CINEMATelugu Cinema

“క” మూవీ రివ్యూ

చాలా తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో కిరణ్‌ అబ్బవరం ఒకరు. అయితే తాజాగా ఆయన నటించిన లేటెస్ట్ మూవీ క(Ka) తో దీపావళి రేసులో ఎంటర్ అవ్వగా, ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్న కిరణ్ అబ్బవరం నమ్మకాన్ని సినిమా ఎంత వరకు నిలబెట్టిందో తెలుసుకుందాం పదండీ..

కథ..

అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనాథ. ఎప్పటికైనా తన తల్లిదండ్రులు తిరిగొస్తారన్న ఆశతో జీవిస్తుంటాడు. ఇతరుల ఉత్తరాలు చదువుతూ.. వాటిని తన సొంత వాళ్లే రాసినట్లు ఊహించుకుంటూ.. ఆ రాతల్లో తాను పోగొట్టుకున్న బంధాల్ని చూసుకుంటాడు. అయితే ఓసారి తన ఉత్తరం దొంగతనంగా చదివాడని మాస్టార్ గురునాథం (బలగం జయరాం) వాసును కొట్టడంతో.. ఆశ్రమం నుంచి పారిపోతాడు. ఈ క్రమంలోనే పోస్ట్‌మాస్టర్ రంగారావు (అచ్యుత్ కుమార్) కూతురు సత్యభామ (నయన సారిక)తో ప్రేమలో పడతాడు. మరోవైపు ఆ ఊళ్లో అమ్మాయిలు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోతుంటారు.

అయితే ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుకు ఓ లెటర్ వల్ల ఈ మిస్సింగ్ కేసులకు సంబంధించిన క్లూ ఒకటి దొరుకుతుంది. అక్కడి నుంచి వాసుదేవ్ జీవితం సమస్యల్లో చిక్కుకుంటుంది. మరి ఊరి అమ్మాయిలు కనిపించకుండా పోవడానికి కారణమెవరు? వాసుతో పాటు టీచర్‌ రాధ (తన్వి రామ్)ను కిడ్నాప్ చేసి వేధించే ముసుగు వ్యక్తి ఎవరు? అతనికి వీళ్లకూ ఉన్న విరోధం ఏంటి? ఆ ముసుగు వ్యక్తి బారి నుంచి వీళ్లిద్దరూ ఎలా బయటపడ్డారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!

ఎలా ఉందంటే..

దర్శకులు స్టైల్లో నడిపిన కథ ఆకట్టుకుంటోంది. కథ, కథనాలు, కిరణ్ అబ్బవరం నటన, విరామం, మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్. ఊహలకు తగ్గట్టు సాగే కొన్ని సన్నివేశాలు మైనస్. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ అప్పటి వరకు కథ స్లో గా సాగడం, బోర్ ఫీల్ అయ్యేలా చేసిన సీన్స్ ను మరిపిస్తూ ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే ఆడియన్స్ బయటికి వచ్చేలా చేస్తుంది.

రేటింగ్: 2.75

Show More
Back to top button