Telugu Featured NewsTelugu Politics
Trending

జగన్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు.. అందుకే ఈ పొత్తులు: టీడీపీ

రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్న చర్చ చాలాకాలంగా సాగింది. అయితే, ఇటీవల బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మూడు పార్టీలే ఎన్నికలకు కలిసి వస్తాయని ప్రకటించడంతో పొత్తులపై స్పష్టత వచ్చింది. దీంతో ఈ పొత్తుల కోసమే చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న కొంతమంది నేతలు కల నెరవేరునట్లు అయింది. అయితే ఈ పొత్తుల వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటును బ్యాలెట్ బాక్స్ వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అన్ని పార్టీలు సమిష్టిగా తీసుకోవాలి. ఓట్లు బదిలీలో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వాటిని అధిగమించి పొత్తు దిశగా ఓటర్లను సన్నద్ధం చేయడం అంత తేలిక కాదు. దానికి ముందు పొత్తుల ఆవశ్యకతపై ఆయా పార్టీలు తమ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలి. అయితే ఈ పొత్తులను కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీతో పొత్తు ముస్లిం ఓట్లు చీలుతాయేమో అని సందేహం కనిపిస్తోంది విశ్లేషకులు అంటున్నారు.

‘ప్రజాస్వామ్యంలో పొత్తులు అత్యంత సహజం. ఇది ఆయా పార్టీల అంతర్గత వ్యవహారం. దీనిపై వైసీపీ ఎందుకు భయపడుతోంది? సింహం సింగిల్‌గా వస్తుందని జగన్ ఎందుకు భయపుతున్నారని‘ టీడీపీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు ఈ పొత్తుల విచ్ఛిన్నం చేయడానికి తన శక్తివంచన లేకుండా సీఎం జగన్ పని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఇలా పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రయోజనాలు కోసమే తప్ప రాజకీయ ప్రయోజనాలు కోసం కాదని టీడీపీ వెల్లడించింది. ఎందుకంటే గత ఐదేళ్లు సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడమే కాకుండా.. రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం విషయంలో, రాజధాని విషయంలో అడుగు కూడా కదపలేకపోయారు అందుకే ఇలా ఎన్నికల్లో పొత్తులతో ముందుకు పోతున్నట్లు తెలిపారు.

అయితే ‘ఈ పొత్తులు కుదరకుండా ఉండేందుకు రాష్ట్రంలో వైసీపీ తన అనుకూల బీజేపీ నాయకులను తమ వైపు తిప్పుకోవాలని చూశారు. అవి ఫలించకపోవడంతో జగనే స్వయంగా రంగంలోకి దిగి చాలాసార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. సీఎం తన స్థాయిని దిగజార్చుకుంటూ పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. మూడు పెళ్లిళ్లని, ప్యాకేజీ స్టార్ అని దుర్భాషలాడారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని, సీట్ల సంఖ్యపై, ముఖ్యమంత్రి పదవిపై అనేక రూపాల్లో ప్రచారం చేశారు. జనసేన పార్టీ వారిని, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ అవేమీ ఫలించలేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒక అవగాహనతో మిత్ర భేదాన్ని పాటిస్తున్నారు’ అని టీడీపీ నాయకులు అంటున్నారు.

Show More
Back to top button