
అధిక తేమ కారణంగా వర్షాకాలంలో కూరగాయలు, పండ్లు లేదా నిల్వ చేసిన ఆహారాల్లో పారాసైట్ లు పెరిగే అవకాశముంది. ముఖ్యంగా, ఈ సీజన్లో కొన్ని రకాల పదార్థాలను పూర్తిగా మానేయడం ఉత్తమం. లేకపోతే కీళ్ల నొప్పులు, జీర్ణాశయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదముంది. కొన్ని సందర్భాల్లో ఇంటర్నల్ ఆర్గాన్స్, బ్రెయిన్ హెల్త్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
సాయంత్రం వేళల్లో వేడి వేడిగా తినాలనిపించే స్ట్రీట్ ఫుడ్ వల్ల టెంపరరీ హ్యాపీనెస్ కలగొచ్చు. కానీ, వర్షం పడుతున్నప్పుడు వీధి ఆహారం తినకుండా ఉండటమే మంచిది. అపరిశుభ్రమైన పరిసరాల వల్ల, వారు చేసే ఫుడ్ కలుషితమయ్యేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాంటి భోజనం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది.
ఆకుకూరలు సాధారణంగా ఆరోగ్యానికి మంచివే. కానీ వర్షాకాలంలో వాటిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వర్షపు నీటి వల్ల వీటిపై కాలుష్య కారకాలు, మలినాలు ఎక్కువగా చేరవచ్చు. ఇలాంటి ఆకుకూరలను అజాగ్రత్తగా తింటే ఇన్ఫెక్షన్లు, జీర్ణ సమస్యలు రావచ్చు. ముఖ్యంగా, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, వంకాయ, సొరకాయ, బెండకాయ, పుట్టగొడుగుల విషయంలో కేర్ఫుల్గా ఉండండి.
ఫ్రై ఫుడ్స్ వర్షాకాలంలో వేడి వేడి పకోడీలు, సమోసాలు వంటివి ఎక్కువగా తినాలనిపిస్తుంది. అయితే, నూనెలో వేయించిన ఈ ఆహారాలు అంత ఈజీగా జీర్ణం కావు. అధిక నూనెను అబ్బర్వ్ చేసుకునే ఈ పదార్థాలు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది.
సీఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిది. ఈ సీజన్ లో కాలుష్యం కారణంగా నీళ్లలో జీవించే జీవులకు ప్రమాదకరమైన క్రిములు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారాలు మీ గట్ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.
కట్ ఫ్రూట్స్ వర్షాకాలంలో ముందుగా కోసిన పండ్లు, పాశ్చరైజ్ చేయని పండ్లరసాలను పూర్తిగా మానేయాలి. ఈ ఆహారాలను నిల్వ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ చేరే ప్రమాదముంది. బదులుగా తాజాగా ఉన్న పండ్లనే తినాలి.
వర్షాకాలంలో పాలు, జున్ను, పెరుగు వంటి పాల ప్రొడక్ట్లను జాగ్రత్తగా తీసుకోవాలి. గాలిలో తేమ బ్యాక్టీరియా పెంచుతుంది. ఇది పాల ఉత్పత్తులు చెడిపోవడానికి కారణమవుతుంది. అలానే గడువు తేదీలకు ముందే తినేలా జాగ్రత్త వహించడం ముఖ్యం.










