
ఆగస్టు 15న అలస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల మధ్య మూడు గంటలకు పైగా చర్చలు జరిగాయి. ఈ భేటీలో ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ లేదా యుద్ధ విరమణకు సంబంధించిన ఒక నిర్దిష్ట ఒప్పందానికి రాలేకపోయారు. ఈ చర్చల్లో ఎలాంటి ఒప్పందమూ జరగలేదని ట్రంప్ చెప్పగా, దీర్ఘకాలిక శాంతి కోసం ఇద్దరు నాయకులు ఒక అభిప్రాయానికి రాలేదని పుతిన్ అన్నారు. అయినప్పటికీ, ఇద్దరు నాయకులు చర్చలపై అనుకూల అభిప్రాయాలనే వ్యక్తపరిచారు. భేటీ తర్వాత ట్రంప్ మాట్లాడుతూ, సమీప భవిష్యత్తులో పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశమయ్యే అవకాశాలున్నాయని చెప్పారు.
శాంతి ప్రయత్నాలు, వాణిజ్య సంబంధాలు
పుతిన్ మాట్లాడుతూ, నేటి చర్చలు ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించడానికే కాకుండా, రష్యా-అమెరికా మధ్య వర్తక వాణిజ్యాలు వంటి ఆచరణాత్మక సంబంధాలను పునరుద్ధరించడానికి కూడా ఒక ప్రారంభ బిందువుగా మారతాయని ఆశిస్తున్నామని అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన మరుసటి రోజునే ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపుతామని ట్రంప్ ప్రకటించినా, ఎనిమిది నెలలు గడిచినా యుద్ధం ఇంకా తీవ్రంగానే కొనసాగుతోంది. రష్యా సేనలు కీవ్ దిశగా, ఉక్రెయిన్ తూర్పు భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి.
నిజమైన ప్రాణ నష్టంపై చర్చ
ఉక్రెయిన్‌లో జరిగిన మరణాల సంఖ్యపై అమెరికా-యూరోపియన్ దేశాలు సరైన సమాచారాన్ని బయటపెట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. గతంలో జెలెన్స్కీ 31 వేల మంది మాత్రమే మరణించారని అబద్ధపు ప్రకటన చేశారని, కానీ వాస్తవానికి మరణాలు చాలా ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. వాషింగ్టన్ విశ్లేషకులు మాక్తే గర్ వంటి వారు మరణాల సంఖ్య 18 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. ప్రస్తుత యుద్ధంలో ఉక్రెయిన్‌లో పోరాడగల సామర్థ్యం ఉన్న సైనికుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. రష్యా ఇప్పటికే ఉక్రెయిన్‌లో రష్యన్ మాట్లాడే డోనెట్స్, లూహాన్స్, జపోరిజ్జియా వంటి ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది.
యూరోపియన్ యూనియన్ దేశాల వైఖరి
రష్యా, ఉక్రెయిన్ ప్రపంచ శాంతి కోసం యుద్ధాన్ని విరమించాల్సిన అవసరం ఉంది. కానీ యూరోపియన్ యూనియన్ దేశాలకు యుద్ధాన్ని విరమించే ఆలోచన లేదు. కీలుబొమ్మలా మారిన జెలెన్స్కీ, ఈయూ దేశాలకు తలొగ్గుతున్నాడు. పశ్చిమ ఉక్రెయిన్‌లో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలకు అనువైన ఒక ప్రభుత్వం ఏర్పడాలనేది వారి ఆలోచన. ఉక్రెయిన్‌లో బలమైన సైన్యం ఉండడానికి, లేదా నాటో సభ్యత్వం పొందడానికి రష్యా పూర్తిగా వ్యతిరేకిస్తోంది. నాటో సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తూనే రష్యా యుద్ధానికి దిగింది. కాబట్టి ఇప్పుడు నాటో సభ్యత్వాన్ని రష్యా ఏ పరిస్థితుల్లోనూ అంగీకరించదు. ఈ విషయంలో ట్రంప్ కొంత మెతక వైఖరితో ఉన్నా, యూరోపియన్ దేశాలు మాత్రం సిద్ధంగా లేవు.
మరోవైపు, ఉక్రెయిన్ ఖనిజ సంపదపై ట్రంప్‌తో పాటు ఈయూ దేశాలు కన్నేశాయి. యుద్ధాన్ని కొనసాగించడం ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచి, ఆ తర్వాత రష్యాను విడగొట్టి, ఉక్రెయిన్‌లోని అపారమైన ఖనిజ సంపదను సొంతం చేసుకోవాలని వారు ఆలోచిస్తున్నారు. ఈ వ్యూహం ద్వారా సంక్షోభంలో ఉన్న యూరోపియన్ దేశాల పెట్టుబడిదారులకు మరియు పరిశ్రమలకు తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుందని వారి నమ్మకం.
రష్యన్ పార్లమెంటు డిప్యూటీ, లెఫ్టినెంట్ జనరల్ విక్టర్ పోట్రేస్ మాట్లాడుతూ, “ట్రంప్-పుతిన్ చర్చలు ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధాన్ని ముగించవని” అన్నారు. ఆయన చెర్నిహిన్, సుమీ, ఖార్విన్, ద్నిప్రోపెట్రోన్స్, మైకోలోవ్, ఒబ్లాస్ట్లను విలీనం చేయవలసిన ప్రాంతాల జాబితాలో చేర్చాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌పై ఇంకా పెద్ద ఎత్తున దాడికి ప్రణాళికలు ఉంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఉండవచ్చని ఆయన హెచ్చరించారు. అప్పుడు నాటో పశ్చిమ ఉక్రెయిన్ను ఆక్రమించినా ఆశ్చర్యపోనవసరం లేదు. దానివల్ల రష్యా నాటో దేశాలతో ప్రత్యక్ష యుద్ధానికి దిగాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.










