతిగా చేస్తే ప్రాణాలకు ప్రమాదం.
- వర్కౌట్స్ సమయంలో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి తగినంత నీరు తాగాలి.
- వర్కౌట్స్ చేసే ముందు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో మీకు తేలికగా, వికారంగా లేదా వణుకుతున్నట్లు అనిపిస్తుంది. జిమ్‌కు వెళ్లే గంట ముందు పౌష్ఠికరమైన ఆహారం తినాలి.
- భోజనం చేయగానే వెంటనే జిమ్‌కి వెళ్లడం మంచిది కాదు.
- జంక్, ఆయిల్ ఫుడ్ తీసుకోవడం మానుకోండి.
- ఎక్సర్సైజ్ అతిగా చేస్తే హార్ట్‌బీట్ పెరిగి.. హార్ట్ఎటాక్ రావొచ్చు.
- ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన చెమట లేదా తేలికపాటి తలనొప్పి వంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.