
మనం ఫాలో అయ్యే డైట్, ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ అనేవి మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి. ఏ కొంచం డిస్టర్బ్ అయినా ఏదోక హెల్త్ ఇష్యూ ట్రిగ్గర్ చేసేస్తుంది. ఇప్పటీ కాలంలో మనం ఎక్కువగా వింటోంది.. ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకపోవడమే. మన శరీరం ఇన్సులిన్‌కు సరిగా రెస్పాండ్ కాకపోవడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఈ పరిస్థితి వల్ల ఎన్నో రకాలుగా హెల్త్ ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. అవేంటంటే…
టైప్ 2 డయాబెటిస్: ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే మోస్ట్ ఎఫెక్టెడ్ అండ్ మోస్ట్ కామన్ డిసీజ్ అన్నమాట. ఇన్సులిన్ పనిచేయకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి ఆమాంతం పెరిగిపోతాయి, ఇది టైప్ 2 డయాబెటిస్‌కు కారణమవుతుంది.
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS): ఆడవారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల హార్మోన్స్ ఇంబాలెన్స్ అయి PCOS వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల పీరియడ్స్ సరిగా రావు. వెయిట్ ఫుట్‌ఆన్ అవుతూ ఉంటారు.
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD): ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం వల్ల కాలేయంలో కొవ్వు అనేది పేరుకుపోతుంది. అంటే ఇది రెగ్యులర్‌గా ఆల్కహాల్ తాగినవారితో పోలిస్తే, తాగడం అలవాటు లేనివారిని ఎఫెక్ట్ చేస్తుంది.
అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్): ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రక్తనాళాలాల్లో బ్లాక్స్‌ను ఏర్పర్చి రక్తపోటును పెంచుతుంది. ఇది గుండె జబ్బులకు కారణమవుతోంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను నివారించేందుకు హెల్తీ ఫుడ్, రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం తప్పనిసరి. కార్బోహైడ్రేట్లు, చక్కెరలు తగ్గించి, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. బరువు అదుపులో ఉంచుకోవడం దీనికొక్కటే పరిష్కారం.










