HEALTH & LIFESTYLE

ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగడం మంచిదేనా?

ఎండాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో డీ హైడ్రేషన్ సమస్య అధికంగా ఉత్పన్నమవుతుంది. దీన్ని తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరు వాటర్ తాగాల్సిందే. కానీ అందరూ చల్ల చల్లగా తినడానికి, తాగడానికి ఇష్టపడతారు. తరుచూ ఫ్రిడ్జ్‌లో పెట్టిన కూల్‌ వాటర్‌ తాగుతారు. మరి ఇలా కూల్ వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? అని ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎక్కువ కూలింగ్ ఉన్న వాటర్ తాగటం ఏ సీజన్‌లోనైనా మంచిది కాదు. జీర్ణక్రియ సక్రమంగా జరగాలంటే సాధారణ ఉష్ణోగ్రత ఉండాలి. చల్లటి నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ చల్లని నీళ్లను వేడిగా మార్చే పనిలో పడుతుంది. దీంతో ఫుడ్‌‌ సరిగ్గా జీర్ణం కాక పోషకాలు శరీరానికి అందవు. కడుపు నొప్పి, వికారం, మలబద్ధకం, గ్యాస్‌‌ ట్రబుల్ వంటి సమస్యలు ఏర్పడుతాయి. కూల్‌‌ వాటర్‌‌‌‌ ఎక్కువ తాగితే తలనొప్పి, సైనస్‌‌ ప్రాబ్లమ్స్‌‌ వస్తాయి.

ఫ్రిజ్డ్ డోర్ రోగాలకు దారి

చల్లని నీళ్లు తాగినప్పుడు బ్రెయిన్‌‌ ఫ్రీజ్ అవుతుంది. అంటే కొన్ని సెకన్ల పాటు నరాలు చల్లబడి జివ్వుమని నొప్పి పుడుతుంది. ఇలా జరిగితే బ్రెయిన్‌‌ పై ప్రభావం పడే ప్రమాదం ఉంది. గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థలను కంట్రోల్‌‌ చేసే వాగస్‌‌ నాడి శరీరంలో మెడ దగ్గర ఉంటుంది. కూల్‌‌ వాటర్‌‌‌‌ తాగడం వల్ల నాడీ వ్యవస్థ చల్లపడి హార్ట్‌‌ రేట్‌‌, పల్స్‌‌ రేట్‌‌ తగ్గి, హార్ట్ఎటాక్‌‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. తిన్న వెంటనే కూల్‌‌ వాటర్ తాగితే శరీరం లోని కొవ్వు బయటికి పోదు. దీంతో బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బరువు తగ్గాలనుకున్న వాళ్లు కచ్చితంగా కూల్‌‌ వాటర్‌‌‌‌కు దూరంగా ఉంటే మంచిది. ఎండాకాలంలో ఎక్కువ కూల్‌ వాటర్‌ తాగే బదులు ఫ్రూట్స్ తినడం, కొబ్బరి నీళ్లు తాగడం బెటర్‌‌‌‌. ఇలా చేస్తే హెల్దీగా ఉండొచ్చు. ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుంది. ఎక్కువ చల్లగా ఉండే నీళ్లను తాగకుండా.. కుండలోని లేదా నార్మల్ కూల్ ఉన్న వాటర్ తాగవచ్చు అని ఆహార నిపుణులు చెబుతున్నారు.

Show More
Back to top button