writer

తన అభినయంతో నషాళానికి ఆంటే కషాయాన్ని కాచగల నటులు.. తనికెళ్ళ భరణి.
Telugu Cinema

తన అభినయంతో నషాళానికి ఆంటే కషాయాన్ని కాచగల నటులు.. తనికెళ్ళ భరణి.

సికింద్రాబాదు జేమ్స్ స్ట్రీట్ దగ్గర, వందమంది యువకవుల సమ్మేళనం అది. వరస క్రమంలో అతను 98వ వాడు. అతని వంతు వచ్చింది.  “కలం తప్ప దమ్మిడీ బలం…
అసలైన స్వాతంత్ర్య యోధుడు’…వినాయక్ దామోదర్ సావర్కర్!
GREAT PERSONALITIES

అసలైన స్వాతంత్ర్య యోధుడు’…వినాయక్ దామోదర్ సావర్కర్!

భారత్ కు స్వాతంత్ర్యం అందించడమే లక్ష్యంగా తన ప్రాణాల్ని సైతం ఆపదలో పెట్టి ఏళ్లకెళ్లు బంధిగానే గడిపిన మహనీయుడు. తొలుత లండన్ లో విప్లవోద్యమానికి తెర లేపి, ఆపై అండమాన్ లో దుర్భరమైన జైలు జీవితాన్ని గడిపారు. భారతీయుల్లోహిందుత్వాన్ని నేర్పి, జాతి సమైక్యతకు కార్యరూపం దాల్చారు. ఫలితంగా హిందూ మహాసభకు అధ్యక్షులయ్యారు.ఏటా విశేషంగా జరుపుకునే గణేష్, శివాజీ ఉత్సవాలను తీసుకొచ్చింది ఆయనే..ఎన్నో గ్రంథాల్ని రాసి, మనకు అందించారు.. వీటిల్లో అభ్యుదయ, వైజ్ఞానిక, శాస్త్రీయ దృక్పథాలు కీలకంగా కనిపిస్తాయి. ఆధునిక భారతీయ రాజనీతిజ్ఞులలో ఒకరైన సావర్కర్‌.. మహోన్నత ఆదర్శవాది, మానవతా వాది, హేతువాది కూడా.స్వాతంత్ర యోధునిగానే కాక చరిత్రకారునిగా, సాహితీవేత్తగా కూడా ప్రసిద్ధి పొందారు. అటువంటి వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జయంతి నేడు(మే 28న). ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో పాటు స్వాతంత్ర్యం కోసంఆయన చేసిన కృషి గురుంచి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం: బాల్యం, విద్యాభ్యాసం… 1883 మే 28న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా భాగూర్ గ్రామంలో దామోదర్ పంత్ సావర్కర్, రాధాబాయి దంపతులకు జన్మించారు వినాయక దామోదర్ సావర్కర్. అన్న గణేష్ దామోదర్ సావర్కర్, తమ్ముడు నారాయణరావు సావర్కర్. వీరిచిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. బ్రిటిష్ ఆగడాలకు భారతీయులు పడరాని పాట్లు పడుతూ జీవనం సాగిస్తున్నదీనమైన రోజులవి.ఈ పరిస్థితులను చూసి చలించిపోయిన ముగ్గురు అన్నదమ్ముళ్లు తమ కులదైవం సాక్షిగా దేశ స్వాతంత్య్రం కోసం తమప్రాణాలను సైతం అర్పించేందుకు సంసిద్ధులని ప్రమాణం చేసుకున్నారు. ఈ ఆశయ సాధన కోసం అభినవ భారత్ వంటిసంస్థల్ని స్థాపించారు. విద్యాభ్యాసం నాసిక్ లో జరుగగా, బీ.ఏ, పూణెలోని పెర్గ్యూసన్ కళాశాలలో పూర్తి చేశారు. బార్-ఎట్-లా చదువు కోసం 1906లోలండన్ వెళ్లారు. అప్పటికే సావర్కర్ కు వివాహమై, ఒక కొడుకు కూడా ఉన్నాడు. విప్లవం మొదలైంది.. తెల్లోళ్ళ గడ్దపైనే… తెల్లవాళ్ల గడ్డ అయిన లండన్ నుంచే తన విప్లవాన్ని నడిపించాలని నిర్ణయించుకున్న సావర్కర్ కు లా చదువు ఒక సాకుమాత్రమే…అక్కడి విప్లవకారులతో పరిచయాలు పెంచుకొని, వారితో కలిసి నడిచారు. న్యాయవిద్య పూర్తి చేసుకున్నప్పటికీ, పట్టా అందుకోలేదు. కారణం అప్పటి బ్రిటిష్ రాణి పట్ల సావర్కర్ కనీస విధేయతప్రదర్శించకపోవడమే… అంతేకాకుండా మరో సందర్భంలో బ్రిటిష్ ఆర్మీ అధికారిని హతమార్చిన కారణంగా వినాయక్ దామోదర్సావర్కర్ మీద, అతని కుటుంబం చర్యల మీద నిఘా పెరిగింది. ఎలాగోలా నిర్బంధించిన సావర్కర్ ను స్టీమర్ లో భారత్ కుతీసుకొస్తున్న సమయంలో, తప్పించుకునేందుకు యత్నించినా విఫలమయ్యాడు. 1910 జులై 10వ తేదిన మోరియా ఓడలో బందీగా భారత్ వస్తున్న సమయంలో ఫ్రాన్స్​లోని మార్సెల్స్ రేవు పట్నంలో ఓడ లంగరు…
Back to top button