HEALTH & LIFESTYLETelugu News

వేసవిలో చర్మ రక్షణకు ఇంటి చిట్కాలు

వేసవికాలంలో ఎండ వేడిమి అధికమైన చెమటతో శరీరం కళావిహీనంగా మారుతుంది. ముఖ్యంగా మహిళల శరీరం సున్నితంగా ఉండటం వల్ల ఎండవేడికి కందిపోయి నల్లగా మారుతుంది. అంతేకాకుండా బయటికి వెళ్లినప్పుడు చర్మం దద్దుర్లతోపాటు నిర్జీవంగా మారుతుంది. వేసవి కాలంలో చర్మానికి జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా కాలాలలో చర్మం పట్ల చూపించిన శ్రద్ధ కంటే ఎక్కువగా ఎండాకాలంలో శ్రద్ధ చూపించాలి. సాధారణంగా తీసుకునే ఆహారంతో పాటు అధికంగా నీరు ఉండే పళ్లు, రసాలు తీసుకోండి. చర్మాన్ని ఎల్లవేళలా రక్షించుకునేందుకు తగిన క్రీములు, ఫేస్‌ప్యాక్‌లు వేసుకోవడం వంటివి చేయాలి. తరచూ ముఖాన్ని చల్లని నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. అలాగే ముఖంపై ఉండే మృతకణాలను తొలగించుకునేందుకు ప్రయత్నించాలి. ఈ క్రమంలో డాక్టర్లు వేసవికాలంలో చర్మ సంరక్షణకు పలు జాగ్రత్తలు పాటించాలని సూచనలు చెబుతున్నారు అవేంటో తెలుసుకుందాం.

ముఖానికి ఆవిరి…

పెరుగుతున్న కాలుష్యం ప్రభావంతో పాటు వేసవి కాలం ప్రభావం మన చర్మంపై తీవ్రంగా కనిపిస్తుంది. చర్మంపై పేరుకుపోయిన కాలుష్యాన్ని తొలగించడానికి  ఆవిరి సహాయం తీసుకోవచ్చని వైద్యులు అంటున్నారు. ముఖానికి ఆవిరిని పట్టడం వల్ల స్వేదరంధ్రాలు తెరుచుకుంటాయి. దీంతో చర్మం రంగు రావడంతో పాటు మెరిసిపోతుంది.

కూలింగ్ గ్లాసెస్ తో రక్షణ…

వేసవిలో బయటకు వెళ్లినప్పుడు..సూర్యరశ్మి తగలకుండా.. కూల్‌ గ్లాసెస్‌, గొడుగు కచ్చితంగా తీసుకెళ్లాలి. కూలింగ్ గ్లాస్  కళ్ళకు రక్షణ గా నిలుస్తాయి.  వేసవిలో వచ్చే కంటి దురదలు, కళ్ళ నుండి నీరు కారడం వంటి సమస్యల నుండి ఈ చలువ కళ్ళద్దాలు కాపాడుతాయి. అదేవిధంగా  వీలైనంత వరకు ఎండ తగలకుండా ముఖం, తలపై స్కార్ఫ్ కట్టుకోవడం మంచిది.  దీనివల్ల జుట్టు సమస్యలు కూడా నివారించవచ్చు.

నీటితో డీహైడ్రేట్ కు చెక్…

వేసవి కాలం ఎక్కువ సూర్యరశ్మి టాన్ చేయడమే కాకుండా కఠినమైన సూర్య కిరణాల వల్ల చర్మం అకాల వృద్ధాప్యానికి కారణమవుతుంది. దీనివల్ల శరీరంలో పాదరసం స్థాయి పెరుగుతుంది.  చర్మం మృదువుగా మెరుస్తూ అందంగా ఉండడం చాలా కష్టమవుతుంది . వేసవికాలంలో చర్మాన్ని ఎక్కువగా హైడ్రేట్ గా ఉంచుకోవాలి. సూర్యుడి నుండి మన చర్మాన్ని రక్షించుకోవడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి.  వేసవికాలంలో మన చర్మం తేమను కోల్పోకుండా చూసుకోవాలి. శరీరాన్ని బాగా హైడ్రేట్ గా ఉంచుకోవడం కోసం ఎక్కువగా నీటిని తాగాలి అంటున్నారు వైద్యులు. రోజుకు 10-12 గ్లాసుల నీరు తాగడం వల్ల  శరీరం ప్రేమగా మారుతుంది. అంతేకాకుండా ఈ కాలంలో పుష్కలంగా పండ్లు తినండి.  పండ్ల రసాల వల్ల చర్మం సున్నితంగా మారి అందంగా కనిపిస్తుంది.

సన్ స్క్రీన్ లోషన్ చాలా ముఖ్యం…

ఈ కాలంలో ప్రతి ఒక్కరూ సన్ స్క్రీన్ లోషన్ వాడడం వల్ల చర్మాన్ని కందిపోకుండా చూసుకోవచ్చు. ఎండవేడికి బయటికి వెళ్లినప్పుడు సూర్యకిరణాలు నేరుగా మన శరీరంపై పడతాయి. దీనివల్ల చర్మం నల్లగా మారి పొడిబారుతూ రంగును కోల్పోతుంది. ఈ సమస్యకు సన్ స్క్రీన్ లోషన్ తో చెక్ పెట్టవచ్చు. సన్‌స్క్రీన్ మీ చర్మాన్ని హానికరమైన UV రేడియేషన్‌ల నుండి రక్షిస్తుంది, ఇవి చర్మ వృద్ధాప్య ప్రారంభ ప్రారంభానికి ప్రధాన ప్రమాద కారకంగా ఉంటాయి. ముఖం, చేతులు, మెడ భాగాలపై సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించడం వల్ల సూర్య కిరణాలు శరీరాన్ని దెబ్బతీయకుండా ఉంటాయి.

మేకప్ కు దూరంగా ఉండాలి…

ఆడవారి అందం మేకప్ తో మరింత కళగా మారుతుంది. అయితే వేసవికాలంలో మాత్రం భారీ మేకప్ కు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. వేసవిలో మీ మేకప్ తక్కువగా ఉంచండి. ఎక్కువ మేకప్ మీ చర్మం యొక్క సహజ మెరుపును దూరం చేస్తుంది. ముఖాన్ని సహజంగా ఉంచుకుంటే మంచిది. ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పుడు  మేకప్ వేయవలసి వస్తే,  రాత్రి పడుకునే ముందు దానిని తీయండి. మనిషి ఊపిరి పీల్చుకోవడం వల్ల ఎలా బ్రతుకుతారో, చర్మం కూడా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటుంది కాబట్టి భారీగా మేకప్ వేయకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

శరీరానికి మాయిశ్చరైసర్ తప్పనిసరి…

శరీరానికి మాయిశ్చరైసర్ శరీరాన్ని తేమగా ఉంచడానికి చాలా బాగా పనిచేస్తుంది. వేసవి లేదా శీతాకాలం, ఎల్లప్పుడూ నిద్రించే సమయానికి ముందు రాత్రిపూట ముఖాన్ని, కాళ్లు, చేతులని శుభ్రం చేసుకోవాలి. అనంతరం ఒక ఐదు నిమిషాల పాటు చర్మంపై మాయిశ్చరైసర్ రాస్తూ మర్దన చేయాలి. సహజ ఉత్పత్తులయిన పాలు, తేనెను ఉపయోగించండం వలన శరీరానికి మంచి పోషణ లభిస్తుంది.

నిమ్మరసం, టమాటో ఫేస్ ప్యాక్…

టమోటాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  వేసవిలో ముఖాన్ని తాజాగా, చల్లగా ఉంచడంలో టమాటాను మించింది లేదు. టొమాటో, నిమ్మరసం మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ లా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేయాలి. 10 నిమిషాలు అలాగే ఉంచి,  చల్లటి నీటితో కడగాలి. దీని ద్వారా చర్మం  చల్లబడడమే కాకుండా, హైడ్రేట్ గా ఉంటుంది. ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకోవచ్చు.

కొన్ని ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌లు వేసవిలో మీ చర్మానికి అద్భుతాలు చేస్తాయి. మృదువుగా మరియు హైడ్రేటెడ్ గా ఉంచడానికి. పాలు, తేనె మరియు ఓట్‌మీల్‌తో చేసిన DIY ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని మృదువుగా మరియు హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ఫ్రూట్ ఫేస్ ప్యాక్‌లు మరియు షీట్ మాస్క్‌లు శనగపిండి వంటి ఫేస్ ప్యాక్ లు చర్మాన్ని కోమలంగా మారుస్తాయి.

ముఖానికి స్క్రబ్ అలవాటు చేసుకోవాలి…

ముఖం అందంగా మారాలంటే స్క్రబ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. రోజుకు రెండు సార్లు ముఖాన్ని చల్లని మంచినీటితో శుభ్రపరుచుకోవాలని, వారానికి రెండు, మూడు సార్లు స్క్రబ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది రంధ్రాల లోపల పేరుకుపోయిన ధూళిని వదిలించుకోవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మం పై ఉన్న రంధ్రాలు తెరుచుకొని చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.

వేసవి కాలంలో ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా తళతళలాడే అందం మీ సొంతం అవుతుంది. దీంతోపాటు చర్మ సమస్యలు తొలిగిపోతాయని వైద్యులు చెబుతున్నారు.

Show More
Back to top button