Telugu News

నేటి నుంచి యూపీఐలో వచ్చే మార్పులు ఇవే!

ఈ నెలలో ఫైనాన్షియల్ గా కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఫాస్టాగ్ వార్షిక పాస్, యూపీఐ లావాదేవీలు, ఎస్బీఐ క్రెడిట్ కార్డు రూల్స్, ఆర్బీఐ మానిటరీ పాలసీ భేటీ లాంటివి మారనున్నాయి. అలానే బ్యాంకులకు కూడా 10రోజులు సెలవులు రానున్నాయి. పూర్తి వివరాలివిగో…

ఆగస్టు 1 నుంచి యూపీఐ బ్యాలెన్స్ ఎంక్వైరీ రోజులో మాక్సిమం 50సార్లు మాత్రమే అలో చేస్తారు. అయితే ఒక్కో యాప్ 50సార్ల చొప్పున వాడుకునే వీలుంది. అలాగే ఆటో పే ట్రాన్సాక్షన్స్‌ పీక్ అవర్స్ అయిన (ఉదయం 10, మధ్యాహ్నం 1, సాయంత్రం 5 నుంచి రాత్రి 9.30 మధ్య) చేసేందుకు  వీల్లేదు. ఏదైనా సరే ఉదయం 10లోపు లేదంటే సాయంత్రం 9:30 తర్వాతనే చేయాలి. ట్రాన్సాక్షన్ స్టేటస్ చెకింగ్‌ రోజులో మూడుసార్లకు మించి అనుమతి లేదు. పైగా ఒక్కో స్టేటస్ చెకింగ్‌ కనీసం 90సెకన్ల వ్యవధితో ఆగాలి. అయినప్పటికీ ఇవేవీ యూజర్స్‌పై పెద్దగా ఎఫెక్ట్‌ చూపకపోవచ్చు.

ఎస్‌బీఐ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్రయోజనాన్ని ఆగస్టు 11 నుంచి తొలగించనున్నట్లు కార్డు తెలిపింది. ఎలైట్, ప్రీమియం, ప్లాటినమ్ లాంటివి  వాడుతున్నవారిపై ఈ ఎఫెక్ట్‌ పడుతుంది. 

ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఆగస్టు 1 నుంచి 6 తేదీల్లో భేటీ కానుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు100 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటులో కోత విధించిన రిజర్వ్ బ్యాంక్ తాజాగా మరోసారి రేట్లు తగ్గిస్తే రుణాలు తీసుకున్నవారికి భారీ ఊరట కలగనుంది. 

ఆగస్టు నెలలో బ్యాంకులకు భారీగానే సెలవులు రానున్నాయి. ఈ నెలలో ఐదు ఆదివారాలు వస్తున్నాయి. పైగా 2, 4 శనివారాలు ఎలానూ బ్యాంకులకు హాలిడే. ఇవి కాకుండా స్వాతంత్ర్య దినోత్సవం (15), జన్మాష్టమి (16), వినాయక చవితి (27) సందర్భంగా మరో మూడురోజులు సెలవులు రానున్నాయి. అంటే ఆగస్టు నెలలో మొత్తంగా 10 రోజులు సెలవులు రానున్నాయి. 

ఆగస్టు 15 నుంచి ప్రైవేటు వాహనదారులకు ఫాస్టాగ్ ఇయర్లీ పాస్ అందుబాటులోకి రానుంది. రూ.3 వేలు కడితే ఏడాదిలో 200 ట్రిప్‌ల వరకు ఇది ఈ పాస్‌ చెల్లుతుంది. అంటే ఒక్కో టోల్ బూత్ వద్ద ఖర్చయ్యేది సగటున రూ.15 మాత్రమే అవుతుందన్నమాట.

Show More
Back to top button