Telugu News

దగ్గర్లో ఆధార్ సెంటర్ ఎక్కడుందో కనిపెట్టే భువన్ పోర్టల్..!

ప్రతిదానికీ ఇప్పుడు ఆధార్ తప్పనిసరి అయ్యింది. అందుకే ఈ కార్డ్ ను ఎల్లప్పుడూ ఆప్డేటెడ్ గా ఉంచుకోవడం చాలా అవసరం. ఏవైనా పేరు, అడ్రస్ వివరాలు పొరపాటుగా ఉంటే కచ్చితంగా ఆధార్ సెంటర్ కి వెళ్లి కరెక్ట్ చేసుకోవాల్సిందే. చాలా సందర్భాల్లో మన సమస్యకు పరిష్కారం దొరికే సెంటర్లు ఎక్కడున్నాయో తెలుసుకోవడం ఒక్కోసారి ఇబ్బందిగా మారుతుంది. ముఖ్యంగా సిటీకి కొత్తగా వలస వచ్చినవారు.. ఒక చోటు నుంచి మరోచోటుకు మారినవారికి ఈ సెంటర్స్ కి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం కాస్త ఇబ్బందే. ఇటువంటి ఇబ్బందులన్నిటికి ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ రీతిలో ఒక పోర్టల్ ను తీసుకొచ్చారు. దాని పేరే భువన్ పోర్టల్. దీని ద్వారా అతి సులువుగా ఆధార్ కేంద్రం ఎక్కడుందో అనేది తెలుసుకోవచ్చు.

UIDAI, ఇస్రోకు అనుబంధంగా పనిచేసే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) తో కలిసి భువన్ ఆధార్ అనే పోర్టల్ ను స్టార్ట్ చేసింది. దీనిద్వారా ఆధార్ కార్డు హోల్డర్లు మూడు రకాల ప్రీమియం ఫీచర్లను పొందొచ్చు. 

తమకు దగ్గర్లో ఉన్న ఆధార్ సెంటర్లను తెలుసుకోవడంతోపాటు వాటి దగ్గరకు వెళ్లేందుకు రూట్ మ్యాప్.. ఏ పరిసరాల్లో ఉందో అనే మ్యాప్ ను కూడా ఈ పోర్టలే మనకు అందిస్తుంది.

ఆయా ఆధార్ కేంద్రాల్లో మీకవసరమైన సేవలు ఆయా కేంద్రాల్లో లభిస్తాయా? లేదా? అనేది కూడా ఫిల్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎంత దూరంలో ఆధార్ సెంటర్ కావాలో కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు.

*ఇందుకోసం ముందుగా భువన్ ఆధార్ పోర్టల్ లోకి వెళ్లాలి. 

*స్క్రీన్ కు లెఫ్ట్ సైడ్ లో మీకు నాలుగు డ్రాప్- డౌన్ ఆప్షన్లు కనిపిస్తాయి.

*దగ్గర్లోని ఆధార్ ఎన్ రోల్మెంట్ సెంటర్ తెలుసుకునేందుకు ఆప్షన్లలో  ‘సెంటర్స్ నియర్ బై’ను సెలెక్ట్ చేసుకోవాలి. వెంటనే మీకు దగ్గర్లోని  కేంద్రాలు స్క్రీన్ పై లిస్టౌట్ అవుతాయి.

*మీకు స్పెసిఫిక్ గా ఒక ఆధార్ సేవా కేంద్రం పేరు తెలిస్తే ‘సెర్చ్ బై ఆధార్ సేవా కేంద్ర’ అనే ఆప్షన్ ను కూడా యూస్ చేసుకోవచ్చు.

*పిన్ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఆధార్ సెంటర్లు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు.

*రాష్ట్రం, జిల్లా, మండలం లాంటి బేసిక్ అడ్రస్ డీటైల్స్ ను ఎంటర్ చేయడం వల్ల ఆయా రాష్ట్రాల్లోని ఆధార్ కేంద్రాల వివరాలన్నింటినీ థరోగా చూసుకోవచ్చు.

*టూల్స్ అనే సెక్షన్ పైన క్లిక్ చేసి, దగ్గర్లోని సెంటర్ కి రూట్ మ్యాప్ ను కూడా అవగాహన కోసం చూడొచ్చు.

Show More
Back to top button