స్టోయిసిజం అంటే ఏమిటి: సంతోషాన్ని మాత్రమే కాదు, బాధను కూడా అంగీకరించే జీవన తత్వం
సంతోషాన్ని మాత్రమే కాదు, బాధను కూడా ఊహించగలగాలి.. స్టోయిసిజం. అనేది ప్రతీ ఒక్కరి జీవితానికి దీర్ఘకాలిక శ్రేయస్సు. మనశ్శాంతి అనేది కూడా ప్రతీ ఒక్కరి జీవితాలతో సంతృప్తి యొక్క భావన. ఎవ్వరైనా నిరంతరం సంతోషాన్నే కోరుకుంటారు. సంతోషం అనేది తక్కువ సమయం ఉన్నా కూడా అది ఎప్పటికీ అలాగే ఉండిపోవాలని మనం కోరుకుంటూ ఉంటాము. కానీ సంతోషమే కాదు, బాధ కూడా ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమే. సంతోషం కలిగినప్పుడు విపరీతంగా ఆనందించే మనమే, బాధ కలిగినప్పుడు మాత్రం విచారంగా కనిపిస్తాం, నిరాశకు లోనవుతాం, ఒక విధమైన ఒత్తిడికి, భావోద్వేగానికి లోనవుతాం.
స్టోయిసిజం అంటే ఏమిటి మరియు దాని భావం…
అయితే సంతోషం కలిగినప్పుడు ఎలాగైతే ఆనందాన్ని ఆస్వాదిస్తామో, బాధను కూడా ఆస్వాదించాలని చెబుతుంది స్టోయిసిజం. ఇది కష్ట సుఖాలు, లాభ నష్టాలు, మరియు ఆనంద దుఃఖాలను సమదృష్టితో, నిశ్చింతభావంతో స్వీకరించే ప్రాచీన గ్రీకు తత్వశాస్త్రం. భావోద్వేగాలను నియంత్రించుకుంటూ, ఆత్మనిగ్రహం మరియు వివేకంతో జీవించాలని స్టోయిసిజం బోధిస్తుంది. ఈ తత్వశాస్త్రం మన నియంత్రణలో లేని విషయాల గురించి ఆందోళన పడకుండా, మన చేతుల్లో ఉన్న పనులపై దృష్టి పెట్టడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు అని చెబుతుంది.
తర్కం అనేది ఒక వ్యక్తికి వాస్తవాన్ని గ్రహించడానికి, ఆచరణాత్మక విషయాల గురించి సమర్థవంతంగా ఆలోచించడానికి, గందరగోళ సందర్భంలో కూడా తన వాదనపై నిలబడటానికి, నిశ్చితమైన దానికీ, సంభవనీయమైన దానికీ మధ్య తేడాను గుర్తించడానికి మొదలైన వాటికి సహాయపడుతుంది. అలాంటి తర్కాలలో ఒకటైన స్టోయిసిజం. ఒక వ్యక్తి సద్గుణ జీవితాన్ని గడపకుండా అడ్డుపడే పరిస్థితులలో అంటే ఉదాహరణకు తీవ్రమైన నొప్పి లేదా వ్యాధి బారిన పడినప్పుడు, వివేకవంతులైన వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవచ్చని స్టోయిక్‌లు భావించారు. వారు సంతోషం కలిగినప్పుడు మాత్రమే కాదు బాధ కలిగినప్పుడు కూడా మనోధైర్యం కలిగి ఉండాలంటారు. అందుకోసం ప్రతికూల దృశ్యమానత కలిగి ఉండాలని చెబుతారు. తండ్రి, తల్లి, ప్రియుడు లేదా ప్రియురాలు మరణించినప్పుడు కూడా గుండె నిబ్బరం కలిగి ఉండాలంటే, ముందే వారు చనిపోయినట్టు ఊహించి చూడమని చెప్పారు స్టోయిసిజంలో. తద్వారా అలాంటి పరిస్థితులను తట్టుకొని నిలబడగలుగుతాడు అని స్టోయిసిజం చెబుతుంది. అందుకు మూడు కారణాలతో వివరించి చెప్పాడు.
అసలైన సత్యం “బాధ”…
అనూహ్య సంఘటనలు జరిగినప్పుడు గానీ, ఆకస్మిక నష్టాలు జరిగే ఘటనలను మనం ఎదుర్కొన్నప్పుడు గానీ మనం మానసికంగా ఉద్వేగానికి లోనవుతాం, లేనిపోని భయాందోళనకు గురైపోతుంటాం. ఉన్నట్టుండి అకస్మాత్తుగా నాన్న చనిపోతే, ఇంకోరోజు అమ్మ మరణిస్తే, ఎంతో ఇష్టమైన భాగస్వామి మంటల్లో కాలిపోయి బూడిదైపోతే, అనుకోకుండా ఉద్యోగం ఉడిపోయి రోడ్డున పడాల్సి వస్తే, ఘోర ప్రమాదం జరిగిపోయి వెన్నెముక విరిగిపోతే, పక్కటెముకలు విరిగిపోయి మంచానికే పరిమితం కావాల్సి వస్తే, అలాంటి పరిస్థితులలో మనం ఏం చేస్తాము? మన అదృష్టం ఇంతేనని అలాగే ఊరుకుంటామా? మళ్లీ తిరిగి నిలబడతామా? లేక ఎప్పుడో ఏదో జరగబోయే దాని గురించి ఇప్పుడెందుకు ప్రతికూలంగా, చెడుగా ఆలోచించాలి అని అనుకుంటామా? నిజం చెప్పాలంటే ఇలాంటి భయంకరమైన ఆలోచనలను మనం భరించలేము.
ఇలాంటి వాటికి దరిద్రం, అపచారం అనే పేర్లు కూడా పెడతారు. నిజానికి మనిషి అనేవాడు ఒక రకమైన వింత జీవి. తాను ఆనందాన్ని కోరుకుంటాడు, కానీ బాధను దూరం పెడతాడు. కానీ మనిషికి తెలియని అసలైన విషయం ఏమిటంటే బాధనే అసలైన సత్యం. ప్రముఖ రచయిత ఆస్కార్ వైల్డ్ చెప్పినట్టు బాధ అనేది సంతోషం లాగా ఎటువంటి ముసుగు వేసుకుని తిరగదు. ఎందుకు అంటే ఈ భూమిపై బాధకు వణకని ప్రాణి లేదు. కానీ మనిషి చెడు గురించి, బాధ గురించి ఆలోచించడమే తప్పు అంటున్నాడు. కానీ స్టోయిసిజం (ప్రాచీన గ్రీకు తత్వశాస్త్రం) బాధను సాధన చేయమంటుంది, దురదృష్టాన్ని అలవాటు చేసుకోమని అనుసరించమని చెబుతుంది. దురదృష్టం గురించి ఆలోచించడం వలన, విపత్తు గురించి ముందే తలుచుకోవడం వలన నీ జీవితం మెరుగు అవుతుంది అని చెబుతుంది. మొదట ఇది హేతువిరుద్దంగా, అహేతుకంగా అనిపిస్తుంది గానీ తరువాత ముందుకెళ్తే ఇది ఒక మానసిక ఆయుధంగా పనిచేస్తుంది.
స్టోయిసిస్ చెప్పిన మూడు కారణాలు…
నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో దురదృష్టం నుండి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. అనుకోకుండా ఒకరోజు నీకు రోగం వస్తుంది. మరొక రోజు నిన్ను ప్రేమించిన వ్యక్తి దూరం అవుతారు. ఇంకోరోజు అసలు నీవే ఈ లోకం నుండి నిష్క్రమిస్తావు. అసలు ఈ నిజం నుండి తప్పించుకోవడానికి విందు వినోదాలను, పరధ్యానాన్ని, ఉపయోగిస్తాం, అలాంటి వాటిని నిరాకరిస్తాము. కానీ స్టోయిసిజం (ప్రాచీన గ్రీకు, రోమన్ తత్వశాస్త్రం) అలా చేయలేదు. ఆయన నేరుగా నిజం వైపు మాత్రమే చూశాడు. నీ నియంత్రణలో ఉన్నదానిపై దృష్టి కేంద్రీకరించమని, నీ నియంత్రణలో లేనదాన్ని సాదరంగా స్వీకరించు అని పదే పదే చెప్పాడు. వినడానికి ఇది ఒక సాధారణ వాక్యంలా అనిపించొచ్చు. కానీ ఇది ప్రస్తుతం నడుస్తున్న యావత్తు జీవన గమన వ్యవస్థ.
మనం ఎందుకు బాధపడడం, మనం దురదృష్టం గురించి ఎందుకు ఆలోచించడం అనే విషయానికి వస్తే స్టోయిసిస్ మూడు కారణాలు చెప్పాడు. అందులో మొదటిది సంసిద్ధం. నీవు అధ్వాన్నమైన పరిస్థితులను ఊహించుకుంటే నీ మస్తిష్కము అస్సలే బలహీనం అవ్వదు, పైగా అది బలంగా తయారవుతుంది. ఉదాహరణకు నీవు బయటకు వెళ్లేటప్పుడు తలుపుకు తాళం వేస్తావు. ఎందుకంటే నీవు ఇదివరకే దొంగల గురించి ఆలోచించావు కాబట్టి. నీవు అలా ఆలోచించడం వలన నీ ఇంటి తలుపులు వలన నీ ఇల్లు దొంగల బెడద లేకుండా బలంగా అయ్యింది. ఒక వ్యక్తి తన రోగం గురించి ఆలోచిస్తే అతను ఆరోగ్య సంరక్షణ తీసుకుంటాడు. అంటే ఊహాగానము అనేది నివారణగా పనిచేస్తుంది.
ప్రభావం తగ్గించడం…
స్టోయిసిస్ చెప్పిన కారణాలలో రెండవది ప్రభావం తగ్గించడం. మనిషి ఎక్కువగా బాధ గురించి ప్రతికూల అనుభూతి చెందుతూ భయంతో బాధపడతాడు. ఆ భయం బాధ వలన వచ్చినది కాదు. మనిషి తాను ఊహించని విషయాలకు ముందస్తుగా సన్నాహం లేకపోవడం వల్ల తన జీవితం పరిపూర్ణంగా, సమగ్రంగా ఉంటుందని నమ్ముతూ ఉంటాడు. అలా నమ్ముతూ పోతే తన జీవితంలో చిన్న నష్టం వచ్చినా అది తనకు భరించలేని నొప్పి అవుతుంది. కానీ స్టోయిసిజం ఏమని చెబుతుంది అంటే నష్టం అనేది సహజమైనది అని నువ్వు అంగీకరిస్తే నొప్పి తీవ్రత తనంతటగా తానే తగ్గిపోతుంది.
ఇది నీ బుద్ధి మందగించడం కాదు, నీ బుద్ధికి పదును పెట్టడం అనవచ్చు. మనిషి సంతోషంగా ఉండకపోవడానికి పెద్ద కారణం ఏమిటంటే, తాను ఎప్పుడూ తన విషయాల పట్ల ఎప్పటికీ తృప్తిపడకపోవడం. తాను సంతోషంగా, సంతృప్తిగా ఎప్పుడూ అనుభూతి చెందడు. అదే తన బాధకు కారణం. తాను ఒక ఫోన్ కొంటాడు, కొన్ని రోజులకు ఆ ఫోన్ పైన ఆసక్తి తగ్గిపోతుంది. తాను ఒక అమ్మాయితో ప్రేమలో రిలేషన్ ఉంటాడు, ఆ తరువాత ఆమెపైనా ఆసక్తి తగ్గుతుంది. దానినే మనస్తత్వశాస్త్రంలో సంతోష అనుకూలత (హెడోనిక్ అడాప్టేషన్) అంటారు. నీవు ఏది పొందినా కూడా చివరికి అది మాములు అయిపోతుంది. మరి మాములు అనే భావన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ప్రతికూల దృశ్యమానత…
స్టోయిసిజం ఒక ఉపాయం చెప్పింది. ఆ ఉపాయం ఏమిటంటే నీ దగ్గర ఉన్న దానిని కోల్పోయినట్టు ఊహించు, అప్పుడు అనుకోకుండా నీ జీవితంలో ఇప్పటికే ఉన్న వాటి విలువ నీకు తెలుస్తుంది. ఉదాహరణకు నీకు అనవసరంగా తిండి పెట్టే నీ నాన్న, నీకు అడగకుండానే డబ్బులు ఇచ్చే నీ అమ్మ, నీ యొక్క కామ, కాలకృత్యాలు తీర్చే నీ ప్రియురాలు, వీరిలో ఎవరైనా ఆకస్మికంగా చనిపోయారని ఉహించి చూడు. ఆకస్మికంగా వారు వెలకట్టలేనివారు అవుతారు. అంటే ఇక్కడ స్టోయిసిజం గొప్పతనం ఏమిటంటే? అది కేవలం తత్వము చెప్పి ఊరుకోలేదు, సాధన కూడా ఇచ్చింది. ఆ సాధన పేరు ప్రతికూల దృశ్యమానత. ఇందులో కొన్ని కదలికలను తీసుకుని ఇలా ఉహించేయ్. నీ శరీరం పనిచేయడం ఆపేస్తుంది. భోజనం చేసుకోవడానికి నీ కుడి చేయి, మలం కడుక్కోవడానికి నీ ఎడమ చేయి లేదనుకుంటే, అంటే ప్రతికూల దృశ్యమానత గనుక చేస్తే వాటి విలువ నీకు తెలుస్తుంది.
ఎందుకంటే ఒక మనిషిని అభినందించేది తన దగ్గర ఉన్నయి కోల్పోయిన తర్వాతనే. నిజానికి ఈ ప్రతికూల దృశ్యమానత అనేది నిరాశ కోసం కాదు, మేల్కొలుపు కోసం, అదేవిధంగా నిజమైన అర్థం కోసం. ఈ సూత్రాన్ని స్టోయిసిస్ కృత్రిమంగా ప్రేరేపింపజేశాడు. ఇక్కడ విస్తరణ ప్రక్రియ ఉంది. దానికి మెమొంట్ మారి తన ఉద్ధేశం చెప్పారు. నీవు ఎప్పుడైనా చనిపోతావని గుర్తుంచుకో, నీ భయం గురించి కాదు, నీ జీవితంలో స్పష్టత గురించి. ఈరోజు నీ చివరి రోజు అని నీవు అవగాహన చేసుకొంటే గనుక నీ జీవితాన్ని ఎలా జీవిస్తావు? సమయాన్ని వృథా చేస్తావా? నకిలీ సంబంధాన్ని కొనసాగిస్తావా? ఫోన్ లో రీల్స్ భ్రమణం చేస్తావా? వాటిని మీ మిత్రులకు ఫోన్ ద్వారా పంపిస్తావా? లేదా నీకున్న ప్రతీ క్షణాన్ని నీవు ఆస్వాదిస్తావా? స్టోయిసిజం చెప్పేదేమిటంటే! చావు గురించి నీవు ఆలోచించడం వలన నీవు ఏకాంతవాసి అవ్వలేవు. అదే సమయంలో నీవు జ్ఞానవంతుడివి అవుతావు.
సమస్యలే లేకపోతే బలహీనం అవుతావు..
ఇంకా స్టోయిసిజం ఏమి చెబుతోందంటే ప్రతీరోజూ మంచం మీద ఫోన్ లో రీల్స్ చూస్తూ, అదే మంచం మీద తిండి తింటూ, అదే మంచం మీద ఉండే నీ గదిలోకి ఒక చిరుత పులి వస్తే, ఎంత అప్రమత్తంగా, ఎంత మేల్కొలుపుగా ఉంటావో, ఖచ్చితంగా మెమెంటో మారీలో కూడా అలానే ఉంటావు. అయితే చాలామందికి ఇక్కడ ఒక మిస్ అండర్స్టాండింగ్ ఉంటుంది స్టోయిసిసం ను నిరాశావాదం అంటారు. స్టోయిస్ట్ లు నిరాశావాదులు కారు. వాళ్లు ఎక్కువ అనుభవం గల ఆశావాదులు. ఎందుకంటే వాళ్లు దరిద్రాన్ని ఊహించేసి కూడా వర్తమానాన్ని అభినందించడం చేయగలుగుతారు. వాళ్ళు ఎప్పుడూ బాధపడరు. వాళ్ళు అప్పుడప్పుడు దృశ్యమానం చేస్తారు. దృశ్యమానం అనేది వివేకంగల అభ్యాసము.
బాధ అనేది మానసిక వేదన. స్టోయిసిజం చెప్పే చివరి మాట ఏమిటంటే నిజమైన దరిద్రం అనేది సమస్యలు రావడం కాదు, ఏ సమస్యలు లేకపోవడం. అవును ఇది నిజంగా నిజం. సమస్యలే లేకపోతే నీవు బలహీనం అవుతావు. దానివలన నీవు సోమరి అవుతావు. నీవు జీవితం పట్ల కృతజ్ఞతతో ఉండవు. సెనేక ఒక మాట చెప్పాడు. దురదృష్టం లేకుండా బ్రతికేవాడు తన సంభావ్యత ఏంటో తాను ఎప్పటికీ తెలుసుకోలేడు. మొత్తంగా ఒక్క వాక్యంలో చెప్పాలంటే జీవితాన్ని ఆనందించాలంటే, మీరందరూ జీవితంలో నష్టం జరుగుతుందనే నిజాన్ని అంగీకరించాలి. అలా అంగీకరించాలి అంటే ప్రతికూల దృశ్యమానం చేయాలి. ప్రతికూల దృశ్యమానత అనేది ఒక బలహీనత కాదు, అది నిజాన్ని అంగీకరింపజేసే బలం.
ఇతర కథనాలు:
మెషిన్‌లా పని చేస్తున్నారా? మీ మెదడు పంపిస్తున్న బ్రెయిన్ ఫాగ్ ప్రమాద హెచ్చరికను గమనించండి!
రోజూ బ్రెడ్ తింటున్నారా? దీనిని ‘వైట్ పాయిజన్’ అంటారు..!
పురుషులకే ఎందుకు బట్టతల వస్తుంది?










