Telugu News

ప్రతి నెల రూ.3 వేల పెన్షన్..!

వయస్సు పైబడ్డాక సంపాదించడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ఆ సమయంలో పెన్షన్ లభిస్తే.. ఆ డబ్బు వారికి కాస్త ఆసరాని అందిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికుల కోసం ప్రత్యేకంగా పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. కార్మికులకు వృద్ధాప్య రక్షణ కల్పించేందుకు ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ (PM-SYM) అనే పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది.

ప్రయోజనం ఎలా? ఈ పథకం ద్వారా కార్మికులు 60 ఏళ్లు నిండాక.. నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ పొందుతారు. అందుకోసం కార్మికులు 60 ఏళ్లు నిండే దాకా ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేయాల్సి ఉంటుంది. కార్మికులు చేసిన కాంట్రిబ్యూషన క్కు సమానంగా ప్రభుత్వం కూడా విధులను అందిస్తుంది. ఉదాహరణకు ఒక కార్మికుడు నెలకు రూ.200 చెల్లిస్తే, ప్రభుత్వం కూడా అదనంగా రూ.200 జమ చేస్తుంది.

అర్హతలు

* వ్యవసాయ, భవన నిర్మాణ, బీడీ, చేనేత, తోలు, ఆడియో-విజువల్, వీధి వ్యాపారులు వంటి అసంఘటిత కార్మికులు ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు. నెలవారీ ఆదాయం రూ.15 వేల కన్నా తక్కువగా ఉండాలి. 18 నుంచి 40 ఏళ్ల వరకు ఎప్పుడైనా ఈ పథకంలో చేరవచ్చు. NPS, ESIC స్కీమ్స్ (లేదా) ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) వంటి ఇతర పెన్షన్ పథకాల లబ్దిదారులై ఉండకూడదు.

అప్లై చేసే విధానం

అర్హత ఉన్న చందాదారులు సమీపంలోని కామన్ సర్వీస్ సెంట 8(CSC)కు వెళ్లి ఈ పథకం కింద నమోదు చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా 3 లక్షలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. అందులో ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పెన్షన్ పథకాన్ని ప్రారంభించేందుకు పొదుపు బ్యాంకు ఖాతా/ జన్ ధన్ ఖాతా, ఆధార్ కార్డ్లు ఉండాలి. CSCలో వాటితో పాటు నామినీ వివరాలు సమ ర్పించాలి. సమాచారం వెరిఫై చేసిన తర్వాత, మీ అకౌంట్ ఓపెన్ చేసి, శ్రమ యోగి కార్డ్ అందిస్తారు. మరింత సమాచారం కోసం మాన్ ధన్ యోజన అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. లేదంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 2676888కి కాల్ చేయవచ్చు.

Show More
Back to top button