
ప్రస్తుతం వెండి కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కిలో వెండి ధర రూ.3 లక్షలు దాటింది. దీనికి గల కారణాలు ఏంటి..? ఇప్పుడు వెండిని కొంటే లాభామేనా..? లాంటి ప్రశ్నలు ప్రజలలో కలుగుతుంది. మరి వీటికి సమాధానం ఏంటో చూద్దామా..?
వెండి ధరల పెరుగుదలకు సరఫరా కొరత, డిమాండ్ పెరగడం ఒక కారణం.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో వెండి కొనుగోలు పెరిగింది. ధర పెరగడానికి ఇది ఒక కారణంగా చెప్పవచ్చు.
ప్రపంచంలోనే వెండి ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న చైనా, ఈ లోహపు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది. దీనివల్ల కూడా వెండి ధర పెరిగింది.
బంగారం ధర పెరగడంతో చాలామంది వారి పెట్టుబడులను వెండిలోకి మార్చారు. దీంతో వెండికి డిమాండ్ పెరిగి ధర పెరిగింది.
సోలార్ ఎనర్జీ, ఎలెక్ట్రానిక్స్, ఎలెక్ట్రిక్ వెహికిల్స్ తయారిలో వెండిని వాడుతారు. దీని ధర పెరగడానికి ఇది ఒక కారణం.
గ్లోబల్ మార్కెట్‌లో జరుగుతున్న మార్పుల వల్ల చాలా దేశాలు వాటి నిల్వలను పెంచుకుంటున్నాయి. అందులో సిల్వర్ కూడా ఉంది. ఇలా ఎన్నో కారణాల వల్ల వెండి ధర బాగా పెరుగుతుంది.
> భవిష్యత్తులో కూడా వెండి ధర పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, భారీ లాభాల తర్వాత అంతే వేగంగా ధరలు తగ్గే ప్రమాదం కూడా ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.










