
కూకట్‌పల్లిలో దారుణం.. పదకొండేళ్ల బాలిక సహస్రను పదవ తరగతి అబ్బాయి హత్య చేశాడు. ఇంట్లోకి చొరబడి 80 వేలు తీసుకుని పారిపోతుండగా సహస్ర అతన్ని అడ్డుకుంది. దీంతో బాలిక గొంతు నులిమి హత్య చేశాడు నిందితుడు. సహస్ర చనిపోయిందో లేదో అనే అనుమానంతో గొంతు కోసి, విచక్షణరహితంగా కత్తితో పొడిచాడు. పోలీసులు ఈ కేసును ఛేదించారు. హత్య కంటే ముందే ఆ మైనర్ బాలుడు ఎలా దొంగతనం చేయాలి.. దొరికితే ఏం చేయాలో ముందుగానే యూట్యూబ్‌లో చూసి వచ్చాడు అంటా. మరో చోట ఇన్‌స్టా పరిచయంతో సౌమ్య అనే బాలిక గర్భవతి అయ్యింది. యూట్యూబ్ లో ఆబార్షన్ ఎలా చేయాలో చూసి ఆ బాలిక ప్రాణాలు తీశాడు మరో బాలుడు. అంటే సోషల్ మీడియా వాడటం వలన మనం ఏం నేర్చుకుంటున్నాం. మన పిల్లలు ఎలా చెడిపోతున్నారో ఈ ఘటనలు చూస్తే అర్ధం అవుతుంది.
మనం చేయగలిగింది ఇదేనా
‘బాలల్లో ఎందుకీ నేరప్రవృత్తి?’, ‘నేరాల్లో బందీ అవుతున్న బాల్యం’, ‘నేటి బాలలే..రేపటి నేరస్తులు’, ‘రక్తమోడుతున్న బాల్యం’.. అంటూ చక్కటి హెడ్డింగ్లతో స్పెషల్ స్టోరీలు వస్తాయి. ‘భావితరానికి ఏమైంది?’, ‘బాలలూ.. ఎందుకిలా మీరు?’, ‘ఈ పిల్లోళ్లు..నేరగాళ్లు’, ‘బంగారు బాల్యంపై నేరాల నీడ’ అనే టైటిల్స్ పెట్టి, ప్రముఖ ఛానెల్స్ కవర్ స్టోరీలు చేస్తాయి. ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాళ్లను, సైక్రియాట్రిస్టులను స్టూడియోలకు పిలిపించి చర్చావేదికలు పెట్టిస్తాయి.
సోషల్ మీడియాలో కొందరు కన్నీరు కారుస్తారు. కొందరు శ్రద్దాంజలి ఘటిస్తారు. కొందరు సమాజాన్ని తిడతారు. కొందరు కవిత్వం రాయగలిగితే రాస్తారు. మరికొందరు ‘కలికాలం’ అంటారు. నేడు మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి అంటారు. తల్లిదండ్రులు పిల్లలకు సామాజిక విలువలు ఎవరూ నేర్పడం లేదని ఆక్రోశిస్తారు. అసలు నేటి జనరేషన్ పిల్లలు అటు సమాజంలో పెద్దల మాటలు.. ఇటు స్కూల్, కాలేజీల్లో టీచర్లు, లెక్చరర్ల మాటలు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇకా అందరూ పొద్దున్నే లేచి మతగ్రంథాలు చదవాలని, దేవుణ్ణి ధ్యానించాలని మరికొందరు భక్తులు సలహాలు ఇస్తారు. తల్లిదండ్రుల మీద మరికొందరు దుమ్మెత్తిపోస్తారు. ఉమ్మడి కుటుంబాలు మంచివని మరికొందరు తీర్మానిస్తారు. ఖాళీగా ఇళ్లల్లో కూర్చున్న రిటైర్డ్ ఎంప్లాయిస్ దొరికిందే సందు అని, తమ బాల్యం గురించి, తమ గొప్పతనం గురించి వ్యాసాలు రాస్తారు. కట్ చేస్తే.. ఈవినింగ్ ఇంకో టాపిక్. అందరూ దాని మీద పడతారు. కథ కంచికి.. మన కళ్లు రీల్స్ వైపుకి..
అసలు సమాజం ఎటుపోతుంది
ఇంత పెద్ద విషయాన్ని నార్మలైజ్ చేస్తున్నానని మీకు అనిపించొచ్చు? ఎనిమిదో తరగతి అమ్మాయి బిడ్డకు జన్మనివ్వడం మీకు తెలుసా? ముగ్గురు ఐదో తరగతి అబ్బాయిలు ఎల్కేజీ పాపపై లైంగికదాడి చేయడం మీకు తెలుసా? బైక్ కొనివ్వలేదని సొంత తల్లిని గొంతు కోసం చంపిన కొడుకు గురించి తెలుసా? అమ్మమ్మ మీద అత్యాచారానికి పాల్పడ్డ మనవడి కథ తెలుసా? బాయ్‌ఫ్రెండ్ చెప్పాడని సొంత ఇంట్లోనే దొంగతనం చేసిన అమ్మాయి గురించి విన్నారా? స్కూల్ టీచర్లందరూ కలిసి స్టూడెంట్‌ని బెదిరించి, తమ కామకోరికలు తీర్చుకోవడం తెలుసా? గుడి పక్కనే గ్యాంగ్‌రేప్ చేసి, మహిళ చేత మూత్రం తాగించిన ఘటన గురించి విన్నారా? బాయ్‌ఫ్రెండ్‌తో గడిపి, గర్భం వచ్చాక, ఏడు నెలల పాటు ఇంట్లో ఆ విషయాన్ని దాచిన యువతి కథ మీరు విన్నారు కదా? భార్యను వదిలేసి, ఇంకో మహిళతో సహజీవనం చేస్తూ, ఆ మహిళ కూతురి మీద రాత్రిపూట చేతులు వేసి తడిమే వ్యక్తి గురించి తెలుసా? సొంత చెల్లెలిని బెదిరించి, కామం తీర్చుకున్న అన్న కథ విన్నారా? స్టూడెంట్‌ని బెదిరించి హోటల్‌కి తీసుకెళ్లి తన కామం తీర్చుకున్న మహిళా టీచర్ గురించి తెలుసా? ఓ కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకొని, అతన్నే తన కూతురికి కట్టబెట్టి, ముగ్గురూ కలిసి ఉండొచ్చని కూతురికి సర్దిచెప్పిన తల్లి గురించి అవగాహన ఉందా?.
ఇవన్నీ మన చుట్టూ జరిగినవే! ప్రతిసారీ గుండెలు బాదుకోవడం, ఆ తర్వాత మామూలైపోవడం మనకు తెలిసిన విద్య. సోషల్‌మీడియా ఓపెన్ చేస్తే, డబుల్ మీనింగ్ తో ఉండే అందమైన తిట్లు, మీన్స్ బొచ్చడు షేర్ అవుతుంటాయి. పక్కింటి ఆంటీతో ఎఫైర్ పెట్టుకో అని ఎంకరేజ్ చేసే మీమ్స్, ‘అమ్మాయిలంతా పెళ్లికి ముందే మరొకరితో పడుకునే బ్యాచ్’ అని తీర్మానించే పేజెస్.. చాలానే ఉన్నాయి. ఇంకా చెప్పి లాభం లేదు. ఇవి పిల్లలు రోజూ వినీ.. చూసే కళాఖండాలు.
వీటి అంతటికి కారణం సోషల్ మీడియా
ప్రస్తుత జనరేషనన్ జెడ్ విపరీతంగా ఫోన్లు వాడుతున్నారు. చదువు పక్కన పెట్టి ఫోన్ చేతబట్టి రీల్స్ చేస్తున్నారు. వాటికి ఎన్ని లైకులు, షేర్లు, కామెంట్లు వచ్చాయో లెక్కపెట్టుకుంటూ మురిసిపోతున్నారు. ఇక తల్లిదండ్రులు కూడా మావాడు భలేగా రీల్స్ చేస్తున్నాడే అని మురిసిపోతున్నారు. దీంతో పిల్లలు మరింత రెచ్చిపోతున్నారు. దాని వల్ల వారికి అనవసర పరిచయాలు అవుతాయి. అవి కాస్త ప్రేమకు దారి తీసి అర్ధం లేని వవ్వారలు అన్నీ జరిగిపోతాయి. తీర టీనేజన్లు మోసపోయి తీవ్ర డిప్రెషన్ లోకి పోతారు. ఆ తరువాత చావే దిక్కు అని సూసైడ్ చేసుకుంటారు. ఇంకా అప్పుడు మేల్కొంటారు బాధ్యత మరిచిన తల్లిదండ్రులు అయ్యో మా అమ్మకూచి ఆగమైంది అని బోరుల విలపిస్తారు. ఇప్పటికైన పిల్లల్ని సోషల్ మీడియాకు దూరంగా ఉంచండి. వారిపై నిఘా ఉంచండి. ఫోన్ లో ఏం చేస్తున్నారో గమనించండి.
ఇవాళ సహస్ర, సౌమ్య రేపోమాపో మీ పిల్లలు. ఇక్కడ ఎవరికీ భద్రత లేదు. అందుకే పెళ్లిళ్లు, పిల్లలు, బంధాల పట్ల తర్వాతి తరం చాలా విరక్తి చెందింది. Society get what it deserves. మనం దేనివెంట పరుగులు పెట్టామో, అదే ఇప్పుడు తర్వాతి తరం ప్రాణాలు తీస్తూ ఉంది. ఆగి, అదంతా చూసే ఓపిక మనకు ఎక్కడిది? పదండి. ఈ రియాలిటీ ప్రపంచాన్ని మరిపించే రీల్స్ ప్రపంచం మన ముందే ఉందిగా, హ్యాపీగా అందులో మునిగిపోదాం. ఎవరు ఎటు పోయినా మనకు ఎందుకులే. మన దగ్గర వరకు వస్తే గాని తెలియదు.. తెలుసుకోం అంతా సోషల్ మీడియా సర్వేజన సుఖినోభవంత్.










