
వర్షాలు పడుతుంటే పూటపూటకూ జలుబు, జ్వరాలు, పొట్ట ఇన్‌ఫెక్షన్లు ఎక్కువవుతుంటాయి. ఈ సీజన్‌లో తినే ఆహారం పట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కొన్ని కూరగాయలు ఈ కాలంలో త్వరగా పాడవుతుంటాయి. దీంతో అవి వాడినప్పుడు శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంటుంది. ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం, మాన్సూన్ టైంలో ఈ మూడు కూరగాయలు తినకుండా ఉండటం మంచిది.
1. పుట్టగొడుగులు:
తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పుట్టే ఈ కూరగాయలు, వర్షాకాలంలో తినటం వల్ల ఫంగస్ వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బయట నుంచి తెచ్చినవి అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి.
2. ఆకుకూరలు:
పాలకూర, తోటకూర లాంటి ఆకుకూరలు తడి వాతావరణంలో త్వరగా పాడవుతాయి. శుభ్రంగా కడగకపోతే వాటిపై ఉండే ధూళి, సూక్ష్మజీవులు వల్ల విరేచనాలు, వాంతులు వచ్చే ప్రమాదం ఉంది.
3. క్యాబేజీ, కాలీఫ్లవర్:
ఇవి పొరల మధ్య తేమ ఇరుక్కొని ఉంటే శుభ్రపరచడం కష్టం. అందుకే వర్షాకాలంలో వీటిని తినకపోవడం మంచిది.
ఇవి ట్రై చేయండి..
బెండకాయ, పొట్లకాయ, గుమ్మడికాయ వంటి తక్కువ తేమ ఉన్న కూరగాయలు మాన్సూన్‌లో సేఫ్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూరగాయలు ఉప్పు నీటిలో కడిగి వండటం మంచిది.










