HEALTH & LIFESTYLE

ఈ లక్షణాలుంటే.. కిడ్నీలకు డేంజర్..!

న శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ వ్యవస్థ ఒకటి. మనం తినే, తాగే ఆహారంలోని అనేక మలిన పదార్థాలు శరీరంలో జరిగే కొన్ని క్రియల వల్ల అవి మూత్రపిండాలకు చేరి విసర్జింపబడతాయి. ఇంతటి ముఖ్యమైన పని నిర్వహించే కిడ్నీలు దెబ్బతింటే అనేక ఇబ్బందులు పడాలి. చాలామంది తమ మూత్రపిండాల అనారోగ్య పరిస్థితిని క్షీణదశకు చేరుకునే వరకూ గుర్తించలేరు. మూత్రపిండాల పనితీరు సరిగా జరగకపోతే రక్తంలో టాక్సిన్స్ ఇతరత్రా మలినాలు పెరుగుతాయి. అందువల్ల అలసట, బలహీనంగా మారటం, ఏకాగ్రత లేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 
నిద్రపట్టకపోవడం కూడా కిడ్నీల అనారోగ్యాన్ని సూచిస్తుంది. ఎందుకంటే కిడ్నీలు మూత్రాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయకపోవడం వల్ల టాక్సిన్స్ మూత్రం ద్వారా బయటకు వెళ్లకుండా రక్తంలోకి చేరతాయి. దీని వల్ల నిద్రరాదు. రక్తంలో సరైన మోతాదులో ప్రోటీన్స్ లేకుంటే చర్మం దురద, పొడిబారుతుంది. దీంతో కాలక్రమేణ కిడ్నీల పక్కన ఉండే ఎముకలు బలహీనమైతాయి. అది అత్యంత ప్రమాదం. ఎక్కువ సార్లు మూత్ర విసర్జన, మూత్రంలో రక్తం వస్తే, కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయనే సూచనలు. యూరిన్‌లో ఎక్కువ నురగ వస్తే, మూత్రంలో ప్రొటీన్ బయటకు వెళుతున్నట్లు. అందువల్ల కాళ్లు వాచినట్లు ఉంటాయి. మూత్రపిండాల ఫంక్షన్స్ జరగకపోవడం వల్ల శరీరంలో సోడియం నిల్వ ఉండి పాదాలు, చీలమండలు వాపు వస్తాయి. ఆకలి ఉండక పోవడం, కండరాలు తిమ్మిరిగా అనిపించడం కూడా కిడ్నీ ఫెల్యూర్‌కి సంకేతాలు.

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..

కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా చేసి గ్లాసు నీటిలో మరిగించి ప్రతిరోజూ తాగాలి.

రాత్రి మెంతులను నానబెట్టి ఉదయం తాగితే.. కిడ్నీలో రాళ్లు ఉంటే కరిగిపోతాయి.

రోజుకు కనీసం 12 గ్లాసుల నీళ్లు తప్పక తాగాలి.

కిడ్నీ ఆరోగ్యాన్ని పెంచడానికి ఆపిల్, పుట్టగొడుగులు, లావు మిర్చి, వెల్లుల్లి, స్ట్రాబెర్రీలు, ఓట్స్ సహాయపడతాయి.

జ్యూసులు రెగ్యులర్‌గా తాగాలి.

మాంసం, పోర్క్, చికెన్, మటన్, చేపలు, గుడ్లు ఎక్కువగా తింటే యూరిక్ యాసిడ్ ఎక్కువవుతుంది.

కాబట్టి వీటిని పరిమితంగానే తీసుకోండి.

Show More
Back to top button