HEALTH & LIFESTYLE

పిక్కలు పట్టేస్తున్నాయా?.. అయితే పరిష్కారం ఏంటి?

మనం అన్ని రకాల పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. లేదంటే, పోషకాల లోపంతో అనారోగ్యం బారిన పడతాం. పోషకాహార లోపం ఉందని తెలిపే లక్షణాల్లో కాలి పిక్క‌లు ప‌ట్టేయ‌డం  ఒకటి. చాలామందిలో నిద్రపోతున్నప్పుడు తరుచుగా కాలు పైకి ఎత్తితే తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి ప్రశాంతంగా నిద్రపోనివ్వదు. నిద్రలో ఉన్నప్పుడే కాకుండా కొంతమందిలో పగటి పూట ఇలా కాళ్లు లాగడం(పిక్కల్లో నొప్పి) వస్తుంది. దీనికి కారణం మెగ్నీషియం లోపం అని వైద్యులు చెబుతున్నారు.

ఈ నొప్పితో ఎక్కువసేపు కూర్చోలేరు, నిలబడలేరు, తిమ్మిర్లు వస్తాయి. దీంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి లక్షణాలు మీరు అనుభవిస్తున్నట్లు మీలో మెగ్నీషియం లోపం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే, ఈ లక్షణాలు రక్తహీనత కారణంగా కూడా వస్తాయి. కాబట్టి, రక్తహీనత పరీక్ష చేయించుకోండి. రక్తహీనత ఉన్నట్లయితే ఐరన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి.

పరిష్కారం ఏంటి?

మెగ్నీషియం లోపం కారణంగా ఈ నొప్పులు వస్తాయి. కాబట్టి.. దీనికి పరిష్కారంగా మెగ్నీషియం అధికంగా ఉండే పాలకూర, గుమ్మడి గింజలు, బాదం పప్పు, పెరుగు, ఆకుకూరలు తినాలి. అనపకాయ, బూడిద గుమ్మడికాయ ఆహారంగా తీసుకోవాలి. తక్షణ ఉపశమనం కోసం నొప్పి ఉన్న ప్రదేశంలో ఐస్ అద్దుతూ కాపడం పెట్టాలి.

రాత్రి పడుకున్నప్పుడు కాళ్ల కింద దిండ్లు పెట్టుకుని కాళ్లు ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. కాళ్లు బాగా చాచి అటూఇటూ కదుపుతూ చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే నొప్పి నుంచి ఉపశమనం ల‌భిస్తుంది. ఒకవేళ నొప్పి అధికంగా ఉంటే డాక్టర్‌ని సంప్రదించండి.

Show More
Back to top button