Telugu News

2024 బడ్జెట్: పన్ను విధానంలో మార్పులు

సాధారణంగా గతంలో రూ.3-6 లక్షల శ్లాబులో 5 శాతంగా పన్ను ఉండేది. కానీ, ఇప్పుడు దీనిని రూ.7 లక్షలకు పెంచారు. ఆ మేర శ్లాబుల్లో స్వల్ప మార్పు చేశారు. గతంలో రూ.6-9 లక్షల శ్లాబుకు 10 శాతం పన్ను ఉండేది. అది కూడా రూ.7-10 లక్షలకు మారింది. దీంతో రూ.10 లక్షల వార్షికాదాయం ఉన్న వారికి 10 శాతం పన్ను వర్తించనుంది. ఈ మార్పులు పాత పన్ను విధానం ఎంచుకునే వారికి వర్తించవు.

కొత్త శ్లాబులు ఇలా..

రూ.0-3 లక్షల వరకు పన్ను సున్నా

రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్ను

రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను

రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను

రూ.12- 15 లక్షల 20 శాతం పన్ను 

రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను

Show More
Back to top button