CINEMATelugu Cinema

‘విశ్వం’ మూవీ రివ్యూ

శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా, కావ్య థాపర్ హీరోయిన్‌గా విశ్వం సినిమా ఈరోజే(అక్టోబర్-11) థియేటర్‌లో విడుదలైంది. గోపీచంద్‌, దర్శకుడు శ్రీను వైట్ల.. ఈ ఇద్దరూ కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఇద్దరూ కలిసి విజయమే లక్ష్యంగా ‘విశ్వం’తో విజయదశమి బరిలో నిలిచారు. మరి ఈ మూవీ థియేటర్లలో సినీప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది? చూద్దాం.

కథ..

టెర్రర్టిస్ట్ అయిన జలాలుద్దీన్ ముహమ్మద్ ఇండియాలో అజయ్ శర్మగా సెటిల్ అయ్యి.. వరుస బాంబ్ బ్లాస్ట్‌లకు ప్లాన్ చేస్తాడు. ఆ ప్రయత్నంలో హైదరాబాదులో కేంద్రమంత్రి(సుమన్) కొందరు చంపేస్తారు. అయితే ఆ హత్యను చూసిన ఓ చిన్నారిని చంపేందుకు హంతకులు వెంబడిస్తూ ఉంటారు. ఆ చిన్నారికి పరిచయస్తుడైన గోపిరెడ్డి (గోపీచంద్) ఆమెను చాలాసార్లు ప్రమాదం నుంచి కాపాడుతాడు. అయితే అసలు గోపిరెడ్డి వచ్చింది తాను ఇష్టపడిన సమైరా(కావ్య థాపర్)ను కలవడానికి. గతంలో ఇటలీలో పరిచయమైన సమైరాకు దూరమైన గోపిరెడ్డి మళ్లీ ఆమెను కలుస్తాడా? అసలు గోపిరెడ్డి ఎవరు? ఎందుకు చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తాడు? అసలు గోపిరెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? విశ్వం గోపి రెడ్డిగా ఎందుకు చిన్నారి కుటుంబం ముందుకు వచ్చాడు? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..

సినిమాలో ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ లో ట్రైన్ సీన్స్ లో కామెడీ బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. కామెడీ బాగా పండి ప్రేక్షకులని నవ్వించినా మిగతా కథ అంతా టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో రొటీన్ గానే సాగుతుంది. పాప ఎమోషన్ ఫ్యామిలీలకు బాగా కనెక్ట్ అవుతాది. గోపీచంద్ ఎప్పటిలాగే తన బెస్ట్ ఇచ్చారు. కాగా, గ్రాఫిక్స్ వర్క్ చాలా పూర్ కనిపిస్తుంది.

రేటింట్: 2.5/5

Show More
Back to top button