Telugu Featured News

చారిత్రక తీర్మానం – అమరావతికి రక్షణ కవచం!

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక కీలక అధ్యాయం మొదలైంది. అమరావతిని రాష్ట్ర ఏకైక, శాశ్వత రాజధానిగా ఖరారు చేస్తూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో చారిత్రక తీర్మానం చేసింది. శనివారం దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఉత్కంఠభరిత చర్చ అనంతరం, విభజన చట్టంలో అమరావతిని అంతర్భాగం చేయాలని కేంద్రాన్ని కోరుతూ సభ ఏకగ్రీవంగా నిర్ణయించింది. భవిష్యత్తులో ఏ శక్తి కూడా రాజధానిని మార్చలేని విధంగా దీనికి గట్టి చట్టబద్ధత కల్పించడమే ఈ తీర్మానం ముఖ్య ఉద్దేశ్యం. ఇది కేవలం ఒక నగరం గురించి మాత్రమే కాదు, ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే రక్షణ కవచం.

సీఎం చంద్రబాబు ఆవేదన 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చను ప్రారంభిస్తూ గత వైసీపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. “ప్రపంచస్థాయి రాజధాని కోసం 34 వేల ఎకరాలను రైతులు నమ్మి ఇచ్చారు, కానీ జగన్ తన రాజకీయ కక్షతో ఆ భూములను స్మశానంగా మార్చారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని అనాథను చేసి, రైతులను రోడ్డున పడేసిన పాపం గత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఐదేళ్ల విధ్వంసం తర్వాత, ఇప్పుడు ఈ తీర్మానం ద్వారా అమరావతికి పూర్వ వైభవం తీసుకువస్తామని, ఏ అడ్డంకులు ఎదురైనా రాజధాని నిర్మాణం ఆగే ప్రసక్తే లేదని ధీమా వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ గర్జన

ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ చర్చలో తనదైన శైలిలో స్పందిస్తూ, “అమరావతి అనేది ఒక కులానికో, ప్రాంతానికో చెందింది కాదు.. అది ఆంధ్రుల ఆత్మగౌరవం” అని ప్రకటించారు. వైసీపీ నేతలు తప్పు ఒప్పుకునే ధైర్యం లేక సభ నుండి పారిపోయారని ఎద్దేవా చేశారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల పాలనను ‘సైకో పాలన’గా అభివర్ణించారు. అమరావతిని గ్రాఫిక్స్ అంటూ బురదజల్లి, ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. కేంద్రం నుండి నిధులు రాబట్టి అమరావతిని వెలుగుల జిలుగుల నగరంగా మారుస్తామని లోకేష్ స్పష్టం చేశారు.

Also Read: ఓటరు మహాశయా.. నీ ఫ్యూచర్‌ను ఎన్నుకో.

వైసీపీ గైర్హాజరీ  

రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక చర్చకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కూటమి నేతలు చేస్తున్న తీవ్రమైన ఆరోపణలను కనీసం తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేయకుండా సభను బహిష్కరించడం వైసీపీ వ్యూహాత్మక ఓటమిగా కనిపిస్తోంది. సభకు రాకుండా పారిపోవడం ద్వారా తాము చేసిన తప్పును అంగీకరించినట్లయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తీర్మానంతో అమరావతికి కేంద్రం నుంచి మరింత బలం చేకూరనుండటంతో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక పక్కా రోడ్ మ్యాప్ సిద్ధమైనట్లయింది.

సంబందిత వార్తలు:

 ఏపీ విద్యారంగంలో సరికొత్త చరిత్ర.. అమరావతి లో ప్రపంచ స్థాయి ఏఐ హబ్
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: అమరావతి అభివృద్ధికి వేగం
అమరావతి నిర్మాణ పనులకు లైన్ క్లియర్..

Show More
Back to top button