
ప్రస్తుతం దేశంలో బీజేపీ హవా నడుస్తుంటే… ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం పవన్ హవా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో జరిగిన కొన్ని వివాదాలు కారణంగా ఈ మూడు పార్టీలు మళ్లీ కూటమిగా ఏర్పడవు అని చాలా మంది భావించారు. కానీ అనూహ్యంగా ఈ మూడు పార్టీలు పొత్తులో కీలక పాత్ర వహించాయి. ఈ మేరకు పవన్ గురించి జాతీయ మీడియాలో అనేక కథనాలు ప్రసారమయ్యాయి. రాజకీయంగా ఎలాంటి పదవులు నిర్వహించకపోయినా.. జాతీయస్థాయి నాయకునిగా గుర్తింపు పొందిన ఘనత పవన్‌కు దక్కుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ‘ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పవాడు. ‘ అనే సినిమా డైలాగ్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది.
ప్రసుత్త ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి చూస్తుంటే ఆ డైలాగ్‌కు నిదర్శనమనిపిస్తోంది. సీట్ల సర్దుబాటు సందర్భంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతాపార్టీల మధ్య విబేధాలు వస్తాయని ఫలితంగా చాలా అధికార పార్టీకి చెందిన నాయకులు, అభిమానులు భావించారు. కాని అందుకు విరుద్ధంగా సహృద్భావ వాతావరణంలో సీట్ల సర్దుబాటు జరిగింది. ఈ విషయంలో జనసేన నేత పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా సర్దుబాటులో కీలకపాత్ర ఆయన కీలక పాత్ర వహించినట్లు తెలుస్తోంది.
కాగా, ఈ ఎన్నికల్లో సీట్లు దొరకని నేతలు చాలా వరకు అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. అదే 2019 ఎన్నికల్లో అయితే సరైన అభ్యర్థులు కూడా జనసేన తరపున పోటీ చేయడానికి రాలేదు. అలాంటిది ఇప్పుడు మాత్రం సీట్లు కేటాయింపులకు ఎగసి పడుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు పవన్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారో. తన బలం ఏమిటో తన బలహీనత ఏమిటో తెలిసిన నాయకుడు. వపన్ కులనేతల ఎవరి సలహా అడగలేదు. అయినా పిలవని పేరంటానికి వెళ్లినట్టుగా ఇప్పుడు అన్ని సీట్లు కావాలి. ఇన్ని సీట్లు కావాలని సలహా చెప్పిన ఈ వృద్ధ నేతలు గత ఎన్నికలలో జనసేన పార్టీ వ్యక్తిగతంగా పోటీ చేసినప్పుడు ఈ నేతలెవ్వరూ పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయమని చెప్పలేదు. ఈ కారణం చేతనేమోగాని పవన్ రెండు చోట్ల ఓడిపోయారు.
దీంతో వృద్ధ నాయకులంతా పవన్ పార్టీ పని అయిపోయిందిలే అనుకున్నారు. కానీ ఇటువంటి ఒత్తిడులను తట్టుకొని ధైర్యంగా నిలబడటమే కాకుండా పార్టీ, పార్టీ కార్యకర్తలు, లక్షలాది మంది అభిమానులను నిలుపుకోవడమే కాకుండా నేడు రాష్ట్ర, జాతీయ రాజకీయాలలో కీలకంగా మారారు. అధికారం లేకుండా ఒక రాజకీయ పార్టీని దాదాపు 10 సంవత్సరాల పాటు నిలబెట్టడం సామాన్య విషయంకాదు. ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ ఎంత ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.