HEALTH & LIFESTYLE

సిగరెట్‌ అలవాటు మానేందుకు ఇవి పాటించండి.

సిగరెట్లు మనిషి ఆరోగ్యంపై ఎంతటి హానికర ప్రభావాన్ని చూపిస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సిగరెట్‌లో ఉండే నికోటిన్ అనే కెమికల్ శరీర కణజాలానికి అలవాటు పడి ఒక వ్యసనంలా మారుతుంది. అందువల్లే సిగరెట్‌కు అలవాటు పడిన కొందరు.. దాన్ని మానేయాలనుకున్నా కష్టతరమవుతుంది. ఇక సిగరెట్‌ కాల్చడం వల్ల కొన్ని కెమికల్స్ లంగ్స్‌లో పేరుకుపోయి శ్వాస నాళాలు మూసుకుపోవడంతో క్యాన్సర్, గుండె సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం పొంచి ఉంటాయి.

శరీరానికి అవసరమైన విటమిన్లు బాడీలో ఉండటం వల్ల లంగ్స్‌లో పేరుకుపోయిన కెమికల్ పదార్థాలను సమర్థవంతంగా తొలగించడానికి ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయని వైద్యులు చెబుతున్నారు.

సాధారణంగా ఒక రోజులో మనిషి శరీరానికి కనీసం 50 mg విటమిన్-C అవసరం. అదే పొగపీల్చే వ్యక్తుల్లో సుమారు 100 ml విటమిన్-C అవసరమంటున్నారు వైద్యులు.

సిగరెట్‌ పై వ్యామోహం పోవాలంటే ఎండబెట్టిన ఉసిరికాయ లేదా మామిడి కాయ ముక్కలను చప్పరించాలి. ఇలా చేయడం వల్ల అందులో ఉండే పుల్లటి ద్రవ పదార్థం పొగ పీల్చాలన్న కోరికను చంపేస్తుంది.

రాత్రి ఆరు లేదా ఏడు గంటల మధ్యలో కేవలం ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవడం శ్రేయస్సుకరమని వైద్యులు చెబుతున్నారు.

వీటితో పాటు ముఖ్యంగా రోజూ ఓ జామకాయ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఒక జామకాయలో 200మి.గ్రాముల విటమిన్ సి ఉంటుంది.

ఇది లివర్‌పై ప్రమాదాన్ని తగ్గించి శరీరానికి రక్షణగా సహాయపడుతుంది.

వీటితోపాటు డ్రైనట్స్, బనాన, రేగికాయలు వంటి ఫ్రూట్స్ తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

సిగరెట్ అనేది మండే పదార్థాన్ని కలిగి ఉన్న ఇరుకైన సిలిండర్, సాధారణంగా పొగాకు, ఇది ధూమపానం కోసం సన్నని కాగితంలో చుట్టబడుతుంది.
రాత్రి ఫ్రూట్స్ తిన్న తర్వాత మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వరకు మరే ఇతర ఆహారాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే రాత్రి డిన్నర్ నుంచి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మధ్య గ్యాప్‌లో శరీరం రీసైక్లింగ్ ప్రక్రియ మొదలు పెడుతుంది. లంగ్స్‌లో పేరుకుపోయిన నికోటిన్ కెమికల్‌ను శుద్ది చేసి బయటకు తొలగిస్తుంది.

ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల లంగ్స్ క్లీన్ అయ్యి శరీరం ఆరోగ్యవంతంగా ఉండటంతోపాటు సిగరెట్ తాగాలన్న కోరిక కూడా తగ్గుముఖం పడుతుంది.
బ్రేక్‌ఫాస్ట్ సమయంలో వెజిటుబుల్ జ్యూస్, ఈవినింగ్ టైంలో ఫ్రూట్ జ్యూస్ రోజూ ఒక గ్లాస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే మైక్రో న్యూట్రియన్స్ శరీరానికి సహాయపడతాయి.
ప్రతీ సోమవారం ఫాస్టింగ్ చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
డైలీ 15-20 నిమిషాలు ప్రాణాయామం చేయాలి. ఇలా చేస్తే.. ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫం బయటకు వెళ్లి, లంగ్స్ క్లీన్ అవుతాయి.

Show More
Back to top button