HEALTH & LIFESTYLE

మొలకెత్తిన గింజల్లో బోలెడు ఆరోగ్యం

బరువు తగ్గాలనుకునేవాళ్లు ఎంచుకునే ఆహార పదార్థం మొలకెత్తిన గింజలు. కానీ, కొన్ని సందర్భాల్లో మొలకలు తినడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అధిక పోషకాలు నిండిన మొలకలు తింటే శరీరానికి చాలా ప్రోటీన్ అందుతుంది. ఇందులో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్ 20-30 శాతం పెరుగుతుంది. క్యాల్షియం, ఐర‌న్‌, జింక్‌, ఫైబ‌ర్‌, ప్రోటీన్, విట‌మిన్-A, విట‌మిన్-C, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు మొల‌క‌ల ద్వారా పొందవచ్చు. శనగలు, పెసర్లు, బీన్స్, వేరుశనగలు వంటి గింజల్ని ఎక్కువగా మొలకల రూపంలో తింటారు. మొలకెత్తిన విత్తనాలు పోషక శక్తి కేంద్రాలుగా పనిచేస్తాయి. గింజలను 12 నుంచి 72గంటల పాటు నానబెట్టిన తర్వాత మొలకలు తినాలి.

గింజ మొలకలు నేరుగా తినడం కంటే 5-10 నిమిషాల పాటు ఉడికించి తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఉడికించి తింటే సులభంగా జీర్ణమవుతాయి. చిన్న పిల్లలు, వృద్ధులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వీరికి ఉడికించిన మొలకలు మంచివని నిపుణులు అంటున్నారు. మొల‌కెత్తిన గింజ‌ల్లో ఎన్నో పోష‌కాల‌తో పాటు సాల్మొనెల్లా, లిస్టెరియా, ఇ-కోలి వంటి బ్యాక్టీరియా ఉంటుంది. వీటితో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గ‌ర్భిణులు మొలకలు తింటే వాంతులు, విరేచ‌నాలు, కడుపు తిమ్మిరి వంటి స‌మ‌స్య‌ల‌ను వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

* మొలకల ఉపయోగాలు


* మొలకల్లో  ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, జీర్ణ సమస్యలు ఉత్పన్నం కాకుండా చేస్తాయి.
* స్త్రీలు నెలసరి సమస్యలను ఎదుర్కోవడానికి మొలకలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
* రక్తంలో కొలెస్ట్రాల్ ‌స్థాయిల్ని, చక్కెర స్థాయిల్ని తగ్గిస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యానికి మొలకలు సహకరిస్తాయి.
* సులభంగా జీర్ణమవుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధిక స్థాయిలో కలిగి ఉంటాయి.
* పిండి పదార్థాలను చక్కెరగా మార్చే ఏమేలెస్ ఎంజెమ్ అధిక స్థాయిలో ఉంటుంది.

Show More
Back to top button