CINEMATelugu Cinema

కింగ్‌డమ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “కింగ్‌డమ్” సినిమా చివరికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్య పాత్రల్లో నటించగా, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. టీజర్, ట్రైలర్ ద్వారా ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా జూలై 31న గ్రాండ్‌గా విడుదలైంది. ప్రీమియర్‌ షోస్ చూసిన ప్రేక్షకులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

యూఎస్ ప్రీమియర్ నుండి పాజిటివ్ టాక్

యూఎస్ ప్రీమియర్ షోల నుండి సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. స్టార్టింగ్ నుంచే కథలో లీనమైపోయేలా సినిమా ప్రవాహం ఉందని అభిమానులు అంటున్నారు. సూరి పాత్రలో విజయ్ దేవరకొండ అద్భుతంగా ఒదిగిపోయాడు. ఎమోషన్స్, రొమాంటిక్ ట్రాక్ ఆకట్టుకున్నాయని, విజువల్స్ మరియు టెక్నికల్ కోణం పరిపూర్ణంగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రత్యేకంగా మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఫ్యాన్స్‌ను ఊహించిన దానికంటే ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయని ట్విట్టర్ లో కామెంట్స్ వస్తున్నాయి.

హైలైట్స్, మైనస్‌లు 

ఈ చిత్రంలో జైలు సీన్లు, బోట్ సీక్వెన్స్‌లు స్పెషల్ హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా స్ట్రాంగ్‌గా ఉందని అభిప్రాయం. అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ థియేటర్‌లో ఎనర్జీని పెంచిందని, విజయ్ మాస్ హీరోగా దూసుకుపోయాడని మెచ్చుకుంటున్నారు. మంచి కథ, ఎమోషన్, యాక్షన్ మధ్య బ్యాలెన్స్ బాగుందని, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కథనంపై పట్టు చూపించారని ప్రశంసలు వస్తున్నాయి.

Rating:3/5

Show More
Back to top button